ఇండో-గ్రీకు ప్రభావం క్రీ.పూ. 500 కాలంలో పర్షియా చక్రవర్తి దారియస్ పశ్చిమ ఆసియా, ఇరాన్, ఆప్షనిస్తాన్, తుర్క్ మెన్ స్తాన్ తజిక్ స్తాన్, ఉత్తర సింధు ప్రాంతాలకు తన రాజ్యాన్ని విస్తరించాడు. ఆనాడు అయోనియాగా పిలువబడే పశ్చిమ ఆసియాలోని సిరియా, జోర్డాన్, యూరప్ లోని ఆల్బేనియా ప్రాంతాలు దారియస్ అధీనంలోకి వచ్చాయి. తన రాజ్యంలోని గ్రీకు సైన్యాలను ఆఫ్ఘనిస్తాన్, తుర్క్ మెన్ స్తాన్, తజిక్ స్తాన్ లలో దారియస్ మొహరించాడు. ఆవిధంగా దక్షిణ ఆసియాలో గ్రీకుల ప్రభావం ప్రారంభమయింది. పర్షియన్ సామ్రాజ్య పతనం తరువాత, అలెక్జాండర్ క్రీ.పూ 326 లో దక్షిణ ఆసియాలో సింధునదీప్రాతాల వరకూను, ఉత్తరాన ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియాలోని కొన్ని ఫ్రాంతాలను జయించటంతో, అతని తరువాత అతని సైనికాధికారులు గ్రీకు రాజ్యాలను ఏర్పరిచారు. ఆవిధంగా గ్రీకు రాజ్యాలు క్రీ.శ. 10 వరకూ కొనసాగాయి. అయితే, ఏదో ఒక రూపంలో భారతదేశంలో గ్రీకులప్రభావం క్రీ.శ. 750 వరకూ కొనసాగింది దాదాపు వెయ్యి ఏళ్ళ పాటు కొనసాగిన గ్రీకుల ప్రభావం భారత రాజకీయాలపైనా, సంస్కృతిపైనా, కళలపైనా ఉన్నది. భారత దేశ పశ్చిమోత్తర భాగాలకు పరిమితం కాకుండా, గ్రీకుల ప్రభావం తూర్పున మధుర, పాటలీ పుత్ర వరకూ...