యజుర్వేద, అధర్వ వేద కాలానికి మారిన సామాజిక స్థితిగతులు.
యజుర్వేద, అధర్వ వేద కాలానికి మారిన సామాజిక స్థితిగతులు. __రచయిత హైదరాబాద్లోని ఇసిఐఎల్లో రిటైర్డ్ సీనియర్ మేనేజర్. ఋగ్వేదం లాగానే యజుర్వేదం, అధర్వవేదం కూడా ప్రధానంగా కర్మకాండకు సంబంధించిన మంత్రాల సంకలనాలే. కొత్తగా మంత్రాలు అవసరం అయ్యాయి అంటేనే సమాజం మారిందని అర్థం. సమాజంలో మార్పు లేకపోతే ఋగ్వేదమే సరిపోయేది. కాబట్టి ఋగ్వేదం లోని విషయాలను యజుర్వేదం తో పోలిస్తే క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల ముందు కాలానికి, తరువాతి కాలానికి వచ్చిన మార్పు అర్ధం అవుతుంది. క్రీస్తు పూర్వం 1000 నుండి ఆర్యులు సింధు నదీ పరీవాహక ప్రదేశం నుండి తూర్పుకు విస్తరించారు. ఈ విస్తరణ క్రమం సింధూ లోయలకు, గంగా యమునా లోయలకు మధ్యనున్న ప్రాంతాన్ని, గంగా యమునా లోయల పైభాగానికి విస్తరించ బడినది, అది ఇప్పటి హర్యానా, ఢిల్లీ, పశ్చిమ ఉత్తర ప్రదేశ్, మద్ర రాజ్యమైన పంజాబ్ సరిహద్దుల్లోను, మత్స్య రాజ్యమైన రాజస్థాన్ భూభాగం అన్నమాట. ఆర్యులు గణవ్యవస్థను ఛేదించుకొని మెల్లమెల్లగా రాచరికాలను ఏర్పరుచుకున్నారు. ఋగ్వేద కాలంలో రాజ్యాలు లేవు. భరత, పురు అన్న ప్రధాన తెగలకు చెందిన ప్రజలు కలిసి "కురు" అన్న తెగ గా మారారు. రుగ...