Posts

Showing posts from October, 2023

తాత్విక చింతన అంటే ఏమిటి?

తాత్విక చింతన అంటే ఏమిటి? ఏది జీవితమేది మృత్యువు ఏది పుణ్యం, ఏది పాపం ఏది నరకం, ఏది నాకం  ఓ మహాత్మా , ఓ మహర్షి ఏది సత్యం, ఏదసత్యం ఏదనిత్యం, ఏది నిత్యం ఏది ఏకం, ఏదనేకం ఏది కారణమేది కార్యం ఓ మహాత్మా , ఓ మహర్షి అని శ్రీశ్రీ జీవితం గురించి ఈ ప్రపంచం గురించి ఎన్నో ప్రశ్నలు వేస్తాడు. ఇలాంటి ప్రశ్నలకు సమాధానంగా    ప్రజలు తమ గురించి, తాము నివసించే ప్రపంచం గురించి,   ఒకరికొకరుతో వారికి గల సంబంధాల గురించి ప్రాథమిక సత్యాలను అర్థం చేసుకోవడానికి  చేసే కార్యాచరణే  తాత్విక చింతన అంటారు.తాత్విక చింతన గురించి చర్చించేదే తత్వశాస్త్రం.        తత్వశాస్త్రం అనేది నీతి, ఆలోచన, ఉనికి, సమయం, సంపద , విలువలు వంటి కొన్ని విషయాల గురించి ఆలోచించే మార్గం. ఆ 'ఆలోచనా విధానం'లో 4 రూపాలు ఉంటాయి:    రెస్పాన్సివ్‌నెస్ ,   ఎఫెక్షన్,  రీజన్, మూల్యాంకనం.  అవగాహనను మరింతగా పెంచుకోవడమే తత్వశాస్త్రం లక్ష్యం. ఆలోచన చేయడం ద్వారా మనం మంచిగా ఆలోచించగలం. మరింత తెలివిగా వ్యవహరించడం నేర్చుకుంటాం. తద్వారా సామాజిక జీవితాల నాణ్యతను మెరుగుపరచడంల...