Posts

Showing posts from December, 2021

సామాజిక న్యాయసాధనే రాజ్యాంగంలో దాగిన తాత్వికత

     నేడు మన దేశంలో సుమారుగా 30 శాతం జాతీయసంపద 99 శాతం మంది ప్రజలచేతుల్లో ఉండగా, 70 శాతం జాతీయ సంపద మొత్తం కేవలం ఒక శాతం మంది చేతుల్లో ఉన్నది.   దీనివలన రాజ్యాంగ లక్ష్యానికి భిన్నంగా ఆర్థిక అసమానతలు పెరుగుతాయి. ప్రజలందరికీ ఉపాధి అవకాశాలు కల్పించి, ప్రజలు స్వయం సమృద్ధిని సాధించుకొని జీవన ప్రమాణస్థాయిని మెరుగుపరుచుకొనే పరిస్థితులు కల్పించడంలో రాజ్యాంగ లక్ష్యాన్ని సాధించవలసిన బాధ్యతగల మన ప్రభుత్వాలు విజయవంతం కాలేకపోతున్నాయి. హక్కులు, అవకాశాలు, ప్రభుత్వ పథకాలు లాంటివి ప్రజల అనుభవంలోనికి వచ్చినప్పుడు ప్రభుత్వంతోపాటుగా అందరూ చిత్తశుద్ధితో కృషి చేసినప్పుడే రాజ్యాంగం ఆశించిన సామాజిక న్యాయం ప్రజలకు దక్కుతుంది. ఒ క దేశంలోని ప్రజలు, పాలకులు, పాలనా యంత్రాంగం పాటించే అత్యుత్తమ నియమావళి కలిగిన మూలచట్టాన్నే రాజ్యాంగం అంటారు. భారత రాజ్యాంగ నిర్మాణానికి 1946 సంవత్సరంలో ఏర్పడిన ‘భారత రాజ్యాంగ పరిషత్‌’ ఏడుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ రచనా సంఘాన్ని ఏర్పాటు చేసింది. ప్రపంచ రాజ్యాంగాలను అధ్యయనం చేసి భారత సామాజిక పరిస్థితులను లోతుగా అర్థం చేసుకొన్న భారత రాజ్యాంగ రచనా సంఘం ఛైర్మన్‌ డా.బి.ఆ...