Posts

Showing posts from January, 2023

జవహర్ లాల్ నెహ్రూ ఆధునిక భావాల తాత్విక దృక్పథం

Image
జవహర్ లాల్ నెహ్రూ ఆధునిక భావాల తాత్విక దృక్పథం ఎవరు చెప్పు  ఈ విశాల గగనం మీద ఈ దిక్కు నుండి ఆ దిక్కుకు  యింత అర్ధవంతంగా ఆగామి మానవ సంతతికి ఆదేశంగా ఆదర్శంగా  స్వర్ణాక్షర సంకేతాన్ని రచించిన మనీషి! ఎవరు చెప్పు  యీ ప్రపంచ చరిత్ర తలుపు తట్టి  లోపలి చీకటిలో గదిగదిలో  మూల్గులు వినవచ్చే ఎదఎదలో  ఆశా కర్పూర దీపాన్ని వెలిగించిన  నవీన రాజర్షి! అంటూ     దేవరకొండ బాలగంగాధర తిలక్ తన అమృతం కురిసిన రాత్రి లో అడుగుతాడు కవితాత్మకంగా. ఆయన ఎవరనుకున్నారు?              స్వేచ్ఛ సమానత్వం ప్రజాస్వామ్యం శాస్త్రీయ దృక్పథం  లౌకికవాదం, అలీనా విధానం వంటి      ఆధునిక  భావాలను భారతదేశవ్యాప్తంగా వెదజల్లి వాటిని పరిపుష్టం చేయడానికి అహరహం శ్రమించి  ఆశా కర్పూర దీపాన్ని వెలిగించిన ఆధునిక తాత్వికుడు ఎవరనుకున్నారు?              ఆయనే పండిత నెహ్రూ.             నెహ్రూ నవంబర్ 14, 1889న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని (గతంలో యునైటెడ్ ప్రావిన్స...