Posts

Showing posts from December, 2022

మహాత్మా గాంధీ ఆచరణాత్మక తాత్విక చింతన

Image
  మహాత్మా  గాంధీ ఆచరణాత్మక తాత్విక చింతన తాత్విక సిద్ధాంతాల ఆచరణాత్మక ఉపయోగం ఏమిటని కొంతమంది తత్వవేత్తలను అడుగుతుంటారు.శాంతి, పర్యావరణ శాస్త్రం వంటి  వాటికి వాటితో ఎలాంటి సంబంధం ఉంది? ఆచరణాత్మక జీవితానికి సిద్ధాంతాన్ని ఎలా వర్తింపజేయాలన్న తాత్విక ఆలోచనా విధానం ఉందా? అని చాలామంది ఆలోచిస్తుంటారు.తాత్వకత కేవలం మనసుకు సంబంధించినదా లేదా జీవితాచరణకు సంబంధించినదా అన్న మీమాంస కు సమాధానం "నా జీవితమే నా సందేశం" అన్న గాంధీ జీవితమే. గాంధీ  గుజరాత్ లోని పోరుబందరులో కరంచంద్ గాంధీ ,పుత్లీబాయి గాంధీ దంపతులకు‌‌   అక్టోబరు 2, 1869 న జన్మించారు.జనవరి 30, 1948 న ఆయన మతోన్మాదుల తుపాకీ    గుళ్లకు బలయ్యారు. టాల్ స్టాయ్  రాసిన ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ వితిన్ యు (The Kingdom of God is Within You), జాన్ రస్కిన్ రాసిన అన్టుది లాస్ట్ (Unto the Last) , భగవద్గీత ,బైబిల్  అతన్ని బాగా ప్రభావితం చేశాయి. వీటి ద్వారా ఆత్మజ్ఞానానికున్న ప్రాముఖ్యత, నిష్కామ కర్మ  అర్థమయ్యాయి. అన్ని మతాలూ దాదాపు ఒకే విషయాన్ని బోధిస్తున్నాయని కూడా అతను గ్రహించాడు. వీటి ద్వారా ...

వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ మతరాజకీయ తాత్విక ధోరణులు

Image
వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ మతరాజకీయ తాత్విక ధోరణులు        భారతదేశ తాత్వికతను, చారిత్రకతను తప్పుగా అర్థం చేసుకొని హిందూత్వ సిద్దాంతాన్ని ప్రతిపాదించిన    వినాయక్ దామోదర్ సావర్కర్   నాస్తికవాది. హిందూ జాతీయవాద పితామహుడిగా పేరుగాంచారు. విప్లవకారునిగా జీవితాన్ని ప్రారంభించి తరువాత కాలంలో భీరువుగా మారిన స్వాతంత్ర్య పిపాసి.కానీ ఇతనికి వీర్ అనే బిరుదు ఇచ్చి వీర సావర్కర్ అని పిలుస్తుంటారు.ఆయన సాహిత్య కారునిగా, చరిత్ర కారునిగా, సంఘ సంస్కర్తగా భిన్న కోణాల్లో సామాజిక సేవలు అందించారు.         వినాయక్ దామోదర్ సావర్కర్ 1883 మే 28 న దామోదర్‌పంత్ సావర్కర్, తల్లి రాధాబాయి దంపతులకు నాసిక్ లోని భగపూర్ గ్రామంలో జన్మించాడు.చిన్నతనంలోనే   లాలా లజపత్ రాయ్, బాల్ గంగాధర్ తిలక్, బిపిన్ చంద్ర పాల్ రాజకీయనాయకుల నుండి ప్రేరణ పొందారు.అతను 12 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడే అతను హిందూ-ముస్లిం అల్లర్ల తరువాత తన గ్రామంలోని మసీదుపై దాడికి తోటి విద్యార్థులను నడిపించాడు. "మేము హృదయపూర్వకంగా మసీదును ధ్వంసం చేశాం."అని చెప్పుకున్నాడు. అతను...

బాబాసాహెబ్ అంబేద్కర్‌ ఆధునిక తాత్విక చింతన

Image
బాబాసాహెబ్  అంబేద్కర్‌  ఆధునిక తాత్విక చింతన           భారతదేశంలో ఎవరినైనా గుర్తించాలంటే అతని కులాన్ని మొట్టమొదట చూస్తారు. ఆ తర్వాతే అతని గుణగణాలు లెక్కలోకి వస్తాయి.దానికి భిన్నంగా కులమతాలకు అతీతంగా  భారతీయ భౌతిక వాద తాత్వికతకు, ఆధునిక మానవవాద భావాలకు ప్రతిరూపంగా భారత రాజ్యాంగాన్ని రూపకల్పన చేసిన  అంబేద్కర్‌ మధ్యప్రదేశ్‌లోని మౌ(Mhow)'అనే army regiment  గ్రామంలో కీ.శ. 1891వ సంవత్సరం ఏప్రిల్‌ 14న రాంజీ మలోజీ సక్పాల్‌, భీమాబాయి దంపతులకు జన్మించారు.జై భీమ్ అని, బాబా సాహెబ్ అని ప్రేమగా ఆయన్ను అందరూ పిలుస్తారు. వీరి పూర్వీకులది మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలోని అంబావాడే  గ్రామం.   రాజ్యాంగ నిర్మాతగా, సంఘసంస్కర్తగా, రాజకీయవేత్తగా, భారతీయ భౌతిక వాద తాత్వికునిగా కీర్తిగాంచిన డాక్టర్‌ భీమ్‌రావ్‌ అంబేద్కర్‌ 1956 డిసెంబర్‌ 6 న కన్నుమూశారు.  ఆయనది సాఫల్య జీవితం. ఉత్తేజభరిత జీవితం. విద్యార్థిగా అవమానాల్ని ఎదుర్కొని అంటరాని తనానికి, వివక్షకు వ్యతిరేకంగా జీవితమంతా ధిక్కార స్వరంగా, ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటబావుటాగా నిలిచారు...