Posts

Showing posts from October, 2020

బౌద్ధం పునాదులపై లేచిన వైదిక ధర్మం

భారతదేశంలో బౌద్ధం క్షీణించడానికి కొన్ని శతాబ్దాల కాలం పట్టింది. పైగా అది అనేక కారణాల వల్ల కూడా క్షీణిస్తూ వచ్చింది. గుప్తకాలం (320-650సీ.ఈ) పరిసమాప్తమైన తర్వాత, బౌద్ధ సంఘాలకు ఆర్థిక వనరులు తగ్గుతూ వచ్చాయి. అప్పుడు ఉన్న చిన్న చిన్న రాజ్యాల పరిపాలకులు హిందూ సంస్థలకు, బ్రాహ్మణులకు సహాయం అందిస్తూ ఉండేవారు. దానితో శైవులు, వైష్ణవులు బలపడుతూ వచ్చారు. రాజకీయంగా కూడా వారి పెత్తనం కొనసాగడం ప్రారంభమైంది. మరో వైపు బౌద్ధారామాల మీద బౌద్ధ భిక్కుల అజమాయిషి తగ్గుతూ వచ్చింది. ఆ తర్వాత కాలంలో 7-8 శతాబ్దాలలో వచ్చిన కర్కోటక, ప్రతిహర, రాష్ట్రకూట, పాండ్య, పల్లవ వంశాల రాజకుటుంబాలన్నీ హిందూ ధర్మం వైపు, బ్రాహ్మణవాదం వైపు మొగ్గుచూపాయి. అందువల్ల బౌద్ధారామాలు మార్చుకోవడం, బౌద్ధ విగ్రహాలు మార్చుకోవడం తేలికైంది. అంతకు ముందు వెయ్యి సంవత్సరాలుగా విస్తరించిన బౌద్ధం క్రమంగా బలహీన పడుతూ వచ్చింది. భారతదేశపు ఉత్తర ప్రాంతం నుంచి హుణులు, మంగోలులు, పర్షియన్‌లు చొరబడ్డారు. ఢిల్లీ సల్తనత్‌ జనరల్‌ మహ్మద్‌బిన్‌ భక్తియార్‌ ఖిల్జీ బెంగాల్‌ బీహార్‌లలో ఇస్లాంను వ్యాపింపచేశాడు. నలంద, విక్రమశిల, ఒదంతపురి లాంటి వన్నీ ధ్వంసం చేశాడు. బౌద్...