Posts

Showing posts from November, 2022

ఆర్. ఎస్. ఎస్. తాత్విక చింతన

స్వాతంత్ర్య పోరాటానికి ఎలాంటి మద్దతు ఇవ్వకపోగా, చివరకి గాంధీ గారి మరణానికి కారణం అయ్యారు. గాంధీ గారి మరణం తర్వాత, RSS పై ప్రభుత్వమ్ నిషేధం విధించింది. ఆ నిషేధం ఎత్తివేయటానికి, RSS ఇకపై రాజకీయాల్లో పాల్గొనమనీ, సాంస్కృతిక సంస్థ గానే ఉంటామనీ, అప్పటి ఉప ప్రధాని పటేల్ గారికి వాగ్దానం చేశారు. తర్వాత కాలంలో ఈ వాగ్దానాన్ని తుంగలో తొక్కారు. ఇక్కడ కాంగ్రెస్ యొక్క ముందుచూపు లేని రాజకీయాన్ని, ముస్లిం appeasement గా చిత్రీకరిస్తూ హిందూ మహాసభ మరియు rss ఆడిన రాజకీయం చూస్తే నేటికీ అది కనిపిస్తుంది. కానీ కాంగ్రెస్ 100 యేళ్లు అయినా ఇంకా పాఠాలు నేర్చుకోలేదు దీని నించి.  Lucknow pact లో ముస్లిం లీగ్ ని జాతీయపోరాటం లో involve చెయ్యడానికి communal electorate కి కాంగ్రెస్ మద్దతు ప్రకటించాల్సి వచ్చింది. అదే విధంగా 1931లో INC కరాచీ సమావేశంలో, ప్రాథమిక హక్కుల తీర్మానంలో, మైనారిటీ లకు ప్రత్యేక హక్కులని కల్పించారు. ఇది సహజంగానే RSS కు నచ్చలేదు. ఇక RSS లౌకిక వాదం కి అర్థమే తెలియదు. అప్పట్లోనే ఆ కల్లోలానికి వాళ్ళు వెతికినా మార్గం ఆవు తల్లి. ముస్లిం లీగ్ కి వ్యతిరేకంగా cow slaughter రాజకీయాలు ఉధృతం చేసింది. ఇక్క...

గురి తప్పని సామాజిక తత్త్వవేత్త వేమన

Image
గురి తప్పని సామాజిక  తత్త్వవేత్త  వేమన       మనిషిని వక్రమార్గంలోకి తిప్పేదెవరు ? చుట్టూ వున్న భౌతిక పరిస్థితులే. అయితే దానికి దోహదం చేసేవారు స్వార్థపరులే. వీరు తాము చెడింది చాలక ఇతరులను కూడా చెరుస్తూవుంటారు. 'కూసే గాడిద మేసే గాడిదు చెడగొట్టినట్లు.ఈ పద్యం దాన్ని స్పష్టం చేస్తుంది. వేరు పురుగు చేరి వృక్షంబు జెరచును చీడ పురుగు చేరి చెట్టు చెరచు కుత్సితుండు చేరి గుణవంతు చెరచురా ||విశ్వ!!         ఒక వ్యక్తితో కాసేపు మాట్లాడితే ఆ వ్యక్తి గురించి చెప్పవచ్చంటారు మనో విశ్లేషకులు. వ్యక్తి సజ్జనత్వం వెంటనే కనిపించదు. మంచి వ్యక్తి సాధారణంగా ఆడంబరాలు లేకుండా ఉంటాడు. ఆ మనిషిని తరచి చూస్తే గాని ఆ మనిషిలోనిసజ్జనులగు వారి సారమిట్టుల నుండు || విశ్వ        అల్పుడు ఎలా వుంటాడు ? అల్పుని గూర్చి తెలియాలంటే అధికారమిస్తే తెలిసిపోతుంది. అదెంత అస్తవ్యస్త మౌతుందో ? వేమన సులభంగా అర్థమయ్యే ఉపమానంతో అల్పుని పోల్చాడు. అదేమిటంటే. అల్పబుద్ధివాని కధికార మిచ్చిన దొడ్డవాని నెల్ల దొలగ గొట్టు చెప్పు తినెడి కుక్క చెరుకు తీపెరుగునా || విశ్వ!!     ...

E. A. Jabbar తాత్వికత

కట్టమంచి రామలింగారెడ్డి తాత్వికత

వందన శివ తాత్వికత

రవిశంకర్ (ఆధ్యాత్మిక నాయకుడు)

EMS నంబూద్రిపాద్ తాత్వికత

EMS నంబూద్రిపాద్ , పూర్తిగా ఎలంకులం మనకల్ శంకరన్ నంబూద్రిపాద్ , (జననం జూన్ 13, 1909, పెరింతల్మన్న సమీపంలో, భారతదేశంలోని—మార్చి 19, 1998, తిరువనంతపురంలో మరణించారు), భారతీయ కమ్యూనిస్ట్ నాయకుడు మరియు సిద్ధాంతకర్త ముఖ్యమంత్రిగా పనిచేశారు. నంబూద్రిపాద్ ఇప్పుడు మధ్య కేరళలో ఉన్న పెరింతల్మన్న సమీపంలోని ఒక చిన్న గ్రామంలో ఉన్నత కులానికి చెందిన నంబూదిరి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు . అతను మొదట్లో సంస్కృత గ్రంథాలలో, ముఖ్యంగా ఋగ్వేదంలో బోధించబడ్డాడు . ఆ తర్వాత అతను నంబూద్రి యోగక్షేమ సభ స్థాపించిన పాఠశాలకు హాజరయ్యాడు , ఇది ఆధునీకరించబడిన విద్యను సమర్థించే మరియు కుల వ్యవస్థ యొక్క అన్యాయాలను విమర్శించే సామాజిక-సంస్కరణ సంఘం . 1932లో మోహన్‌దాస్ (మహాత్మా) గాంధీ ప్రారంభించిన శాసనోల్లంఘన ఉద్యమంలో నంబూద్రిపాద్ చేరారు మరియు బ్రిటీష్ ప్రభుత్వం ఒక సంవత్సరం జైలు శిక్ష అనుభవించారు. నంబూద్రిపాద్ 1934లో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ సభ్యుడిగా మారారు, కానీ ఆయన వెంటనే పార్టీలోకి మారారు.కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI). అతను 1941లో పార్టీ కేంద్ర కమిటీకి మరియు 1951లో దాని పొలిట్‌బ్యూరోకు ఎన్నికయ్యాడు. ఆ కాలంలో అతను ప...

దేవీప్రసాద్ చటోపాధ్యాయ తాత్వికత

జిడ్డు కృష్ణమూర్తి తాత్వికత

Image
జిడ్డు కృష్ణమూర్తి తాత్వికత       ఆయన తత్వం అంటితే వదలని జిడ్డు. ఆయన తత్వం సామాన్య జనానికి కొంచెం అర్థం అయినట్లు, కానట్లు ఉంటుంది.ఇంకో మాటలో చెప్పాలంటే ఆయన తత్వం గందరగోళం గా ఉంటుంది. ఆయన తాత్వికత సామాన్య మధ్యతరగతికి అందక పోయినా ఆయన పేరు మాత్రం జనం నోళ్ళలో నానింది. ఆయనే మన జిడ్డు కృష్ణమూర్తి.       జిడ్డు కృష్ణమూర్తి చిత్తూరు జిల్లా మదనపల్లిలో 1895 మే 11న జన్మించారు.  ఆయన 34 వ యేట 1929 న తన సామాజిక ఆచరణ మొదలుపెట్టి 91 సంవత్సరాలు సంపూర్ణ తాత్విక జీవితాన్ని అనుభవించి,  ఫిబ్రవరి 1986 లో అమెరికాలో మరణించారు.             ఆయన తండ్రి నారాయణయ్య జిల్లా న్యాయమూర్తి. తల్లి సంజీవమ్మ.  ఇతను మదనపల్లి లో జన్మించాడు. వారి కుటుంబం తమ  నివాసాన్ని మదనపల్లి నుండి మద్రాసుకు మార్చారు.  మద్రాసులోని అడయారు, దివ్యజ్ఞాన సమాజానికి( థియోస్సాఫికల్ సొసైటీకి) అంతర్జాతీయ కేంద్రం.  థియోసాఫికల్ సొసైటీ అధికారికంగా యునైటెడ్ స్టేట్స్‌లోని  న్యూయార్క్ నగరంలో హెలెనా పెట్రోవ్నా బ్లావాట్స్కీ , కల్నల్ హెన్రీ స్టీల...

నారాయణ గురు తాత్వికత

మహమ్మద్ ఇక్బాల్ తాత్వికత

ముహమ్మద్ ఇక్బాల్ ఒక అద్భుతమైన కవి-తత్వవేత్త, బహుశా ఇరవయ్యవ శతాబ్దపు అత్యంత ప్రభావవంతమైన ముస్లిం ఆలోచనాపరుడు.  అతని తత్వశాస్త్రం పరిశీలనాత్మకమైనది మరియు అల్-గజాలీ  మరియు రూమీ వంటి ముస్లింల ఆలోచనాపరుల ప్రభావంతో పాటు  నీట్షే  మరియు  బెర్గ్‌సన్  వంటి పాశ్చాత్య ఆలోచనాపరుల ప్రభావాన్ని చూపినప్పటికీ , ఇక్బాల్ ఒక కవి యొక్క సున్నితత్వంతో చదివిన ఖురాన్‌లో ప్రాథమికంగా పాతుకుపోయింది. ఒక ఆధ్యాత్మికవేత్త యొక్క అంతర్దృష్టి. ఇక్బాల్ యొక్క తత్వశాస్త్రం  ఖుదీ తత్వశాస్త్రంగా ప్రసిద్ధి చెందింది లేదా స్వీయత్వం. ఈడెన్ నుండి 'పతనం' లేదా అసలు పాపం అనే ఆలోచనను తిరస్కరిస్తూ, ఇక్బాల్ భూమిపై మానవుల ఆగమనాన్ని ఒక మహిమాన్వితమైన సంఘటనగా పరిగణించాడు, ఎందుకంటే ఆడమ్ భూమిపై దేవుని వైస్‌రెజెంట్‌గా దేవుడు నియమించబడ్డాడు. మానవులు పరిణామ ప్రక్రియలో కేవలం ప్రమాదాలు కాదు. ఆత్మ యొక్క ఆవిర్భావం మరియు పరిపూర్ణతను సాధ్యం చేయడానికి విశ్వం ఉంది. జీవితం యొక్క ఉద్దేశ్యం స్వీయ అభివృద్ధి, ఇది మానవులు తమలో ఉన్న వాటి గురించి మరియు బాహ్య ప్రపంచం గురించి ఎక్కువ జ్ఞానాన్ని పొందడం...

రాహుల్ సాంకృత్యాయన్ జీవన తాత్వికత

Image
రాహుల్ సాంకృత్యాయన్ జీవన తాత్వికత        18వ శతాబ్దం లో  బెంగాల్ లో మొదలైన సాంస్కృతిక పునరుజ్జీవనం ప్రభావం భారతదేశం మొత్తంగా ప్రసరించింది. భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవనం రాజా రామ్మోహన్ రాయ్ (1775-1833) తో మొదలైంది.అది రాహుల్ సాంకృత్యాయన్ తో శిఖరాగ్రానికి చేరింది. రాహుల్ భారతదేశం తాత్వికత కు వేసిన ముద్ర ప్రగాడమైంది. ఆయన జీవించిన విధానమే ఆయన తాత్వికత.         కులవంతి దేవి, గోవర్ధన్ పాండే దంపతులకు, ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్ జిల్లాలోని కనైలా గ్రామంలో   జన్మించిన రాహుల్ సాంకృత్యాయన్ (1893 ఏప్రిల్ 9 – 1963 ఏప్రిల్ 14)  బహుభాషావేత్త, బహుముఖప్రజ్ఞాశాలి. వైవిధ్యభరితమైన జీవితాన్ని గడిపి,   70 ఏళ్ల వయసులో డార్జిలింగ్‌లో తుదిశ్వాస వదిలారు.     రాహుల్ జీ  ఇండాలజిస్ట్. మార్క్సిస్ట్ సిద్ధాంతకర్త, బౌద్ధ పండితుడు, ప్రయాణ రచయిత , సృజనాత్మక రచయిత. అతని రచనలలో సామాజిక శాస్త్రం,చరిత్ర, తత్వశాస్త్రం , బౌద్ధం, టిబెటాలజీ , లెక్సికోగ్రఫీ వరకు ఉన్నాయి. ఆయన హిందీ యాత్రాసాహిత్య పితామహుడు. తన జీవితంలో...

అరవింద ఘోష్ తాత్విక చింతన

Image
          అరవింద ఘోష్  తాత్విక చింతన                           అరవింద ఘోష్  తండ్రి కృష్ణధన్ ఘోష్  బ్రిటన్‌లో ఒక వైద్యుడు.  తల్లి స్వర్ణలత.వారిది సంపన్న కుటుంబం. వారికి అరవింద 1872,ఆగస్టు 15న కోల్‌కతాలో జన్మించాడు .  అతని తండ్రి అతన్ని మొదట డార్జిలింగ్‌లోని ఆంగ్ల పాఠశాలకు , తరువాత ఇంగ్లాండ్‌లోని సెయింట్ పాల్స్ పాఠశాలకు పంపినారు.  అరవింద కేంబ్రిడ్జ్ నుండి ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులయ్యాక కింగ్స్ కాలేజీలో చదువుకున్నాడు. 1890లో  ఇండియన్ సివిల్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు, కానీ ప్రొబేషన్ సమయంలో అతను రైడింగ్ పరీక్షలో విఫలమవ్వడంతో సివిల్ సర్వీస్‌కు దూరమయ్యాడు. 1893లో భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత బరోడాలో, అరవిందునికి ఒక రహస్య విప్లవ సంస్థతో పరిచయం ఏర్పడింది.       అరవిందుని జీవితంలో రెండు పార్శ్వాలు ఉన్నాయి. ఒకటి విప్లవకారునిగా,రెండు ఆధ్యాత్మిక వాదిగా.     రాడికల్  భావాలతో   సాయుధ విప్లవం ద్వారా బ్రిట...

గోపరాజు రామచంద్రరావు తాత్విక దృక్పథం

గోపరాజు రామచంద్రరావు  నాస్తిక ప్రయోగాలకు తావు  మూఢాచార మురికి గుడ్డల్ని  ఉడకేసి ఉతికేసిన చాకిరేవు         “మానవుని విజ్ఞానంలో నిర్ధారణకు నిలుచు విషయములు సత్యములు, నిర్ధారణకు నిలువని విషయములు అబద్ధములు.నిర్ధారణకు వీలులేని విషయములు ఊహలు. దైవమనునది మానవుని ఊహలలో ఒకటి. దైవమునకు ఏ అర్థము చెప్పిననూ అది నిర్ధారణకు నిలచుటయైననూ లేదు లేకపోతే నిర్ధారణ చేయుటకైననూ వీలులేకున్నది. అందుచేత దైవము అబద్ధము కావలెను. లేకపోతే దైవము ఊహామాత్రము అయినా కావలెను. అంతేకాని సత్యము మాత్రము కాదు" అంటూ దైవభావాన్ని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చిన వారు గోరా 1902 నవంబరు 15న విశాఖజిల్లాలో, నేడు ఒరిస్సా గంజాంజిల్లా ఛత్రపూరులో జన్మించారు.  . ఆయనే  గోపరాజు రామచంద్రరావు.  నాస్తిక భేరి మ్రోగించిన ఆధునిక చార్వాకుడు. స్వాతంత్య్ర సమరయోధుడు, సంఘసంస్కర్త, నాస్తిక కేంద్ర స్థాపకుడు.       ప్రాథమిక, ఇంటర్మీడియట్ విద్య, పర్లాకిమిడి, కాకినాడలలో వృక్ష, జంతుశాస్త్రాలు మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో చదివాడు. దక్షిణ భారతంలోనూ, శ్రీలంకలోనూ వివిధ కళాశాలల్లో వృక్షశాస్త్ర విభాగంలో ఉ...

వివేకానందుని తాత్విక చింతన

Image
వివేకానందుని తాత్విక చింతన  ప్రాథమికంగా వివేకానందుడు అద్వైత వాది. భావవాది దేనిని బ్రహ్మంగా పిలుస్తాడో, భౌతికవాది దానినే పదార్థంగా పిలుస్తాడన్నాడు.  ఈ ప్రపంచం భ్రాంతి అని శంకరుని అద్వైత భావనకు విరుద్ధంగా, వివేకానందుడు ఈ ప్రపంచం వాస్తవమనే విషయాన్ని అంగీకరించాడు. వేదాంతం అంటే జీవితానికి దూరంగా పారిపోవడం కాదు. అది సజీవంగా రోజువారీ జీవితంలో భాగంగా ఉండి, నైతిక ప్రమాణాలను పెంచేదిగా ఉండాలన్నారు.     ‌‌     ప్ర‌‌కృతి కొన్ని సూత్రాలను అనుసరిస్తుందని, వాటిని మనం తప్పక పాటించాలన్నాడు. కానీ,  ప్రకృతికి ఉన్నట్లే సమాజానికి కూడా కొన్ని చలనసూత్రాలు ఉన్నాయనే విషయాన్ని వివేకానంద గుర్తించలేక పోయాడు.        గురువు పరమహంస  బెంగాల్ రాష్ట్రం వరకు పరిమితమైతే శిష్యుడు చికాగో వరకు హిందూ మతాన్ని విస్తరించాడు. హిందుమత ప్రపంచీకరణ ప్రక్రియకు వివేకానంద ఆనాడే పునాది వేసినాడు. రామకృష్ణ పరమ హంస శిష్యుడిగా, కలకత్తాలో 1897 లో రామకృష్ణ మిషన్ ను, బేలూరు మఠాన్ని స్థాపించాడు.       ‌‌     హిందూ మతం రాడికల్ ...