Posts

Showing posts from June, 2020

మకర సంక్రాంతి

సంక్రాంతి కాదు ఇది పొంగల్ ఉత్సవం          భారత దేశ ప్రజలు ముఖ్యoగా శ్రమ జీవులైన సాధారణజనాల పండగలు పూర్తిగాబ్రహ్మణీకరించబడ్డాయి. హరప్పా నాగరికత తో విలసిల్లిన భారత ఉపఖండాన్ని ప్రాచీన బ్రాహ్మణీయ వ్యవస్థ వేదకాలం నుండి పూర్తిగా వారి ఆధీనoలోకి తీసుకువెళ్లడం లో విజయం సాధించింది. వేదకాలం తరువాత బుద్ధుని కాలం లో బ్రాహ్మనీయ విధానం పూర్తిగా తప్పుడు సిద్ధాంతం అని తథాగతుని బోధనల వలన ఈ దేశ ఉపఖండ ప్రజలు తెలుసుకున్నారు. బుద్ధుని బోధనలు  క్రీ.పూ. 5 వ శతాబ్దం నుండి  మొదలయ్యాయి. దీనిని పూర్తిగా ప్రజల్లోకి తీసుకుపోయింది సామ్రాట్ అశోకుడు .సుమారు 5 శతాబ్దం నుండి క్రీస్తు శకం 15 శతాబ్దం వరకు బౌద్ధం ఈ దేశం లో విలసిల్లింది. భారతదేశ చరిత్ర మొత్తం "బౌద్ధానికి బ్రాహ్మనిజానికి మధ్య జరిగిన సంఘర్షనే" అని డాక్టర్ అంబేడ్కర్ విశదీకరించారు.సుమారు రెండువేల ఏళ్ల బౌద్ధకాలం లో అనునిత్యం బౌద్ధం బ్రాహ్మనిజంతో సంఘరిస్తూనే ఉంది.భారత దేశం లో అనాదిగా కష్టజీవులు ,ఇష్టం గా శ్రమ జేసే శ్రామికులు.శ్రమ చేస్తున్న శ్రామిక ప్రజానీకం ఉత్సాహాలను వేడుకలను  బ్రాహ్మణీకరించింది బ్రాహ్మణ పూజారి వర్గం. శ్రామ...

హిందూధర్మం పై నిరసన సనాతనమైంది.

Image
అధిపత్య హిందువుల నుండి సాధారణంగా ఎదురయ్యే ప్రశ్న. “మీరు హిందూమతాన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? క్రైస్తవుల పాపాలు కనప డవా? ముస్లిముల దురాగతాలు కనపడవా?” అని. కానీ లెఫ్టిస్టులు లేదా వామపక్షవాదులు అని పిలవబడే వారు మైనారిటీల గురించి, మైనారిటీల హక్కుల గురించి మాట్లాడతారని వాళ్ళు మతాన్ని బట్టి మైనారిటీలు అవ్వవచ్చు, కులాన్ని బట్టి అవ్వవచ్చు లేదా జీవిస్తున్న ప్రదేశాన్ని బట్టీ అవ్వవచ్చు. మన దేశంలో ముస్లింల హక్కుల గురించి పోటాడేది వాళ్ళే.ముస్లిం మెజారిటీ దేశంలో హిందూ హక్కుల గురించి పోట్లాడేది వాళ్ళే! ఇక్కడ హిందూ మతం మెజారిటీ ప్రజల మతంగా వుంది గనుక అది వామపక్షాల నుండీ, లౌకికవాదుల నుండీ, రాజ్యాంగవాదుల నుండీ ఎక్కువ విమర్శను పోరాటాన్ని ఎదుర్కోవడం వింత కాదు, సహజాతి సహజం. అలాగని మిగిలిన మతాలను నెత్తికెత్తుకున్నట్టు కాదు. మిగిలిన మతాలను సమర్థించినట్లు కాదు. ఓ మతం వల్లో, కులం వల్లో మైనారిటీలుగా వివక్షను ఎదుర్కొంటున్న ప్రజల పక్షాన మాట్లాడటం అంటే ఆ ప్రజల మతం పక్షాన మాట్లాడటం కాదు.ఇది ఎక్కువ మంది గ్రహించలేకపోతున్నారు. హిందూ మతంలోని వివక్ష గురించీ, కుల మెట్ల గురించి మాట్లాడినప్పుడల్లా ఇదేదో మ...

వేదాలు ఎప్పటివి?

Image
               రుగ్వేదం క్రీ.పూ.2000-1500లో వచ్చింది.ఇది పూర్తిగా ఆర్యుల జీవన విధానం తెలియ జేస్తుంది.ఇందులో ఆనాటి ఆచార వ్యవహారాలు తెలుస్తాయి.ఈ కాలంలో ప్రజలు ఆహారసేకరణ దశలో ఉన్నారు. వారికి భాషకు లిపి లేదు. వ్యవసాయం చేయడం వారికి తెలీదు. ఆర్యులకు గుర్రాలు తోలడం తెలుసు. ఇది పూర్తిగా గణ సమాజం. విజ్ఞానం పూర్తిగా వికసించి దశ ఇది. ఇనుము ను అప్పటికింకా కొనుక్కోలేదు.       అధర్వణ వేదంలో అనారోగ్యలకు మంత్రాలు ఉన్నాయి. ఇది క్రీస్తుపూర్వం 1200 లో వచ్చిందన్నారు పరిశోధకులు. ఆరోగ్యాన్ని గురించి అశ్వినీ గణం చూసేది. అందువల్ల ఆరోగ్య దేవతలుగా వారిని కీర్తించారు. తరువాత కాలంలో ఆ దేవతలను పక్కన పెట్టేశారు. ఉదాహరణకు  మంత్రాలకు అర్థం చూస్తే          రుగ్వేదాన్నిగానం చేసే విధానాన్ని సామవేదం లో పొందుపరిచారు. ఇది క్రీస్తు పూర్వం 1100 వచ్చింది.        యజుర్వేదం క్రీ.పూ. 1000-600 లో వచ్చింది. ఇందులో యజ్ఞయాగాదుల విధానాలను చెప్పి నారు. దీనిపై శతపథ బ్రాహ్మణంలో వ్యాఖ్యానం చెప్పినారు.       ...

గోపురం

హిందూ సమాజం అనేక అంతస్థుల గోపురం. దీని నుండి బయటకు వెళ్ళడానికి ఒక నిచ్చెన కానీ  తలుపు కానీ లేదు. అందువల్ల అంతస్థుల మార్పిడి చేసుకోవడానికి మార్గం లేదు. ఒక ప్రత్యేక అంతస్తులో జన్మించినవారు ఆ అంతస్థులోనే చనిపోతారు. ఎంత గొప్ప సామర్ధ్యాలు ఉన్నప్పటికీ, అతి తక్కువస్థాయి అంతస్థులో ఉన్న వ్యక్తి ఉన్నతస్థాయికి వెళ్ళలేడు. ఉన్నతస్థాయిలో ఉన్న వ్యక్తి చాలా అసమర్థుడైనప్పటికీ అతను క్రింది స్థాయి అంతస్తుకు నెట్టివేయబడడు ..........   జీవంలేని వాటిల్లో కూడా దేవుడు ఉన్నాడని నమ్ముతున్న సమాజంకు, ఆ సమాజంలో భాగమైన ప్రజలు మాత్రం అంటరానివారు  "                                       _అంబేద్కర్

ఇస్లాం మతం-తాత్విక భావనలు

Image
ఇస్లాం మతం-తాత్విక భావనలు        pc: Wikipedia             అరేబియన్ ఎడారిలో ని మక్కా అనే చిన్న పట్టణంలో మహమ్మద్ 570 సంవత్సరంలో పుట్టాడు. భర్తను పోగొట్టుకున్న ఒక ధనిక స్త్రీని పెళ్ళాడాడు.  40 ఏళ్ళ వయసులో అతనికి భగవంతుని సంబంధించిన ఆలోచనలు ప్రారంభమయ్యాయి.       అల్లా ఒక్కడే దేవుడు.ఆయన పంపిన  ప్రవక్తను నేనని ప్రకటించుకున్నాడు మహమ్మద్. అబ్రహం, మోజస్, జీసస్ లాంటి ప్రవక్త ల లాగా మహమ్మద్ చివరివాడు. మక్కాలో కాబా  అనే నల్లరాతి ముస్లిమేతర దేవాలయం చాలా కాలంగా ఉండేది .అందులో దాదాపు 360 విగ్రహాలుండేవి. అరేబియా లోని అన్ని ప్రాంతాల నుంచి యాత్రికులు ఆ దేవాలయానికి వచ్చేవారు. మహమ్మద్ దానికి వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభించాడు. దాంతో స్థానికులు అతని మీద దాడి చేశారు.  అందువలన ఆయన అక్కడికి 150 మైళ్ళ దూరంలో ఉన్న మదీనా పట్టణానికి పారిపోయాడు. అక్కడ ఆయన ప్రవచనాలను అక్కడి ప్రజలు శ్రద్ధగా విన్నారు.  మెల్లగా మదీనా మొదటి ముస్లిం రాజ్యం గా అవతరించింది. మొట్టమొదటి మసీదు ఒకటి అక్కడే నిర్మించబడింది .పదివేల సైన్యాన...

పితృస్వామిక సమాజం

Image
        photo: thoughtco.com నాగలి వాడకం పెరిగాక వ్యవసాయంలో స్త్రీలు పాల్గొనడం కష్టమైంది భూమిని దున్నడం పురుషుల పనిగా మారింది. పనిముట్లలో సాంకేతిక అభివృద్ధి పెరిగేకొద్దీ సమాజంలో ఉత్పత్తి పెరిగి మిగులు ఏర్పడడం మొదలైంది ఆ మిగులు పై వ్యక్తిగత యాజమాన్యం ఏర్పడింది తయారైన స్త్రీకి యాజమాన్యం సంక్రమిస్తే ,పనిముట్ల పై పశువులపై మగవారికి యాజమాన్యం సంక్రమించింది. ఉత్పత్తి స్థాయి పెరిగే కొద్దీ మగవారికి ఆస్తిపై యాజమాన్య హక్కు పెరుగుతూ వచ్చింది. అయితే ఆ ఆస్తిని తన సంతానానికి అందించే వారసత్వ హక్కు లేకుండా ఉంది. దాంతో ఉత్పత్తిపై తనకు పెరిగిన యాజమాన్యపు హక్కును వినియోగించుకుని మాతృస్వామిక సమాజాన్ని మగవాడు పితృస్వామిక సమాజంగా మార్చేశాడు. దాంతో మగవాని ఆస్తి అతని సంతానానికి వారసత్వంగా చెందే పద్ధతి వచ్చింది. ఈ వ్యక్తిగత ఆస్తి హక్కును కాపాడుకోవడానికి గణసమాజ వ్యవస్థ పనికిరాకుండా పోయింది .అందువలన గణ సమాజాలు కలిసి తెగలుగా ఏర్పడిన పరిస్థితిలో అన్నీ కలిసి సమాఖ్యగా ఏర్పడ్డాయి. ఉత్పత్తి అభివృద్ధి చెందే కొద్దీ వ్యక్తిగత ఆస్తిని పెంచుకునే  క్రమంలో  గణ వ్యవస్థ విచ్ఛిన్నమైంది. ...

మాతృస్వామిక సమాజం

Image
        photo: indiatoday.com       గణ సమాజం వ్యవసాయక సమాజంగా మారడంతో స్థిర జీవితం ప్రారంభమైంది. కొన్ని  గణాలు దగ్గరగా స్థిరపడి తెగలుగా పరిణమించాయి. తెగలోని వారందరికీ ఒకే భాష ఒకే ఆచారం ఏర్పడ్డాయి. తెగలోని వారి మధ్య వచ్చే తగవులు తీర్చడానికి తెగకు ఒక పెద్దల సమితి నాయకత్వం వహించేది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆ నాయకులందరూ కూర్చునేవారు. పెద్దల సమితిలో పురుషులకు స్త్రీలకు మధ్య తేడా ఏమీ లేదు. స్త్రీలు సంతానాన్ని కనడం ,పెంచడం వ్యవసాయం చేతివృత్తుల్లో స్త్రీల పాత్ర అధికంగా ఉండేది. వీరు ఎవరి కెంత ఆహారం కావాలో అంతే ఇచ్చేవారు. దీనిని ఆదిమ సోషలిస్టు సమాజం అన్నారు. మహాభారతం కథలో కుంతి తన పిల్లలకు అలాగే ఆహారాన్ని పంచుతుంది.       వ్యవసాయం ప్రారంభించింది స్త్రీలే .ఆహారం కోసం గింజలు సేకరించే పనిని స్త్రీలు చేసేవారు. మెత్తటి నెలలో గింజలు పడితే అవి మొలకెత్తి మొక్కలుగా మారి ఎన్నో గింజలు ఇస్తాయని తెలుసుకున్నారు. నేలను తవ్వి గింజలు నాటడం ప్రారంభించారు .తవ్వడం కోసం కొయ్యనాగలిని   కనుగొన్నారు. చెట్లు నరకడానికి గొడ్డలి, కోయడానికి...

హిందూమతం _ చారిత్రక ఆధారాలు

             భారత చరిత్రలో స్వర్ణయుగం అనేది ఏదీ లేదని చారిత్రక ఆధారాలు స్పష్టంగా చెప్తున్నాయని చెపుతారు ప్రొఫెసర్ ప్రొఫెసర్ ద్విజేంద్ర నారాయణ్ ఝా.        ప్రాచీన కాలంలో కులమనేది చాలా కఠోరంగా ఉండేదని, బ్రాహ్మణేతరుల మీద - ప్రత్యేకించి శూద్రులు లేదా అస్పృశ్యుల మీద సామాజికంగా, చట్టపరంగా, ఆర్థికంగా అనేక ప్రతిబంధకాలు విధించారు. దీనికి చాలా  ఆధారాలు  ఉన్నాయంటారు ఝూ. అయితే, అగ్ర కులాలు, కులీనులు, భూస్వామ్య వర్గాల వారు మన కాలంలో అంబానీలు, అదానీల లాగానే సంతోషంగా సుసంపన్నంగా ఉన్నారన్నది నిజమే. స్వర్ణయుగంలో ఇటువంటి వాళ్లు ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటారన్నది మనకు తెలిసిందే.       గుప్తుల పాలన కాలం స్వర్ణయుగమని, జాతీయవాదాన్ని గుప్తులు పునరుద్ధరించారని పంతొమ్మిదో శతాబ్దం చివర్లోను, ఇరవయ్యో శతాబ్దం ఆరంభంలోను చరిత్రకారులు వాదించారు. ప్రఖ్యాత భారత చరిత్రకారుడు డి.డి.కోశాంబి  ప్రకారం, గుప్తులు జాతీయవాదాన్ని పునరుద్ధరించటం కన్నా - జాతీయవాదమే గుప్తులను పునరుద్ధరించింది. మధ్య యుగాన్ని ముస్లిం పాలకుల క్రూర పరిపాలనా కాలంగా చిత్రీకరిం...

ఆవు పూజ్యమా ? భోజ్యమా?

Image
            ఆవు (cow) ఆవు (గోవు) పవిత్రమైన జంతువనడం, ఆవు మూత్రాన్ని తన్మయత్వంతో త్రాగడం మనకు కొత్తగాదు.  “నబ్రహ్మణాం పరివదేత్, నగవాయ్ దండ ఉద్యచ్చేవ్' (బ్రాహ్మణులను తూలనాడరాదు. ఆవులను కొట్టరాదు) అంటూ దైవం, బ్రాహ్మణులతో బాటు, ఆవును కూడా పూజించాలని ప్రాచీన ధర్మశాస్త్రాలలో చెప్పినారని చెపుతుంటారు. కానీ అది వాస్తవం కాదని, వేద కాలం నుంచి అంటే క్రీ.పూ.1500 నుండి కూడా  గోమాంసం తీసుకునేవారని ప్రాచీన సాహిత్యం ద్వారా తెలుస్తోంది.  1 - “ అధో అన్నం వాయ్ గోవా” –  "వాస్తవానికి గోవు మన ఆహారం “. – (ఐతరేయ బ్రాహ్మణం: - 111.9.8 )  2 - “ మాంసం లేకుండా మధువు ను తీసుకోవడం సాధ్యంకాదు “(ఆశ్వలాయన గృహ్య సూత్రం:1-4)  3 - "పండితుడు , ప్రసిద్ధుడు , సామాజికుడు , శ్రోతలున్న వక్త , వేదపాటి , దీర్గాయుష్మంతుడు  అగు పుతున్ని కనాలన్న కోరికగల తల్లి, ఆబోతు లేదా ఎద్దు మాంసం నేతితో వండుకొని తినవలయును"  (బృహదారణ్యకం ) 4 – “ వయస్సు లో వున్న దూడది కానీ , లేదా ముదురు వయస్సు లో వున్న ఎద్దుది కానీ భుజించాలి “  (శంకారాచార్యులు) 5 – “ నా శరీరం మాంసమ...

ప్రాచీన నమ్మకాలు వాస్తవాలు

Image
 ప్రాచీన నమ్మకాలు వాస్తవాలు              photo: Wikipedia    భూమి  చాప లాగా వుంటుందని దానిని చుట్ట వచ్చని బైబిల్ చెప్పింది.కాని  భూమి   బల్లపరుపు గా చాపలాగా  కాకుండా  గుండ్రంగా బంతి లాగా ఉందని  పరిశోధనల వల్ల తేలింది.        భూమి,సూర్యచంద్రు లను గ్రహాలుగా లెక్కించారు మనదేశ ప్రాచీన శాస్త్రవేత్తలు.దానికి ఎల్లలు న్నాయని,వాస్తు శాస్త్రం చెబుతుంది. కానీ చంద్రుడు భూమి కి ఉపగ్రహమని తేలింది.      రాహువు , కేతువు భూమి ని మింగడానికి  రావటం వల్ల గ్రహణాలు వస్తాయని మనదేశంలో ప్రాచీనులు చెప్పినారని నమ్ముతారు. కానీ భూమికి  సూర్యుడికి మధ్యలో చంద్రుడు అడ్డుగా రావడం  వలన గ్రహణాలు వస్తాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కానీ ఈ రోజుకూ సూర్య చంద్ర గ్రహణాలగురించీ వాటి పట్ల అపోహల గురించి ప్రచారం చేస్తూనే ఉన్నారు.  సూర్యుడు తూర్పున ఉదయిండం,అస్తమించడం వాస్తవంలో జరగదు.మనకు అలా కనిపిస్తుందంతే. కనిపించేదంతా నిజం కాదంటే ఇదే. భూభ్రమణం కారణంగా అలా కనిపిస్తుంది. అంతే. ...

గణవ్యవస్థ

Image
గణవ్యవస్థ        Pc Wikipedia _గణవ్యవస్థ_ అనేక తెగలు కలిసి ఒక గణంగా రూపొందాయి. ఈ గణానికి పెద్దగా గణాధిపతి ఉండేవాడు.ప్రతి గణానికి గుర్తుగా ఏనుగో గుర్రమో పులో నక్కో ఇలా ఒక జంతువు ఉండేది. అదే కాలం క్రమంలో ఇంటి పేరు గా మారింది. పిల్లి సుభాష్, పులి రవి, ఇలా చాలా పేర్లు మనం చూస్తున్నాం.       గణం మరో గణాన్ని దోచుకునేది. మొదట్లో చంపేసే వారు. తరువాత చంపడంకన్నా వారిని తమ బానిసలుగా చేసుకుని వారితో పనులు చేయించుకోవడం మంచిదని తెలుసుకున్నారు. లొంగిపోయిన గణానికి గుర్తుగా ఉన్న జంతువును తమ చిహ్నమైన జంతువు పక్కనో తమ దేవత పక్కనో పెట్టుకున్నారు. అలా కుమారస్వామి వాహనంగా నెమలి, వినాయకుని వాహనంగా ఎలుక, శివుని నెత్తిన గంగ, ఇలా ఏర్పడినాయి.        Pc alchetron.com గణానికి మొదట్లో స్త్రీ యే అధిపతి. వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతున్న దశలో పురుషాధిక్యత పెరిగింది. ఆ తరువాత కాలంలోనే ఇలాంటివి వచ్చాయని చెప్పవచ్చు. ఆ తర్వాతే గణానికి మూలపురుషుడు ఏర్పడినాడు.మార్కండేయుడు, వశిష్టుడు, భరద్వాజ, కశ్యప మొదలైన వారు వచ్చారు. గణానికి గుర్తుగా ఉన్నవే గోత...

మనువు చెప్పిన ముఖ్య (అ)ధర్మాలు

Image
మనుధర్మం చెప్పిన ముఖ్య (అ) ధర్మాలు          pc: dailyhunt * బ్రహ్మనోటినుండి బ్రాహ్మణులు, భుజమునుండి క్షత్రియులు, తోడలనుండి వైశ్యులు, పాదములనుండి శూద్రులు ఉద్భవించారు. ●బ్రాహ్మణులను వేద పండితులు మరియు గురువులుగా, క్షత్రియులు పరిపాలకులుగా, వైశ్యులు వ్యాపారులు మరియు వ్యవసాయదారులుగా, శూద్రులు సేవకులుగా ఆశీర్వదించాడు మనువు.  ● బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మాత్రమే వేదాలు చదవడానికి, యజ్ఞోపవీతాన్ని ధరించడానికి అర్హులు. ●స్త్రీల పేర్లు పలకడానికి తేలికగా, చక్కటి అర్ధం వచ్చేలా ఉండాలి. ● 8 సంవత్సరాల బ్రాహ్మణుడికి, 11 సంవత్సరాల క్షత్రియుడికి, 12 సంవత్సరాల వైశ్యుడుకి ఉపనయనం జరపాలి. ●బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మాత్రమే ద్విజులు, అనగా యజ్ఞోపవీతం ధరించేవారు. ●గురువు బ్రాహ్మణుడి ప్రతిరూపం, తండ్రి ప్రజాపతి రూపం, తల్లి భూదేవి రూపం, పెద్ద సోదరుడు తన స్వరూపం. ● ద్విజులు శూద్ర స్త్రీలను భార్యగా స్వీకరిస్తే, వారి   పిల్లలు శూద్రులవుతారు.  ●స్త్రీలు తమ సోదరుల చేతను, తండ్రుల చేతను, భర్తల చేతను, మరుదుల చేతను గౌరవించబడాలి, ఆరాధించబడాలి.  ●స...

అసమానతకు శాశ్వత చిరునామా ‘మనుస్మృతి'

Image
            pc : Telugumedia9.com చరిత్రకారులు ఎంతసేపటికీ భారత్ పై మహ్మదీయుల దండయాత్రల గురించి రాయడంతో పుస్తకాలు నింపేశారని, నిజానికి  ఇండియాపై మహ్మదీయుల  దురాక్రమణ కంటే అంతకు ముందు బౌద్ధ ఇండియాని బ్రాహ్మణ వాదులు దురాక్రమించారని ముస్లింలు రాకపూర్వం జరిగిన భారతదేశ చరిత్ర మొత్తం బౌద్దులకూ, బ్రాహ్మణవాదులకూ మధ్య జరిగిన సంఘర్షణే అని అంబేద్కర్ అంటారు. ఆ చరిత్రలో ‘మనుస్మృతి’ రచన ఒక ముఖ్యమైన అధ్యాయం.  మనుస్మృతి ఒక మత గ్రంధమో లేక కాల్పనిక కావ్యమో కాదు. అది ఒక ‘అధర్మశాస్త్రం’  మనుస్మృతి రచనకూ భారత రాజకీయ చరిత్రతో కొంతకాలం ప్రత్యక్ష సంబంధం, మరికొంతకాలం పరోక్ష సంబంధం ఉంది. బౌద్దాన్ని ఈదేశపు సాంస్కృతిక అస్తిత్వంగా అధికారికంగా ప్రకటించిన మౌర్య అశోకుడు తన పరిపాలనను బౌద్ధ ధర్మ సూత్రాలకు అనుగుణంగా సాగించడమే కాదు తన రాజ్యంలో వైదిక క్రతువులైన యజ్ఞ యాగాలనూ, జంతు బలులనూ నిషేధించాడు. దీనితో బ్రాహ్మణులకు ప్రాధాన్యత లేకుండా పోయింది. దానికంటే బౌద్ధం వైదిక బ్రాహ్మణ మతాన్నీ, వేదాల ప్రామాణికతనీ బోనులో నిలబెట్టి దానికి ప్రత్యామ్నాయ తాత్విక దృక్పధాన్ని ము...

భిన్న దృక్పథాల సంఘర్షణే భారతీయ తాత్విక చింతన

Image
_భిన్న దృక్పథాల సంఘర్షణే భారతీయ తాత్విక చింతన_                               భారతీయ తాత్విక చింతనంతా ఒకే రకంగా సాగుతోందని అది బ్రహ్మ, ఆత్మ, మోక్షం మొదలైన భావవాదం చుట్టూ తిరుగుతూ వుందని ఆధ్యాత్మిక వాదులు నిత్యం ప్రచారం చేస్తూవున్నారు. వాస్తవానికి భావవాదానికి భౌతిక వాదానికి మధ్య జరుగుతున్న సంఘర్షణే భారతీయ తాత్వికచింతన.            దేవీప్రసాద్ చటోపాధ్యాయ రాసిన భారతీయ తత్వ శాస్త్రం-సులభపరిచయం (అనువాదం డా॥ గూడ సుందరరామయ్య) గ్రంథం భారతీయ తాత్విక చింతనపై సంపూర్ణంగా కాకపోయినా ఒక అవగాహన పెంపొందించుకునేందుకు సులభపరిచయం రాశారు. ఈ గ్రంథంలో ఆయన విశ్లేషించినట్లు రెండు భావధారలు సమాంతరంగా సాగినాయి. అవి భావవాదం, భౌతికవాదం. అయితే అవి ఎలా సంఘర్షించాయో వాటి మధ్య మళ్ళీ సామరస్యం ఎలా కుదిరిందో తెలుసుకోవాలంటే ఈ గ్రంథం తప్పక చదవాలి.               భారతీయ తాత్విక చింతనను తెలుసుకోవాలంటే అత్యంత ప్రాచీన సాహిత్యమైన వేదసాహిత్యం నుంచి మొదలు పెట్టాలి. దాదాపు 5000సంవత్సరాల క్రిందటి వే...

అసురుల ప్రతిఘటన

Image
              pc Wikipedia   500BCE నాటికి  భారతదేశంలో అనేక గణ రాజ్యాలు ఉండేవి. ఆనాటి సమాజంలో ప్రజలకు స్వేచ్ఛాయుత,క్రమబద్ద జీవన విధానం ఉండేది. స్త్రీల ఆధిపత్యం లో అనేక గణరాజ్యాలు కూడా ఉండేవి.      50BCE నాటికి వర్ణధర్మం పేరుతో గోబ్రాహ్మణ అధికారం ఎక్కువైంది. ఆ కాలంలో  ప్రజలు పాలకుల అధికారాన్ని ప్రశ్నించడం మొదలైంది. మత విషయాల్లో రాజ్యం జోక్యం చేసుకోవడం వల్ల స్థానికంగా ఉన్న అనేక అసుర జాతులు ప్రతిఘటించాయి.అవే దైత్యులు, దానవులు, నాగులు మాతంగులు, రాక్షసులు మొదలైన గణాలు. వీరు పాలకుల ఆధిపత్యాన్ని ప్రతిఘటించడం ఆ కాలాల్లో రాయబడిన మహాభారత,రామాయణ కథలలో  కనిపిస్తుంది.   __బి.విజయభారతి.

సురులు- అసురులకు ఆ పేరు ఎలా వచ్చింది? వీరెవరు?

Image
        pc: Wikipedia వేదాంగాలు (శిక్ష ,ఛందస్సు,వ్యాకరణము , నిరుక్తము, జ్యోతిషము , కల్పము)లో నిరుక్తం రాసిన రచయిత యాస్కుడు.ఇతడు క్రీస్తు పూర్వం ఏడు ఎనిమిది శతాబ్దాల మధ్య కాలం వాడు.  రుగ్వేద కాలం నాటి తెగల నుండే దేవ, గంధర్వ, పితర, అసుర ,రాక్షస అనే ఐదు గణాలు ఏర్పడ్డాయని నిరుక్తంలో చెప్పాడు. నాగ, యక్ష అసుర గణాల మాదిరి దేవగణాలు కూడా ఒక మానవ సమూహమే. దేవ గణాలను సుర గణాలు అని కూడా అంటారు.వీరు అసురులకు శత్రువులు.అందువల్ల వీరిని సురులు అన్నారు. లడక్ ప్రాంతంలో ని సురూ లోయలో నివసించే ప్రజలు కాబట్టి  వీరిని సురులని కూడా పిలిచారన్నారు.       మరో విశ్లేషణ ప్రకారం సుప్రీంను సేవించే వారిని 'సురులు' అన్నారు. సుర( మద్యం) ముట్టని వారిని 'అసురులు' అన్నారు. రక్షించే వారిని రాక్షసులు అని అన్నారు. బలహీనంగా పీలగా ఉన్న వారిని రాక్షసులని అన్నారు. పాములను పూజించే వారిని నాగులని అన్నారు. గోసె కట్టి నప్పుడు వెనకాల కొంత   బట్ట  తోకలాగా వేలాడుతుండేది. ఇలా వేలాడే బట్టతో గోసె ( సైకిల్ కట్టు) కొట్టే వారిని వానరులు అన్నారు.   

భగవద్గీత లోని 5 simple management skills

Image
‌                            ఈశావాస్యోపనిషత్తులో ఇలా ఉంది: కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్చతగ్‌ం సమాః  ఏవం త్వయి నాన్యథేతో స్తిన కర్మ లిప్యతే నరే.         ఈ లోకంలో నీ కర్తవ్యాలను నిర్వహిస్తూ  నూరేళ్ళు జీవించాలని ఆశించు. నీలాంటి వారికి ఇది తప్ప వేరే మార్గం లేదు. భగవద్గీతలో ఈ ఐదు శ్లోకాలలో  ప్రతి వ్యాపారి , ఉద్యోగి అనుసరించవలసిన విద్యుక్త్ధర్మాలు వివరించారు. ఈ భగవద్గీతను 400CE నుండి 400BCE వరకు ప్రతి రచయిత తనకు తెలిసిన దాన్ని కలుపుకుంటూ వచ్చారు. ఆ నాటి విషయాలు నేటి యజమానులకు( ఎంట్రప్రెన్యూర్ కు) ఇప్పటికీ ఉపయోగపడుతున్నాయి.  భగవద్గీత లోని 5 simple management skills .#1. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన | మా కర్మ ఫలహేతుర్భూ: మాతే సంగోస్త్వకర్మణి || అంటే, నువ్వు కర్మలు చేయడానికి మాత్రమే. ఆ కర్మఫలాలకు అధికారివి కాదు. ప్రతిఫలాపేక్షతో ఎట్టిపరిస్థితుల్లో కర్మలు చేయకు. అలాగని చేయడం మానకు అని అర్ధం. ప్రతీ ఎంట్రప్రెన్యూర్ కు ఈ శ్లోకం వర్తిస్తుంది. చేయాల్సిన పని గురించి రెండే రెండ...