మనుధర్మ శాస్త్రం లో హేయమైన అధర్మాలు.
1. శూద్రులు పాలకులుగా ఉన్న రాజ్యంలో బ్రాహ్మణులు నివసింపరాదు. ( మనుధర్మశాస్త్రం 4:61) 2. ఏ విధంగాను మత పరమైనా,లేక యాగ పరమైనా కూడా బ్రాహ్మణులు శూద్రుల నుండి యాచించ రాదు. ( మనుధర్మశాస్త్రం 11:24) 3. ఉన్నత వర్ణాల స్త్రీలతో లైంగిక సంబంధం గల శూద్రులను ఇలా శిక్షించాలి.ఆ స్త్రీ ఎవ్వరి రక్షణలో లేనట్లయితే ,అతడు నేరం చేసిన అవయవాన్ని ఖండించాలి. ఆ స్త్రీ ఎవరి సంరక్షణలో నైనా ఉన్నట్లయితే అతడికి మరణశిక్ష విధించాలి. ( మనుధర్మశాస్త్రం 8: 374) 4. బ్రాహ్మణుడు కేవలం బ్రాహ్మణ కులంలో పుట్టిన కారణంగానే ధర్మ నిర్ణయం చేయగలడు.కానీ శూద్రులు ఎంత పాండిత్యం సంపాదించుకున్నా ఆ స్థానం చేరుకోలేడు. ( మనుధర్మశాస్త్రం 8:20) 5. ఏ రాజు రాజ్యంలో శూద్రులు ధర్మ నిర్ణయం చేస్తారో ఆ రాజ్యం ఊబిలో పడిన ఆవు వలే కుంగిపోతోంది. ( మనుధర్మశాస్త్రం 8:21) 6. ఏ శూద్రుడైనా గర్వంతో ధర్మాన్ని ప్రవచిస్తే అతని నోటిలో,చెవులలో మసలుతున్న నూనె పోయించబడుతుంది. ( మనుధర్మశాస్త్రం 8: 272) 7. శూద్రులకు విద్య గరిపిన బ్...