నేటి నుండి 2700 సంవత్సరాల క్రితం గంగానది లోయలో అభివృద్ధి చెందిన జనపదాలు, మహా జనపదాలు
నేటి నుండి 2700 సంవత్సరాల క్రితం గంగానది లోయలో అభివృద్ధి చెందిన జనపదాలు, మహా జనపదాలు ఉత్తర భారతదేశ విశాల మైదానాన్ని గంగా, సింధూ మైదానం అని పిలుస్తారు. హిమాలయాలకు, ద్వీపకల్ప పీఠభూమికి మధ్య గంగా యమునలు ప్రవహిస్తాయి. గంగాలోయ మైదానం అధిక వర్షపాతం, హిమాలయాలనుంచి ప్రవహించే అతిపెద్ద నదులు తెచ్చే ఒండ్రుతో సారవంతంగా ఉంటుంది. ఆ నదులలో నీళ్లు సంవత్సరం పొడవునా ప్రవహిస్తాయి. 1500 నుండి క్రీ.పూ 500 మధ్య జనపదాలు వృద్ధి చెందాయని సాహిత్య ఆధారాలు సూచిస్తున్నాయి. "జనపద" అనే పదం మొట్టమొదటి ప్రస్తావన ఐతరేయ (8.14.4), శతపథ (13.4.2.17) బ్రాహ్మణ గ్రంథాలలో కనిపిస్తుంది. వేద సంహితాలలో జన అనే పదం ఒక తెగను సూచిస్తుంది. దీని సభ్యులు పూర్వీకుల వారసులు అని విశ్వసించారు.ఒక రాజు ప్రజలకు నాయకత్వం వహించాడు. సమితి అనేది జన సభ్యుల ఉమ్మడి సభ రాజును ఎన్నుకునే అధికారం, బహిష్కరించే అధికారం కలిగి ఉంది. సభ రాజుకు సలహా ఇచ్చే తెలివైన పెద్దల చిన్న సమావేశంగా ఉంటుంది. మొదట్లో వివిధ తెగలు ఈ మైదానంలోని అనుకూల ప్రాంతాలలో వ్యవసాయంచేస్తూ స్థిరపడ్డాయి. వీరిని సంస్కృతంలో 'జన’ అనీ, వారు స్థిరపడిన ప్రాంతాన్ని 'జనపదం' అ...