భగత్ సింగ్ తాత్విక దృక్పథం
అతడు దేశభక్తికి నిర్వచనం! విప్లవానికి పర్యాయ పదం!! “అతడు దేశాన్ని ప్రేమించాడు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను ప్రేమించాడు విప్లవాన్ని ప్రేమించాడు ప్రేమను విప్లవీకరించిన విప్లవ ప్రేమికుడై ఉరికంబాన్నే వధువుగా వరించాడు అతడు శిలువనే పెళ్ళాడిన స్పార్టకస్” 85 సంవత్సరాల క్రితం నేడు పాకిస్తాన్ లో వున్న లాహోరులో బ్రిటీషు సామ్రాజ్యవాదులచే రాజద్రోహం నేరం క్రింద షహీద్ సుఖదేవ్, రాజగురులతో పాటు ఉరితీయబడిన వాడు భగత్ సింగ్. ఈనాటి మన పార్లమెంటు భవనం లోపల సమావేశం జరుగుతుండగా (అప్పుడు దానిని సెంట్రల్ అసెంబ్లీ అనేవారు) సందర్శకుల స్థానం నుండి 8-4-1929న బాంబులు విసిరిన వారిలో బటుకేశ్వరదత్ తో పాటు భగత్ సింగ్ కూడా వొకరు. కార్మికుల ఉద్యమ హక్కుల్ని, పౌరుల ప్రజాస్వామ్య హక్కుల్నీ అణచివేసే చట్టాలు చేయడాన్ని నిరసిస్తూ వారిరువురూ ( విఠల్ భాయ్ పటేల్, పండిట్ మోతీలాల్ నెహ్రూ, కేల్కర్, జయకర్, జిన్నా మొ||వారు) చాలామంది ప్రముఖులు చర్చిస్తున్న సందర్భంలో బాంబులు వేశారు. 'దేశభక్తి అంటే చట్టాల మీద భక్తి కాదు' పీడిత వర్గాన్ని అణచివేయటాన్ని వ్యతిరేకించటమే దేశభక్తిగా భగత్ సింగ్ తన ఆచరణద్వారా ఆనాడు రుజువుపర్...