Posts

Showing posts from February, 2025

బౌద్ధానికి వన్నె తెచ్చిన నాగార్జున తాత్విక చింతన

బౌద్ధానికి వన్నె తెచ్చిన నాగార్జున తాత్విక చింతన        ఆచార్య నాగార్జున క్రీ.శ.2వ శతాబ్దం (150-250 CE) లో ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లా లో ఉన్న నాగార్జునకొండ ప్రాంతం లో జన్మించారని చరిత్ర కారులు భావిస్తారు. ప్రాచీన చైనా, టిబెట్ మరియు సంస్కృత గ్రంథాలు గ్రంథాల ప్రకారం, నాగార్జున బాల్యంలోనే నాలందా మహావిహారం ( బీహార్‌లో ఉంది) వెళ్లి బౌద్ధమతాన్ని స్వీకరించారు. ఇతను శాతవాహన వంశానికి చెందిన రాజుకు సలహాదారుగా పనిచేశారని, అనేక మంది పరిశోధకులు పేర్కొంటున్నారు.       నాగార్జున మహాయాన బౌద్ధ తాత్వికతకు చెందిన వారు. నాగార్జున తాత్వికత శూన్యతా సిద్ధాంతం, మధ్యమ మార్గం, రెండు సత్యాల సిద్ధాంతం, తర్కశాస్త్రంలో చతుస్కోటి వంటి అంశాలను ప్రతిపాదించింది. ఆయన తాత్విక చింతన మహాయాన బౌద్ధ ధర్మానికి గుండెకాయగా మారింది. అతని ఆలోచనలు మహాయాన బౌద్ధ తత్వాన్ని పరిపుష్టం చేసింది. ఆధునిక తాత్విక చర్చలకు కూడా ఎంతో ప్రేరణనిచ్చింది. ఈ తత్వం బౌద్ధం ముందు నుంచి చెపుతున్న అనిత్యత (impermanence), ప్రతీత్యసముత్పాదం (dependent origination), ద్వంద్వ విమర్శ (critique of dualis...