bhagat singh
నేనెందుకు_నాస్తికుణ్ణయ్యాను (Why_I_am_an_Atheist ?) __ భగత్ సింగ్. __సర్వశక్తి సంపన్నుడూ, సర్వాంతర్యామీ, సర్వజ్ఞుడూ అయిన దేవుడి ఉనికిని నేను నమ్మకపోవడం అహంకారంవల్లనా? ఇది నాలో ఉదయించిన కొత్త ప్రశ్న.ఇలాంటి ప్రశ్నను ఎదుర్కొనవలసి వస్తుందని నేనెప్పుడూ ఊహించలేదు.అయితే దైవం కన్నా నేనే గొప్ప అనే ఆధిక్యభావన నాలో ఉన్నందువల్లనే దేవుని ఉనికిని నిరాకరిస్తున్నానని , దేవుణ్ణి నమ్మకపోవడానికి కొంతవరకు నా అహంకారము కూడా కారణమని నా మితృలుకొందరు నాతోవున్న కొద్దిపాటి పరిచయాన్ని పురస్కరించుకొని మాటల సందర్భంగా నాతో సూచనగా అన్నారు.వీళ్ళు నామిత్రులని అనుకోవడం ఎంతవరకు సరైందో తెలియదు.ఈ సమస్య మాత్రం తీవ్రమైనదే.మానవ సహజమైన ఈ లక్షణాలకు నేను అతీతుణ్ణని గొప్పలు చెప్పుకోవడం లేదు.నేనూ మామూలు మనిషినే. అంతకుమించి మరేమీ కాదు. నేనేకాదు , ఎవరైనా అలా అనుకోలేదు.నా స్వభావంలో అహంకారం ఒక భాగం. ఈ బలహీనత నాలోనూ ఉంది.నా మిత్రులు నన్ను నియంత అని పిలిచేవాళ్ళు. నా ముఖ్య స్నేహితుడు బి.కె.దత్ కూడా అలాగే పిలిచేవాడు. కొన్ని సందర్ధాలలో నిరంకుశుడని నన్ను నిందించడంకూ...