పుచ్చలపల్లి సుందరయ్య తాత్విక చింతన
పుచ్చలపల్లి సుందరయ్య తాత్విక చింతన పుచ్చలపల్లి సుందరయ్య (1913–1985) భారత కమ్యూనిస్టు ఉద్యమానికి పునాది వేసిన గొప్ప తాత్విక నాయకులలో ఒకరు. ఆయన మార్క్సిజాన్ని ఒక ఆయుధంగా తీసుకుని, భారతీయ సమాజాన్ని అర్థం చేసుకున్నారు. ప్రత్యేకించి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆయన నాయకత్వం, తాత్విక దృక్పథం భారత కమ్యూనిస్టు చరిత్రలో ఆయనను విలక్షణంగా యోధునిగా నిలిపాయి. సుందరయ్య, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం, అలగానిపాడు గ్రామంలో ఒక భూస్వామ్య కుటుంబంలో 1913, మే 1 న జన్మించాడు. తండ్రి వెంకటరామిరెడ్డి, తల్లి శేషమ్మ. తల్లిదండ్రులు ఇతనికి సుందరరామిరెడ్డి అని పేరు పెట్టారు. పెద్దయ్యాక రెడ్డి అనే కులచిహ్నాన్నిను తొలగించుకున్నాడు.ఇది అతని సామాజిక సమానత్వం పై విశ్వాసాన్ని తెలియజేస్తుంది. మనుషులంతా సమానమేనని తాను నమ్మిన సిద్ధాంతానికి అతను కట్టుబడినాడు. ఇప్పుడు అన్ని కులాల వారు తమ కుల గుర్తింపుకోసం తహ తహలాడుతూ తమ పేర్ల చివర కుల చిహ్నాలను అదేపనిగా పెట్టుకుంటున్నారు. సహచరులంతా అతన్ని ఆప్యాయంగా "కామ్రేడ్ పి.ఎస్." అని పిలిచేవారు. ...