Posts

Showing posts from July, 2025

భారత రాజ్యాంగం _ బౌద్ధం

Image
భారత రాజ్యాంగం _ బౌద్ధం          భారతదేశ తాత్వికచింతనను మలుపు తిప్పింది బౌద్ధం. ఆ బౌద్ధం  బోధించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతృత్వం, సామాజిక న్యాయం, అహింస, సహనం వంటి ఆధునిక విలువల పైన ఆధారపడి భారతదేశ రాజ్యాంగం రూపొందించబడింది. భారత రాజ్యాంగం రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బౌద్ధమతం నుండి ప్రేరణ పొందారు.ఆయన సామాజిక న్యాయం, కుల వివక్ష నిర్మూలన వంటి విలువలను నొక్కి చెప్పారు. రాజ్యాంగం ఈ ఆదర్శాలను ప్రతిబింబిస్తుంది. వ్యక్తిని గౌరవించే లౌకిక రాజ్యాన్ని ప్రోత్సహిస్తుంది.          భారత రాజ్యాంగం 3 వ భాగంలో సమానత్వపు హక్కు ప్రకటించబడింది. 15 వ అధికరణం కుల, మత, లింగ వివక్షతలకు తావే లేదు అని ప్రకటించింది. అయితే రాజ్యాంగం అమలులోకి వచ్చిన ఇన్ని దశాబ్దాల తరువాత కూడా ఇంకా ఈ దేశంలో బహిష్కృతులున్నారు. నిషిద్ధ మానవులున్నారు. వాళ్ల ఇళ్లు ఇంకా ఊరి బయటే ఉన్నాయి. వారి జీవనం ఇంకా వెలివాడల్లోనే మగ్గిపోతూ ఉంది. సమాజం ఇంకా ఆధునికం కాక పోవడం వల్లే ఇంకా బుద్ధుని బోధనలు గాని రాజ్యాంగం చెప్పిన రాజ్యాంగం లో రాసుకున్న విలువలు గాని ఇంకా ప్రజలు అందుకోల...