హిందూత్వమనేది భారతీయ విలువలకు వ్యతిరేకం
హిందూత్వమనేది భారతీయ విలువలకు వ్యతిరేకం అసమానతలకు వ్యతిరేకంగా నిలబడిన బౌద్ధ మతాన్ని అస్పృశ్యకులాలు, బహుజనులకు చెందిన ప్రజలు ఎక్కువగా ఆదరించారు. పతంజలి (క్రీ. పూ. 150) తన ‘మహాభాష్యం’ లో శ్రమణులు బ్రాహ్మణులు పాము ముంగిస లాగా శత్రువుల వంటివారని రాశాడు. బ్రాహ్మణమతం, బౌద్ధమతాల మధ్య ఈ చిరకాల విరోధం ఉన్నట్లు రెండు మత సాహిత్యాల్లోనూ విస్తారంగా ఉంది. అంతకంటే ముఖ్యంగా.. దేశంలోని వివిధ ప్రాంతాల్లో బౌద్ధ స్మారకాలను ధ్వంసం చేయటం లేదా సంలీనం చేసుకున్న పురావస్తు ఆధారాలు భారీ స్థాయిలో ఉండటం దీనిని నిర్ధారిస్తోంది. నిజానికి, దేశంలో బౌద్ధమతం అంతర్థానమవటం వెనుక ప్రధాన కారణం, దానికి వ్యతిరేకంగా బ్రాహ్మణమతం దాడి చేయటమే. బ్రాహ్మణమతం ఎన్నడూ బౌద్ధమతంతో సయోధ్య కుదుర్చుకోలేదని ఇది స్పష్టం చేస్తోంది. కాబట్టి, హిందూమతం సహనశీల మతమనే ఆలోచనకు సరైన ప్రాతిపదిక లేదు. భారతీయ సంస్కృతిని సుసంపన్నం చేయడంలో బౌద్ధం ఆ తర్వాతఇస్లాం మతం నిర్వహించిన పాత్ర విశిష్టమైనది. ...