Posts

Showing posts from January, 2021

కార్తికేయమతం

కార్తికేయుని తమిళనాడులో ‘మురుగా’ అనీ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో ‘సుబ్రహ్మణ్య’ అనీ, ఉత్తరభారత దేశంలో ‘స్కంద’ అనీ అంటారు. ఆర్గురిని ఒకే శరీరంలో కూర్చి అవతరింపజేసిన కార్తికేయ సృష్టి ఒక గొప్ప ప్రయోగమని చెప్తారు సద్గురు. కార్తికేయునికి, అగస్త్యునికి మధ్య జరిగిన సంభాషణల సారమే మహాపురాణాలలో ఒకటైన స్కాంద పురాణం. కార్తికేయుని కొన్నిసార్లు యుద్ధానికి అధిపతిగా ఎందుకు ఆరాధిస్తారో కూడా సద్గురు వివరిస్తారు. శివుని కుమారుడు కార్తికేయుని జననంలో ఒక అద్భుత ప్రయోగం ఉంది. ఆరుగురు వ్యక్తుల్ని ఒకటి చేసి ఒక శరీరంలో ఇమడ్చటం జరిగింది. ఇటువంటి ప్రయోగాలు పూర్వం చాలా జరిగాయి. పూర్వం ఇద్దరు యోగులు ఒకే శరీరం పంచుకున్నారు. ఒకే శరీరంలో ఇద్దరు వ్యక్తులున్నారన్నమాట. వాళ్లు రెండు భిన్నమైన భాషలు మాట్లాడతారు, భిన్నంగా ఉంటారు. కాని ఇక్కడ ఆరు ప్రాణులు ఒకే శరీరంలో. ఇది ఎలా జరిగిందో తెలుసుకుందాం. శివుణ్ణి గొప్ప వీర్యశాలిగా వర్ణించినప్పటికీ, ఆయనకెన్నడూ సంతానం లేదు. ఏ మానవ స్త్రీ కూడా శివుని బీజాన్ని తన గర్భంలో నిలుపుకోలేదని అంటారు. అందువల్ల ఆయన తన వీర్యాన్ని హోమాగ్నిలో విడిచిపెట్టాడు. హోమాగ్ని అంటే అది నిజంగా అగ్ని కావలసిన అవసర...

శాక్తేయ మతం

శివుని ఆరాధించే వారు శైవులు , విష్ణువును ఆరాధించేవారిని వైష్ణవులు , ఆదిశక్తి ని త్రిమూర్తులకంటే శక్తిమంతురాలని ఎంచి ఆరాధించే వారిని శాక్తేయులు అంటారు.శక్తిని పార్వతీదేవిగా భావిస్తారు.గ్రామ సరిహద్ధులను కాపాడే దేవత పొలిమేరమ్మ.మసూచి,ఆటలమ్మ లాంటి కొన్ని రోగాలొస్తే అమ్మవారు పోసిందనటం అర్ధరహితం కాపాడే దేవతపై అపనిందమోపటమే అవుతుంది.సరస్వతి, లక్ష్మి, పార్వతిలు కలసిన పరమశక్తి పోలేరమ్మఅంటారు.పోలేరమ్మను తెలంగాణాలో పోచమ్మ అంటారు.మాతృస్వామిక వ్యవస్ధకు చెందిన గ్రామ దేవతలు దళిత దేవతలు.బహుజన సంస్కృతి పరిరక్షకులు.సమాజంలోని బడుగుకులాలవారు కూడా అగ్రకులాలతోపాటు సమానంగా సామాన్య, సాంస్కృతిక ఆచార వ్యవహారాల్లో ఉత్సాహంగా పాలుపంచుకోవటం ఈ గ్రామదేవతల జాతరల వల్ల సాధ్యమయ్యింది. వర్షాలు పడాలని పోలేరమ్మ తిరునాళ్లు, కొలుపులు చేస్తారు.పోలేరమ్మకు జంతు బలులు ఇస్తారు. మేకలు,పొట్టేళ్ళు, కోళ్ళను నరకడం ,పొంగళ్ళు పెట్టి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకోవడం జురుగుతుంది

గురునానక్ (gurunanak)

Image
               గురునానక్ (gurunanak) గురునానక్ జయంతిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులు ఈ ఏడాది నవంబర్ 12న జరుపుకుంటున్నారు. ఈ గురునానక్ జయంతిని ప్రకాశ పర్వం, గురుపార్బ్ అని కూడా అంటారు. ఈరోజున సిక్కులు సిక్కు గ్రంథం, గురు గ్రంథ్ సాహిబ్ ను నిరంతరం పారాయణం చేస్తారు. పల్లకి ఊరేగింపులో గ్రంథంలోని సారాంశాల ఆధారంగా కవితలు పాడతారు. గ్రంథ్ సాహిబ్ ను ఊరేగింపులతో పూలతో అలంకరించిన రథంలో తీసుకెళతారు. ఈ పవిత్ర దినం రోజున గ్రంథ్ సాహిబ్ పంక్తులను జపిస్తారు. ఈ గురునానక్ జయంతి సిక్కు సమాజానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. సిక్కు సమాజానికి 10 మంది గురువులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి గురు పార్బ్ ఉంది. సిక్కు ప్రజల మొదటి గురువు గురునానక్ జన్మదినం సందర్భంగా, సిక్కు మతానికి పునాది వేసిన వ్యక్తి ఆయనే కాబట్టి గురునానక్ జయంతిని ఉత్సాహంతో జరుపుకుంటారు. ఆయన పుట్టినరోజు ప్రతి సంవత్సరం చంద్ర క్యాలెండర్ ను బట్టి మారుతూ ఉంటుంది. ఈ సంవత్సరం సిక్కులు 550వ గురునానక్ ప్రకాశ పర్వదినాన్ని జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఈ పండుగ జయంతి గురించి, చరిత్ర మరియు ప్రాముఖ్యతతో పాటు గురునానక్ గు...

మూఢనమ్మకాలకు తావులేని శాస్త్రీయ దృక్పథం

మూఢనమ్మకాలకు తావులేని శాస్త్రీయ దృక్పథం మనుషులలో ఏర్పడిన భేదాలు మనం సృష్టించుకున్నవేనని అది బోధిస్తుంది. అదేవిధంగా ఒకరు దేవుడి పుత్రులు, మరొకరు సామాన్యులు అనే అసమా నతలను తిరస్కరించి, సమానత్వాన్ని బోధించే నూత్న తాత్వికతను అభివృద్ధి పరుస్తుంది. ఇది ఎంతో వివేచనతో సమాజాన్ని ఆవిష్కరించిన ఘట్టం. బౌద్ధం విశ్వమానవ మతంగా రూపొందడానికి ఉన్న తాత్విక పునాది ఇది. ఇందులో ఎక్కడా మూఢనమ్మకాలకు తావు లేదు. విశ్వపరిణామ క్రమాన్ని ఎంతో సూక్ష్మదృష్టితో పరిశీలించిన బుద్ధుడు ఆ కాలపు విజ్ఞాన ఖనిగా దర్శన మిస్తాడు. బుద్ధుడు బోధి చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసిన మాట నిజమే కావచ్చు. అక్కడ ఆయనకు జ్ఞానోదయం కలుగవచ్చు. కానీ అది కళ్లు మూసుకొని ధ్యానం చేయడం వల్ల సాధ్యమైందనేది అబద్ధం. ఆయన తన ఇంటిని వదిలిపెట్టి వెళ్లాక మనిషి పుట్టుక, జీవనం, మరణాలపై జరుగుతున్న చర్చలన్నింటినీ విన్నాడు. వాటన్నిటినీ అర్థం చేసుకుని, క్రోడీకరించి తన దైన ఒక తాత్వికతను సృష్టించుకున్నాడు. అందువల్లనే ఆనాటి సమాజంలో తప్పుగా ప్రచారమవుతున్న దేవుడు, సృష్టి, జననం, మరణం అనే అంశా లనూ, ప్రత్యేకించి ప్రముఖంగా ప్రచారమవుతున్న అసత్యాలనూ ఆయన తన తాత్విక పరిశోధనలో న...

శంకరుని మిథ్యా వాదాన్ని తిరస్కరిస్తూ పరమాత్మను ఆత్మ లకు పెద్ద గా ప్రతిపాదించినమధ్వాచార్య ద్వైత సిద్ధాంతం.

శంకరుని మిథ్యా వాదాన్ని తిరస్కరిస్తూ పరమాత్మను ఆత్మ లకు పెద్ద గా ప్రతిపాదించిన మధ్వాచార్య  ద్వైత సిద్ధాంతం. ఆత్మ వేరు.పరమాత్మ వేరు.ఈ ప్రపంచం మిథ్య‌‌‌ కాదు. ఆత్మ కూడా మిథ్య కాదు.కొన్ని ఆత్మలు మంచివి.కొన్ని పనికిరానివి. మంచివాటికి మాత్రమే మోక్షం లభిస్తుంది.అంటే అవి పెద్ద పరమాత్మ లో కలిసిపోతాయి.ఈ ఆత్మ లన్నింటికీ పెద్దగా ఉన్న పరమాత్మను వాసుదేవునిగా పేర్కొన్నారు. ఆయనే ఈ సృష్టికి మూల కారకుడు అంటూ రామానుజుల సిద్దాంతానికి కొనసాగింపు నిచ్చిన సిద్దాంతం మధ్వాచార్యులది.       ఆయన తన సిద్ధాంతాన్ని ద్వైత సిద్ధాంతం అన్నారు.దీన్ని నిరూపించడానికి మధ్వాచార్యుడు ఉపనిషత్తులకు, బ్రహ్మసూత్రాలకు, భగవద్గీతకు భాష్యాలు రాశాడు. ఇంకా రుగ్వేదంలోని మొదటి 40 సూక్తాలకు, భారత భాగవతాలకు వ్యాఖ్యానం రాశాడు. తర్కంతోపాటు మొత్తం 37 గ్రంథాలను రచించాడు. మద్వాచార్యులు కర్నాటక లోని ఉడిపి వద్ద నున్న పాజక గ్రామంలో క్రీ.శ. 1238 సంవత్సరంలో మధ్యగేహ భట్ట, వేదవతి దంపతులకు విజయదశమి రోజున జన్మించారు. ఇతని జీవిత కథను  నారాయణ పండితాచార్య రచించారు. అతనికి మొదట్లో వాసుదేవ అని పేరు పెట్టినారు. తరువాత కాలంలో పూర్ణప్రజ్...

శంకరుని మిథ్యా వాదాన్ని ఖండించిన రామానుజులు

శంకరుని మిథ్యా వాదాన్ని ఖండించినా ఆత్మ పరమాత్మ లను అంగీకరించిన రామానుజులు         శంకరుని తరువాత సుమారు 200 సంవత్సరాలకు  రామానుజులు క్రీ.శ. 1017లో  శ్రీ పెరంబుదూరు (తమిళనాడు)లో (ఇప్పుడది  భూతపురి)  కాంతమతి,కేశవాచార్య దంపతులకు జన్మించారు. చెన్నై పట్టణానికి సుమారు 25 కి.మీ.దూరంలో ఉంది. తండ్రి వద్ద, కాంచీపురంలోని యాదవ ప్రకాశకుల వద్ద ఆయన విద్యాభ్యాసం పూర్తి చేశారు. శ్రీరంగ కేంద్రంగా చేసుకుని తన కృషిని కొనసాగించారు. బ్రహ్మసూత్రాల పైనా, భగవద్గీత పై భాష్యాలు రచించారు. ఈయన దాదాపు 123 సంవత్సరాలు తన సిద్ధాంతాలను ప్రచారం చేశారు.          రామానుజులు  నమో నారాయణాయ నమః అనే అష్టాక్షరీ మంత్రాన్ని దేవాలయం పైకి ఎక్కి అందరికీ వినిపించేలా చెప్పడం ద్వారా  సర్వమత(అన్ని రకాల దేవుళ్ళను) సమదృష్టిని ప్రచారం చేశారు.వేదాలలో 'భగ' అన్న దేవుడి ప్రస్తావన ఉంది. భగ అనే దేవుడు అన్నీ శుభం జరిగేలా ఆశీర్వదించే దేవుడని వేదకాలంలో నమ్మేవారు.         అట్టడుగున ఉన్న  ప్రజలందరూ భగవంతుని తత్వం అర్థం చేసుకోవాలని బోధించాడు. అందరూ ఆలయప...

ప్రపంచం మిథ్య, ఆత్మ, పరమాత్మ ఒక్కటే నని అద్వైతాన్ని ప్రతిపాదించిన ఆదిశంకరుడు

మిథ్యావాదాన్ని, అద్వైతాన్ని ప్రతిపాదించిన ఆదిశంకరుడు. నంబూద్రి బ్రాహ్మణులైన ఆర్యమాంబ, శివగురులకు కేరళ లోని పెరియార్ నది ఒడ్డున ఉన్న కాలడి గ్రామంలో క్రీ.శ. 788 లో శంకరుడు  వైశాఖ శుద్ధ  పంచమి తిథి నాడు  ఆరుద్రలో జన్మించారు.  కేరళలో ఎర్నాకులం జిల్లా లోగురువాయూర్ కు 75కిలో మీటర్ల దూరం లో కాలడి గ్రామం ఉంది.       శంకరుల బాల్యంలోనే తండ్రి మరణించారు. ఆర్యమాంబ కొడుకును  పెంచి పెద్ద చేసి  శాస్త్రోక్తంగా ఉపనయనం జరిపించింది.       శంకరులు ఏకసంథాగ్రాహి. బాల్యంలోనే వేదవిద్యలు, సంస్కృతం అభ్యసించారు.  శంకరులు చిన్న తనంలో నే సన్యాసం తీసుకోవాలనుకున్నాడు. తాను ఒంటరినౌతానన్న కారణంతో తల్లి అందుకు అంగీకరించలేదు. ఒకరోజు శంకరులు పెరియార్ నదిలో స్నానం చేస్తూండగా ఒక మొసలి పట్టుకుంది. సన్యాసం తీసుకోవడానికి అంగీకరించమని, ఆ విధంగా మరణించే సమయంలోనైనా తాను సన్యాసిగా ఉంటాననీ తల్లిని కోరినారు. దానికి ఆమె అంగీకరించింది. శంకరులు మొసలి బారి నుంచి చాకచక్యంగా పలువురి సాయంతో తప్పించుకున్నాడు.తగిన గురువు కోసం అన్వేషించడానికి  ఉత్తర భారత యాత్ర చేయాలని ...

టెక్నాలజీ ఎంత పెరిగినా తార్కిక హేతువాద భావాలను అందుకోని భారతీయ సమాజం

టెక్నాలజీ ఎంత పెరిగినా తార్కిక హేతువాద భావాలను అందుకోని భారతీయ సమాజం                         అంతరిక్షంలో సుదూరంగా ఉన్న అంగారకుని మీదకు అంతరిక్ష నౌకలు పంపిస్తున్నాం. చంద్రుడిపై మానవ సహిత ప్రయోగాలకు సిద్ధమవుతున్నాం. ఆలోచనలు సుదూర అంతరాళం వైపు దూసుకుపోతున్నా మన విశ్వాసాలు మాత్రం పాతాళంలోనే ఉంటున్నాయి. విమానాల్లో ప్రయాణిస్తున్నాం. కానీ కూపస్తు మండుకాల్లా జీవిస్తున్నాం. కొత్త టెక్నాలజీని అంది పుచ్చుకుంటున్నాం. కానీ పనికిరాని నిరర్ధక ఆలోచనల్ని విడిచిపెట్టలేక పోతున్నాం. అక్షర జ్యోతులు వెలుగించు కుంటున్నాం. కానీ మూఢాచారాలతో అంధ కారంలో మగ్గిపోతున్నాం. అంధవిశ్వాసాలను ప్రశ్నించినవారిని, సరైన మార్గం చూపించేవారి ని నిర్హేతుకంగా హతమారుస్తున్నాం. ఆధునిక సమాజం సిగ్గుపడే మూఢ విశ్వాసాలతో మన మెదళ్లు కుంచించుకుపోతున్నాయి.           అశాస్త్రీయమైన మూఢవిశ్వాసాలకు అధికారానికి మధ్య దగ్గర సంబంధముంది. దీనికి కారణాలు అనేకం. ఇవి ప్రజల్లో ఉంటే  అధికారులిచ్చే ఆజ్ఞలకు ప్రజలు విధేయులుగా వుంటారని,దైవభక్తిని ప్రదర్శించేవారు ప్రతి వి...

త్రిమతాచార్యులు

భౌతిక వాదాన్ని నాశనం చేసి తాత్వికంగా భారతదేశాన్ని అంధకారంలోకి తీసుకెళ్లిన త్రిమతాచార్యులు            అద్వైతమంటే రెండుగానిది. ఆత్మ పరమాత్మ రెండు గాదు, ఒకటే నని అర్ధం. ఈ దిశ నుండి శంకరుడు భారతీయ భౌతిక దర్శనాలపై వ్యాఖ్యానం చేసి వాటి మూలాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించాడు. భారత రాజకీయ వ్యవస్థ ఇతనికి అనుకూలంగా ఉండటం ఇతని విస్తరణకు అవకాశం కల్పించింది. హిందూ ధార్మిక వాదులు రాజ్య శక్తిని తమకు అనుకూలంగా ఉపయోగించు కోవటంలోను, నిర్మించుకోవటంలోనుఅద్వితీయులుగా ఉన్నారు.           విచిత్రమేమంటే, శంకరుని మాయా వాదాన్ని, రామానుజుని విశిష్టాద్వైతం పూర్తిగా ఖండించింది.         ఆత్మ-పరమాత్మ రెండూ ఒకటే.కాని, ఆత్మ పరమాత్మను చేరాలంటే, అది భక్తి ద్వారానే సాధ్యం అని చెప్పి, విశిష్టాద్వైతం శంకరుని మాయావాదంపై దాడి చేసింది.           ఈ రెండు వాదాల్ని మధ్వాచార్యుడు తన ద్వైతవాదంతో ఖండించాడు. ఆత్మ-పరమాత్మ రెండూ ఒకటి కావు. రెండూ వేరువేరు అని ఆయన సిద్ధాంతీకరించాడు.           పూర్తి భి...

భారతీయ తాత్వికచింతన గొప్ప మలుపు తిప్పిన బుద్ధుడు

Image
_భారతీయ తాత్వికచింతన గొప్ప మలుపు తిప్పిన బుద్ధుడు_            క్రీ.పూ.563లోవైశాఖ పూర్ణిమలో నేటి నేపాల్ దేశంలోని కపిలవస్తు నగరానికి సమీపంలో లుంబినీ గ్రామంలో  బుద్దుడు జన్మించారు. బుద్ధుడు హేతువాది, గొప్ప విజ్ఞాని, బుద్ధుడు చెప్పిన విషయాలు ఆధునిక విజ్ఞానం చెప్పే సూత్రాలకు ఏమాత్రం తీసిపోవు. ఈ విశ్వం ఎలాంటి అతీంద్రియ శక్తుల సహాయం లేకుండానే నడుస్తోందని చెప్పాడు. ప్రపంచంలో ప్రతిదీ ఒకదానితో మరొకటి ఆధారపడి నడుస్తోందని చెప్పాడు. ప్రపంచంలో ప్రతిదీ ఒకదానితో మరొకటి సంబంధాలు కలిగి వుంది. ఈ సంబంధాల అల్లికలో ఎలాంటి ప్రాకృతిక శక్తుల జోక్యానికి అవకాశం లేదన్నాడు. ఇంద్రజాలానికి, మహేంద్ర జాలానికి మంత్రతంత్రాలకు చోటు లేదన్నాడు. ఈ విజ్ఞానాన్ని థేరవాదం పాటిస్తున్నది.  ఆయన ప్రతిపాదించిన విజ్ఞాన దాయక విషయాలు  ప్రధానంగా 1. ఈ ప్రపంచం ప్రతిక్షణం మారుతూ వుంటుంది. ఈ మారే ప్రపంచం వెనుక మారనిది ఏదీలేదు.నిత్యమైనది ఏది ఉండదు అని చెప్పారు. ప్రతీది నిరంతరం మార్పు చెందుతుందన్నారు.ఈ క్షణం లో కనిపించే దీపశిఖ మరో క్షణం లో కనిపించే దీపశిఖ ఒకటి కాదన్నారు..ఈ ప్రపంచం మారుతూ ఉ...

మధ్యయుగాల్లో రాజ్యమేలిన మను రాజ్యాంగం | Gotelugu.com

మధ్యయుగాల్లో రాజ్యమేలిన మను రాజ్యాంగం | Gotelugu.com : మధ్యయుగాల్లో రాజ్యమేలిన మను రాజ్యాంగం మధ్యయుగాల్లో  రాజ్యమేలిన మను రాజ్యాంగం | (Gotelugu.com 12/2019) https://www.gotelugu.com/teluguarticles/view/9448/#.X_A7K-rW9QA.whatsapp