Posts

Showing posts from October, 2022

సత్యశోధక్ సమాజ్ తాత్వికత

Image
                         జ్యోతిబా పూలే సత్యశోధక్ సమాజ్ తాత్వికత           బ్రిటిష్ వారి రాకతో అప్పటి భూస్వామిక వ్యవస్థ కదలడం ప్రారంబించింది.  1819 నాటికే మహారాష్ట్ర లో పీష్వా ల పాలన అంతమై బ్రిటీష్ వారి చేతుల్లోకి పోయింది.వారు ప్రవేశ పెట్టిన  సాంకేతిక పరిజ్ఞానం కారణంగా భారతీయ సమాజం,సంస్కృతి పెనుమార్పులకు లోనయ్యింది. శూద్రులకు చదువు అందుబాటులోకి వచ్చింది.       వివిధ దేశాల్లో ‘ప్రాపంచిక జ్ఞానం’,   ‘తాత్విక చింతన’   సాహిత్యం  ద్వారా ప్రజల్లోకి వెళ్లింది. కానీ మనదేశంలో మాత్రం తాత్విక చింతన విశ్రాంత వర్గం దగ్గరే ఉండి పోయింది. ఆంగ్లేయులు రాకతో  విద్య సామాజిక పరమైనది. అప్పుడు బహుజనుల్లో విప్లవాత్మక భావాలు, సామాజిక తిరుగుబాట్లు మొదలయ్యాయి.        తోటమాలి  కులానికి చెందిన శూద్రుడు, (ఇప్పుడు ఓబిసి ) మహారాష్ట్రలోని సతారాలో జన్మించిన  జ్యోతిరావు పూలే (11-04-1827 to 28-11-1890)  సత్యశోధక్ సమాజ్  ను 1873 లో ప...

బ్రహ్మ సమాజం తాత్వికత

Image
                        Raja ramamohan Roy,statue in London  _బ్రహ్మ సమాజం తాత్వికత_          భారత దేశ సాంస్కృతిక పునరుజ్జీవనానికి ప్రాణం పోసింది బ్రహ్మ సమాజం. ఇది  భారతదేశం లో మొదటి సామాజిక-మత సంస్కరణ ఉద్యమాలకు నడుం కట్టింది. ఆర్య సమాజం కన్నా ముందే బ్రహ్మ సమాజం పుట్టింది.ఆంగ్ల విద్య అభ్యసించిన వారికి ప్రపంచ సాహిత్యం అందుబాటులోకి వచ్చింది. దాంతో హిందూ మతం లోని లోపాలు గుర్తించగలిగారు. అంతే గాక సూఫీ మతం, క్రైస్తవ మతాల ప్రభావాల వలన హిందూ మతాన్ని సంస్కరించు కావాలన్న ధోరణులు మొదలయ్యాయి.భారత దేశానికి వేగుచుక్కలా బెంగాల్లో రామ్మోహన్ రాయ్, ద్వారకా నాథ్ టాగూర్ తో కలిసి 20.8.1828 లోబ్రహ్మ సమాజాన్ని కలకత్తాలో ఏర్పరచాడు. దీని ప్రభావం భారతదేశమంతా విస్తరించింది.ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పై. వీరేశలింగం దాన్ని అందుకున్నాడు. మధ్యయుగాలలో తలెత్తిన ఛాందసవాదాలను, మూడనమ్మకాలను, తుత్తునియలు చేస్తూ అనేక సంస్కరణలు మొదలు పెట్టాడు రాయ్. అందుకే రామమోహన్ రాయ్ ని ఆధునిక భారత దేశ పితామహునిగా చరిత్రకారులు కీర్తించారు...

రంగనాయకమ్మ

రంగనాయకమ్మ! ——————- రంగనాయకమ్మ. రచయిత. మహిళా రచయిత. మంచి రచయిత. ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు కాదు. ఇప్పుడామె ఒక 'విప్లవ రచయిత.' మానవ సమాజానికి కావాల్సిన అనేక సంగతుల మీద అసంఖ్యాకంగా రాస్తున్న ఒక 'బహుముఖ ప్రజ్ఞాశాలి.' ఈ మాట కొందరికి రుచించక పోవొచ్చు. కానీ అదే నిజం. సమకాలికుల్లో పాండిత్య పోటీ ఉంటుంది. 'ఎవరు గొప్పా' అనే సాహిత్య ఆధిక్యత ఉంటుంది. ఈమె మహిళ కాబట్టి ఇంకొంచం పురుషాధిక్యత ఉంటుంది. చేకూరి రామారావు వంటి వాళ్లకు ఇంకొంచం అకడమిక్ ఆధిక్యత కూడా ఉంటుంది. వాటిని పక్కన బెట్టి, పాఠకుల వేపు నించీ చూస్తే, ఇన్నేళ్ల ఆమె కృషి ఫలించి నట్లే. కొన్ని వేల మంది పాఠకులు ఆమె సాహిత్యానికి చేరుకున్నట్లే. రచనల కోసం రచనలు చేసే వ్యక్తి కాదు ఆమె. ప్రజల కోసం; ఇంకా చెప్పాలంటే- శ్రామికుల కోసం (మేధావుల కోసం మాత్రం కాదు) సరళంగా రచనలు చేస్తున్న వ్యక్తి. ఆర్ధిక శాస్త్రం మీద రాశారు. తత్వ శాస్త్రం మీద రాశారు. భాషను సరళంగా నేర్పేందుకు ఇంగిలీష్, తెలుగు భాషల మీద రాశారు. రామాయణం మీద రాశారు. భారతం మీదా, వేదాల మీదా రాశారు. నాస్తిక, హేతువాద, మానవ వాదాలు ఆర్ధిక పునాదిని పట్టించు కోకుండా చేసే వాటిని '...

ఆర్య స‌మాజ తాత్వికత

Image
ఆర్యసమాజ్ సామాజిక చింతన             ఆర్యసమాజ్ ను  సొసైటీ ఆఫ్ నోబుల్స్ అని ఇంగ్లీషులో అంటారు. ఇది క్రైస్తవ మిషనరీలు, సూఫీయుల ప్రభావంతో స్వాతంత్ర్యానికి పూర్వమే ప్రారంభమైంది. 1875 ఏప్రిల్ 10న ముంబయిలో స్వామి దయానంద సరస్వతి ఈ సమాజాన్ని స్థాపించారు.            దయానంద చిన్నప్పటి పేరు మూలశంకర్. దయానంద సరస్వతి గుజరాత్ లోని టంకారాలో ధనిక శైవ కుటుంబం లో జన్మించినప్పటికీ తన ఉద్యమాన్ని తరువాతి కాలంలో అదే సంవత్సరం పంజాబ్‌లోని లాహోర్‌కు మార్చాడు. 24ఏళ్ల వయస్సు లో సన్యాసం స్వీకరించాడు.దయానంద హిందూ మత ధర్మాల విషయంలో రాడికల్ భావాలు కలిగి ఉన్నాడు. అందువల్ల హిందూ మతం అనుసరిస్తున్న ధర్మాలకు భిన్నంగా సరికొత్త తాత్విక భావాలతో ఈ సంస్థ ను ఏర్పరిచారు. ఈ సంస్థకున్న కొన్ని భావాలు దీని తరువాత యాభయ్ ఏళ్లకు పుట్టిన ఆర్ ఎస్ ఎస్ భావాలకు దగ్గరగా ఉన్నట్టు కనిపించినా ఇవి కలవని రేఖలు గానే ఉన్నాయి. కానీ 2014 లో   ఆర్ ఎస్ ఎస్ మద్దతుతో  మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత  అక్కడక్కడా హర్యానా మొదలైన ప్రాంతాల్లో పరస...

గురునానక్ తాత్విక చింతన

Image
        pc: pinterest  _గురునానక్ తాత్విక చింతన_ గురునానక్ దేవ్ 15.4.1469లో రాయ్ -భోయ్-డి తల్వాండి గ్రామంలోని కార్తీక పౌర్ణమిలో జన్మించారు. ఇది అప్పటి ఢిల్లీ సుల్తానేట్ ప్రావిన్స్. ప్రస్తుతం ఇది  పాకిస్థాన్ లో లాహోర్ సమీపంలో ఉంది. దీన్నిప్పుడు నంకన్ సాహిబ్ అని పిలుస్తున్నారు.  గురునానక్ తల్లిదండ్రులు  కళ్యాణ్ దాస్ మెహతా మరియు మాతా త్రిప్తి.1539లో కన్నుమూశారు. గురునానక్ హిందూ ,ఇస్లాం మతస్వరూపాల గురించి విస్తృతమైన అధ్యయనం చేసి,   ఆ రెండు మతాల భావాల సారాన్ని రెండింటిని మేళవించాడు. ఆయన తన స్వంత భావాలను కొన్నింటిని కలిపి తన తత్వాన్ని బోధించాడు.  అతని బోధనల ప్రకారం ప్రజలు దేవుని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా దేవునితో కనెక్ట్ అవ్వగలరు. అలాగే ఎవరైనా ఏ పేరుతోనైనా దేవుడిని ఆరాధించవచ్చు. విగ్రహారాధన అవసరం లేదన్నాడు.గురు నానక్ శిష్యులను సిక్కులు అని పిలిచేవారు. సిక్కు అనే పదం పంజాబీ పదం. సిఖానా నుంచి సిక్కు వచ్చింది. సిఖానా అంటే నేర్పించడం. సిక్కు అంటే రోజూ అభ్యసించేవాడు అని అర్థం అలా ఆయన 15వ శతాబ్దంలో సిక్కు మతాన్ని స్థాపించాడు. గురునాన...

భక్తి సూఫీ ఉద్యమాల మేలు కలయిక భారతీయ తాత్విక చింతన కు మేలుకొలుపు

Image
_భక్తి సూఫీ ఉద్యమాల మేలు కలయిక భారతీయ తాత్విక చింతన కు మేలుకొలుపు_ భక్తి ఉద్యమ తాత్విక ధోరణులు శంకరాచార్యులు పరమాత్మ గురించి తెలుసుకోవాలని ఆయన పై భక్తి కలిగి ఉండాలన్నాడు. ఆయనలో ఐక్యం కావడమే మోక్షమన్నాడు. తరువాత వచ్చిన రామానుజాచార్యులు, మధ్వాచార్యులు అదే బాటలో పయనించారు. అయితే దక్షిణ భారతదేశంలో చోళుల కాలంలో వీరశైవం శివభక్తిని ప్రచారం చేయడమే గాక ప్రజలభాషలో అనేక శైవసాహిత్యం తీసుకువచ్చారు.  తమిళదేశంలో క్రీ.శ. 5వ శతాబ్దంలో 'భక్తి' అనే పదాన్ని పేర్కొన్నారు. ఆళ్వార్లు, నయనార్లు తమ బోధనలు, కీర్తనల ద్వారా భక్తి ఉద్యమాన్ని ప్రారంభించారు. వీరు వైష్ణవ మతస్థులు. కర్నాటకలో కూడా 12వ శతాబ్దిలో బసవ(1134_1196CE)వీరశైవాన్ని ఒక ఉద్యమంగా మొదలు పెట్టాడు.అతను కుల వ్యవస్థను తిరస్కరించాడు. బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని తిరస్కరించాడు. కర్మ త్యాగాన్ని ఖండించాడు.  శైవా రాధన కోసం పట్టుబట్టాడు. అతని అనుచరులను వీర-శైవులు అని పిలిచేవారు, దీని అర్థం "శివారాధకులు". ఉత్తరాదిలో ఒక ప్రముఖ భక్తురాలు మీరా బాయిని అక్క మహాదేవి అని కూడా పిలుస్తారు. దక్షిణాదిలో మొదలైన భక్తి ఉద్యమం క్రమేణా ఉత్తరభారత దేశంల...

బౌద్ధం పునాదులపై వైదిక మతానికి ప్రాణ ప్రతిష్ట చేసిన శంకరుని తాత్విక ధోరణులు

Image
_బౌద్ధం పునాదులపై వైదిక మతానికి ప్రాణ ప్రతిష్ట చేసిన శంకరుని తాత్విక ధోరణులు_             నిద్రలో కలగన్నది వాస్తవం కాదని మెలకువ వచ్చాక తెలుస్తున్నది. ఇదిఅందరికీ అనుభవమే. మరి మేలుకున్నాక అనుభవిస్తున్నదంతా, జరిగినదంతా వాస్తవం కాదని ఎప్పుడు తెలుస్తుంది? దీనికి రజ్జు సర్ప భ్రాంతిని ఉదాహరణగా చెప్పాడు శంకరుడు. (రజ్జు - తాడు, సర్పం - పాము). మెలకువ ఉన్నప్పుడే దూరంగా ఉన్న తాడుని చూసి పాము అనుకుని పొరబడతాం. అలాగే పామును కూడా ఒక్కోసారి తాడని పొరపడవచ్చు. దాని దగ్గరకు పోయి చూస్తే అసలు అది తాడో, పామో తెలుస్తుంది. అదేవిధంగా ఈ ప్రపంచాన్ని వాస్తవమని భ్రమపడుతున్నాం. సాధన ద్వారా అది వాస్తవం కాదని తెలుస్తుందని అన్నాడు శంకరుడు.        నాశనమయేదేదీ వాస్తవం కాదు అని శంకరుడు చెప్పినది తప్పు.“మార్పు, కదలిక, నాశం కలిగిన వస్తువు అవాస్తవికం అనే శంకరుని ప్రాథమిక ప్రతిపాదనే పొరపాటు. ఎందుకంటే ఇంద్రియగోచరమైన ప్రతి వస్తువు కదులుతున్నది.మార్పు చెందుతోంది, నశిస్తున్నది, రూపాంతరం చెందుతోంది. ప్రగతిశీలమైన,ప్రవాహ సదృశమైన ఈ బాహ్య ప్రపంచాన్నంతా వాస్తవమని, శంకరునికి ...

భారతీయ తాత్విక చింతనకు అపశృతి మనుస్మృతి

Image
_భారతీయ తాత్విక చింతనకు   అపశృతి మనుస్మృతి_                                ఏ తాత్విక దృక్పథం లేని,మానవ సమాజం పురోగతికి అడ్డుగోడలైన మను ధర్మాలు సామాజిక ధర్మాలు గా నేటికీ చెలామణి అవుతున్నాయి.  బ్రాహ్మణ ధర్మాలు గా ఉన్న హిందూ ధర్మాలుగా హిందూమతంగా  ఏర్పడే నాటికి సామాజికంగా మార్చి  మనుధర్మ శాస్త్రాన్ని రూపొందించారని కత్తి పద్మారావు తెలిపారు. ఇది ఆనాటి రాజ్యాంగంగా భావించాలని ఆయన చెప్పారు.             హిందూ ధర్మం సనాతనమైనదని చెపుతుంటారు గానీ,ఇది వాస్తవం కాదు.హిందూ ధర్మంగా చెలామణి అవుతున్న మను ధర్మ స్మృతి  200CE- 200BCE కి చెందిందని చాలామంది పరిశోధకులు తెలుపుతున్నారు. భారతదేశంలో దాదాపు ముప్పై అయిదు స్మృతులున్నాయి. వీటిల్లో మను స్మృతి పేరొందింది. దీని తర్వాతనే యాజ్ఞవల్క్య స్మృతి, పరాశర స్మృతి మొదలైనవి లెక్కకు వస్తాయి. మనుస్మృతి అనగానే మనువు రచించిన స్మృతి అని అనుకుంటాం కానీ మనువు దీనిని రాయలేదని పరిశోధనల అభిప్రాయం.ఈ మనువెవ్వరో చాలా మందికి తెల...

Philosophy of Nagarjuna

Image
Nagarjuna,sunyavada  Buddhist philosopher By Donald S. Lopez  Nagarjuna was a Buddhist monk who lived between 150 and 250 CE, most likely in southern India.Nagarjuna was born into an upper-caste Brahmin family, most likely in the southern Andhra area of India, as a "Hindu," a term that meant religious loyalty to the Vedas at the time.Nagarjuna's flight from Andhra to study   Buddhism  in    Nalanda  in present-day Bihar, the eventual site of the largest Buddhist scholastic learning monastery in the tradition's illustrious history in India, may probably be based on Tibetan sources. Nagarjuna, (flourished 2nd century CE), Indian Buddhist philosopher who articulated the doctrine of emptiness (shunyata) and is traditionally regarded as the founder of the Madhyamika (“Middle Way”) school, an important tradition of Mahayana Buddhist philosophy. Notable Works: “Bstan-’gyur” “Dacang Jing” “Mulamadhyamakakarika” Subjects Of Study: Buddhism Mādh...