సమాజంలో అసమానతలు
ఆదిమ సమాజంలో మానవుడు ప్రకృతి విపత్తులు ఎదుర్కొంటూ జీవించేవాడు. క్షణం క్షణం క్రూరమృగాల తో పోరాడుతూ అడవుల్లోని గుహల్లో జీవితాన్ని కొనసాగించే పరిస్థితి ఉండేది. ఈ సంఘర్షణలో మనిషి చాలా దృఢకాయుడుగా ఉండేవాడు. ఆరోగ్యంగా ఉండేవాడు. అనారోగ్యం బారిన పడేవాడు కాదు .మనిషి ఎప్పుడూ ప్రమాదానికి చేరువగా జీవించేవాడు. అంతే. తనను తాను కాపాడుకోవడమే ముఖ్యంగా ఉండేది. అతని ఆలోచనలన్నీ ఆహార సేకరణ, తన్ను సంరక్షించుకోవడం,ఈ రెండింటి మీద ఉండేది.ఆ క్రమంలో అవి అతని పంచేంద్రియాల పై ప్రభావాన్ని కలిగించాయి. జంతువులు మాత్రం ప్రకృతికి లోబడి ఉండేవి. మనిషి మాత్రమే ప్రకృతి కి ఎదురుతిరుగుతూ ఉండేవాడు. ఆ క్రమంలో మానవుల్లో అవగాహన శక్తి మెల్లగా పెరిగింది. అతని అనుభూతులు ఆవేశాలు దీనికి అవకాశం కలిగించాయి. ఆది మానవుడికి భౌతిక అవసరాలు మాత్రమే అవసరమయ్యేవి. ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం కావాలి. ఆకలి తీరాక లైంగిక సుఖం కావాలి. ఈ రెండే. అతను మృత్యువు గురించి ఆలోచించలేదు. ప్రకృతి గురించి అవగాహన పెరిగేకొద్దీ మృత్యువును గురించి ఆలోచించడం మొదలు పెట్టాడు. నైతిక ...