దీనదయాళ్ ఉపాధ్యాయ మానవతావాద తాత్విక చింతన
దీనదయాళ్ ఉపాధ్యాయ మానవతావాద తాత్విక చింతన దీనదయాళ్ ఉపాధ్యాయ సెప్టెంబర్ 25, 1916 రాజస్థాన్‌లోని ధంకియాలో జన్మించారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను, తమ్మున్ని కోల్పోయారు.అతను పిలానీలోని GD బిర్లా కళాశాలలో , కాన్పూర్ విశ్వవిద్యాలయంలోని సనాతన్ ధర్మ కళాశాలలో చదివాడు. సివిల్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణుడైనా ఉద్యోగం లో చేరకుండా ప్రజాసేవకే అంకితమయ్యాడు ఉపాధ్యాయ. 1937లో 26 ఏళ్ల వయసులో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS) లో చేరి జీవితకాల ప్రచారక్‌గా తన ప్రజా జీవితాన్ని ప్రారంభించాడు. స్వయంసేవక్ సంఘ్ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించాడు. ఆర్ఎస్ఎస్ కొలనులో పుట్టినదే జన సంఘ్. అదిప్పుడు భారతీయ జనతా పార్టీ గా మారింది. జనసంఘ్ ప్రారంభం నుండి 1967 వరకు దాని ప్రధాన కార్యదర్శి పనిచేశాడు. భారతీయ జనసంఘ్‌లో 51 ఏళ్ల వయసులో అధ్యక్షుడైనాడు. ఆర్ ఎస్ ఎస్ రాజకీయ అంగమే జనసంఘ్. ఆర్.ఎస్.ఎస్. తన హిందూత్వ సిద్దాంతాన్ని అమలు చేయడానికి ఒక రాజకీయ పార్టీ కావాలని నిర్ణయించి, దా...