Posts

Showing posts from May, 2021
సింధు ప్రజలు, ఆర్యులు ఆవులను,ఇతర జంతువులను ఇలా ఉపయోగించుకునే వారు. అదే ఆనాటి వారి సంపద. వారు జంతువుల వేట నుంచి వాటి పరిరక్షణకు, పెంపకానికి, వాటి ద్వారా పాడికి వ్యవసాయకులుగా, పశు గణాల పెంపకందారులుగా పరివర్తన చెందారు. భూమి అనే గోవు నుంచి వారు పాలనేగాక అవసరమైనవి ఏవైనా సరే పిండుకునేవారు. అందుకే వారి దృష్టిలో భూమి ( గోవు) ఒక కామధేనువు.             జంతువులను ఉపయోగించుకోవడం నేర్చుకోవడంతో మిగులు ఆహారఉత్పత్తి సాధ్యమైంది.క్రీ. పూ. 2000 ప్రాంతంలో మనిషి గుర్రాల స్వారీ చేయడం నేర్చుకున్నాడు. గుర్రాలపై స్వారీ చేయడం నేర్చుకోవడం వల్ల  మనిషి  ఇతర ప్రపంచం మీద పైచేయి సాధించాడు. గుర్రాలు యుద్ధ రథాలకు పూన్చేందుకు, విశాలమైన మైదానాలలో పశుపాలనకు ఉపయోగపడేవి. వాటిని యాగాలలో బలివ్వటం మినహా ఆహారం కోసం ఉపయోగించేవారు కాదు. గుర్రాల మేతకోసం వేదకాలపు మనుషులు తరుచు కొత్త గడ్డి భూములను వెతుకుతూ పోయేవారు. ఇతర పశువులకు భిన్నంగా గుర్రాలు గడ్డిని వేళ్లతో సహా పీకి వేసి మొదలంటా తింటాయి. అక్కడ గడ్డి తిరిగి మొలిచేందుకు కొన్నేళ్లు అవసరం. కనుక వారు కొత్త చోట్లకు తరలిపోవటం, కొత్త భూములు ఆ...
 3000BCEలో  వికసించిన సింధు నాగరికత కాలంలో సింధు ప్రాంత ప్రజలు తమకు పెద్దగా ఉన్న    అమ్మతల్లిని పూజించేవారు. దీనికి కారణం మాతృస్వామిక వ్యవస్థ ఉండటమే. ఈ విధానం వల్ల వీరి జీవన వ్యవహారాల్లో గ్రామ దేవతలు భాగమయ్యారు. ఈ దేవత గ్రామాన్ని చల్లగా చూస్తూ, అంటు వ్యాధుల నుండి రక్షిస్తూ,  పంటలను పచ్చగా ఉండేలా చేస్తూ,  భూత ప్రేతాలనుండి రక్షిస్తూ గ్రామ పొలిమేరలలో సదా కాపుకాస్తుందని నమ్మేవారు.  ఆ దేవతే గ్రామదేవత .    కల్లూ, సార, జంతుబలి, నైవేద్యం ఈ దేేేేేేేవతలకు సమర్పిస్తుంటారు.        వారి జీవనాధారం గా ఉన్న పంటనే దేవతగా భావించి పూజించేవారు. కుంకుల్లు బాగా పండే ఊర్లలో   కుంకుళ్ళమ్మ  ను దేవతగా,గోగులు బాగా పూచే ఊర్లలో    గోగులమ్మ     దేేేేేవతగా చేసుకున్నారుు.జొన్నలుపండేచోట  జొన్నాళమ్మ  అని, నూకలు అంటే  వరి పండే  ప్రాంతాలలో వారి దేవతను  నూకాళమ్మ  అని పిలుచు కున్నారు. మొదటిసారిగా పండిన పంటను ఆ దేవతకు నివేేదిస్తారు.  పూజ చేసే  పూజారికి...

స్టీఫెన్ హాకింగ్

 స్టీఫెన్ హాకింగ్ ఓ సుప్రసిద్ధ ఆంగ్లేయ సైద్డాంతిక భౌతిక శాస్త్రవేత్త. ఆయన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్ర ఆచార్యునిగా సేవలందించేవారు. 2009లో ఆ పోస్టు నుంచి వైదొలగారు. 1942 జనవరి 8వ తేదీన ఇంగ్లాండులోని ఆక్స్ ఫర్డ్ లో స్టీఫెన్ హాకింగ్ జన్మించాడు . ఆయన తండ్రి వృత్తి రీత్యా లండన్ లో వైద్య శాస్త్ర పరిశోధకుడు. భౌతిక శాస్త్రంలో స్పెషలైజేషన్ చేశాడు స్టీఫెన్. స్టీఫెన్ తన 17వ యేట, 1959 వ సంవత్సరం10వ నెలలొ ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలొ చేరాడు. 1985 లో కంప్యూటరు సాయంతో మాట్లాడగలిగే పరికరాన్ని స్టీఫెన్ తయారు చేసుకున్నాడు. దాని సాయంతోనే 1988లో పుస్తకాన్ని వెలువరించాడు. అది అమ్మకాల్లో సృష్టించిన రికార్డు అంతా ఇంతా కాదు. ప్రపంచ వ్యాప్తంగా 40 భాషల్లో ఆ పుస్తకం వెలువడింది. తెలుగులోనూ. . . ‘కాలం కథ’ పేరుతో వెలువడింది. ప్రపంచ వ్యాప్తంగా ఏ బ్రీఫ్ హిస్టరీ ఆప్ టైమ్ అమ్మకాల్లో సృష్టించిన రికార్డు వల్ల అది 1998 అంటే వెలువడిన 10 సంవత్సరాల తరువాత గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించింది. కనీసం కదలడానికి సహకరించని శరీరం, చక్రాల కుర్చీకి అతుక్కుపోయిన మనిషి, మాట్లాడటానికీ కంప్యూటర్ సహాయం. . . ఇవి ప్రఖ్యాత ...

భారత చరిత్రలో అసమ్మతి స్వరాలు

‘భారతదేశ చరిత్రలో అసమ్మతీ, అనంగీకారం అనాదిగా ఉన్నాయి. ప్రశ్నించబడకుండా మేధో సంఘర్షణ లేకుండా ఏ సంస్కృతీ రూపొందలేదు’ అని ప్రముఖ చరిత్రవేత్త రొమిలా థాపర్ నొక్కి చెప్పారు. గత అక్టోబర్ లో ప్రచురితమైన ఆ విదుషీమణి కొత్త పుస్తకం ‘అసమ్మతిస్వరాలు’ (The Voices of Dissent)లో చరిత్ర పొడవునా పరచుకుని ఉన్న అసమ్మతిని ఆమె ఉదాహరణలతో వివరించారు. పాశ్చాత్యులు ప్రవేశించేవరకూ ఈ దేశంలో సంస్కృతి అఖండంగా ఉందనే అభిప్రాయాల్ని రొమిలా థాపర్ పూర్వ పక్షం చేశారు. జ్ఞానాన్వేషణ మార్గంలో అసమ్మతి అన్ని సమాజాల్లో ఉందనీ, అందుకు భారతదేశం మినహాయింపు కాదనీ, పైగా భారతీయ తాత్విక చింతనని అది సమున్నతం చేసిందనీ ఆమె అన్నారు.  ఒక వ్యక్తి లేదా సమూహం తమ మీద ఆధిపత్యం లేదా ప్రభావం చూపే వ్యవస్థల పట్ల కలిగి ఉండే అసంతృప్తి లేదా అనంగీకారమే ‘అసమ్మతి’ (dissent) అని రొమిల్లా అన్నారు. సాధారణంగా భారతీయ సమాజం సహనగుణశీలమైనదనీ, ఎన్నో సంస్కృతుల్ని సాదరంగా ఆహ్వానించిందని చేసుకునే ఆత్మస్తుతిని నిరాకరిస్తూ భారతీయ సమాజం వైరుధ్యాలు లేని అద్భుత సామరస్యంతో ఏమీ మనలేదనీ దాని వంతు హింస, అసహనం, భావసంఘర్షణ దానికీ ఉన్నాయని స్పష్టం చేస్తూ వర్తమానం లోని అసమ్మత...