నిత్య చైతన్య ప్రవాహం భగత్ సింగ్
pc. Facebook నిత్య చైతన్య ఝరీ ప్రవాహం భగత్ సింగ్ తాత్విక ఆలోచనలు "జీవితాన్ని ప్రేమిస్తాం,మరణాన్నీ ప్రేమిస్తాం. మేం మరణించి ఎర్రపూల వనంలో పూలై పూస్తాం. ఉరికంబాన్ని ఎగతాళి చేస్తాం. నిప్పురవ్వల మీద నిదురిస్తాం.”అన్న భగత్‌సింగ్ 1907 సెప్టెంబర్ 27వ తేదీన నేటి పాకిస్థాన్‌లో గల ల్యాల్‌పూర్ జిల్లా లోని బంగాలో కిషన్ సింగ్, విద్యావతి దంపతులకు జన్మించాడు. 1931, మార్చి 23వ తేదీన లాహౌర్ జైలులో బ్రిటిష్ వారి ఉరికొయ్యలపై ఈ విప్లవకిశోర కంఠారావం ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ మూగబోయింది. అదిప్పుడు భారతదేశ యువతరాన్ని తట్టి లేపుతోంది. అప్పటికి భగత్ సింగ్ వయసు 23 ఏళ్లు మాత్రమే. జలియన్ వాలాబాగ్ మారణకాండ ఆయన్ను 12 సంవత్సరాల వయస్సు లోనే సామ్రాజ్యవాద వ్యతిరేక యోధునిగా పరిణమించేలా చేసింది. భగత్‌సింగ్ కు గాంధీ నాయకత్వంలో సాగుతున్న జాతీయోద్యమం పట్ల భ్రమలు తొలిగిపోయాయి. 1924వ సంవత్సరంలో ఆయన సచీంద్రనాద్ సన్యాల్, రాంప్రసాద్ బిస్మిల్ వంటి విప్లవకారులతో స్థాపించబడిన హిందుస్థాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోషియేషన్లో చేరాడు....