సృజనాత్మక, ఆచరణాత్మక తాత్విక వెలుగులు చిమ్మిన ఈఎమ్మెస్ నంబూద్రిపాద్
సృజనాత్మక, ఆచరణాత్మక తాత్విక వెలుగులు చిమ్మిన ఈఎమ్మెస్ నంబూద్రిపాద్ ____పిళ్లా కుమారస్వామి,949012229 ప్రపంచంలో నే మొట్టమొదటి సారిగా పార్లమెంటరీ పద్దతుల్లో భారతదేశంలోని కేరళలో కమ్యూనిస్టు పార్టీ ని అధికారంలోకి తీసుకొచ్చిన EMS నంబూద్రిపాద్ పూర్తి పేరు ఎలంకులం మనకల్ శంకరన్ నంబూద్రిపాద్. ఆయన జూన్ 13, 1909, కేరళ లోని పెరింతల్మన్న సమీపంలో ఒక చిన్న గ్రామంలో జన్మించారు. ఆయన మార్చి 19, 1998 న 89 సంవత్సరాల వయస్సులో తిరువనంతపురంలో మరణించారు. వీరి భార్య పేరు ఆర్యా అంతర్జనం. వారికి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్ళు. ఆయన భారత కమ్యూనిస్టు పార్టీ సెంట్రల్ కమిటీకి సభ్యునిగా, సిపిఐ పొలిట్ బ్యూరో సభ్యుడిగా, సెక్రటేరియట్ సభ్యునిగా పనిచేశారు. చీలిక తరువాత సిపిఎం పార్టీ సిద్ధాంతకర్తగా, ఆ పార్టీ పునాది నిర్మాణ కర్తగా, ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇరవై మూడేళ్ళ వయసులో 1932లో మహాత్మాగాంధీ ప్రార...