భగవద్గీత _పూర్వపరాలు
భగవద్గీత _పూర్వపరాలు ____ పిళ్లా కుమార స్వామి ************************** భగవద్గీత అంటే భగవంతుని గీత (పాట )అని అర్థం. మహాభారత కథలో కురు క్షేత్రంలో జరిగిన యుద్ధం ప్రారంభ సమయంలో పాండవ మధ్యముడైన అర్జునుడు తన ఎదుటి పక్షం లో ఉన్న బంధువులను గురువులను చూచి వారందరినీ తాను చంపడం ఇష్టం లేక బాధతో అస్త్ర సన్యాసం చేస్తాడు .ఆ సందర్భంలో అర్జునునికి రథసారథిగా ఉన్న శ్రీ కృష్ణునికి అర్జునునికి మధ్య జరిగిన సంభాషణ లోని భావాలే భగవద్గీత. ఇది మహాభారతంలో భీష్మ పర్వం లో 700 శ్లోకాలతో ( పద్యాలతో) 18 భాగాలుగా ఉంది. దీనిని సంస్కృతంలో వ్యాసుడు రచించారని అందరూ నమ్ముతారు. అయితే క్రీ.పూ.1000 లలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా 8000 శ్లోకాలతో 'జయం' పేరుతో వ్యాసుడు ఒక కావ్యాన్ని రాస్తే, దానికి క్రీ. పూ. 400_ క్రీ.శ 400 మధ్యలో ఇతర పండితుల ద్వారా అనేక కథలను కలుపుతూ మహాభారతం గా రచింపబడినదని చరిత్రకారులు నిర్ణయించారు. ప్రారంభంలో భగవద్గీత మహాభారతంలో లేదని తన తదనంతర కాలంలో భగవద్గీతను మహాభారత యుద్ధ ఘట్టం ల...