మనుధర్మ శాస్త్రం లో హేయమైన అధర్మాలు.
1. శూద్రులు పాలకులుగా ఉన్న రాజ్యంలో బ్రాహ్మణులు నివసింపరాదు.
( మనుధర్మశాస్త్రం 4:61)
2. ఏ విధంగాను మత పరమైనా,లేక యాగ పరమైనా కూడా బ్రాహ్మణులు శూద్రుల నుండి యాచించ రాదు.
( మనుధర్మశాస్త్రం 11:24)
3. ఉన్నత వర్ణాల స్త్రీలతో లైంగిక సంబంధం గల శూద్రులను ఇలా శిక్షించాలి.ఆ స్త్రీ ఎవ్వరి రక్షణలో లేనట్లయితే ,అతడు నేరం చేసిన అవయవాన్ని ఖండించాలి. ఆ స్త్రీ ఎవరి సంరక్షణలో నైనా ఉన్నట్లయితే అతడికి మరణశిక్ష విధించాలి.
( మనుధర్మశాస్త్రం 8: 374)
4. బ్రాహ్మణుడు కేవలం బ్రాహ్మణ కులంలో పుట్టిన కారణంగానే ధర్మ నిర్ణయం చేయగలడు.కానీ శూద్రులు ఎంత పాండిత్యం సంపాదించుకున్నా ఆ స్థానం చేరుకోలేడు.
( మనుధర్మశాస్త్రం 8:20)
5. ఏ రాజు రాజ్యంలో శూద్రులు ధర్మ నిర్ణయం చేస్తారో ఆ రాజ్యం ఊబిలో పడిన ఆవు వలే కుంగిపోతోంది.
( మనుధర్మశాస్త్రం 8:21)
6. ఏ శూద్రుడైనా గర్వంతో ధర్మాన్ని ప్రవచిస్తే అతని నోటిలో,చెవులలో మసలుతున్న నూనె పోయించబడుతుంది.
( మనుధర్మశాస్త్రం 8: 272)
7. శూద్రులకు విద్య గరిపిన బ్రాహ్మణులు , శూద్రుల వద్ద విద్యాభ్యాసం చేసిన బ్రాహ్మణులు శ్రాద్ధ కర్మల నిర్వహణకు అనర్హుడు.
( మనుధర్మశాస్త్రం 3:156)
8. శూద్రుని సమక్షంలో వేదాలను పఠించరాదు.
( మనుధర్మశాస్త్రం 4:99)
9. శూద్రుడు ఆస్తులు సంపాదించే శక్తి ఉన్నప్పటికీ, అతడు తన అవసరాలకు మించిన సొత్తును కలిగి ఉండరాదు. అలా సంపాదించి ధనాన్ని కూడబెట్టడం జరిగితే అతడు అహంకార పూరితుడై బ్రాహ్మణులను లక్ష్యపెట్టక పోవచ్చును.
( మనుధర్మశాస్త్రం 10:129)
10. బ్రాహ్మణుడు తన జీవనానికి ఎలాంటి లోపం ఏర్పడినా సందేహించకుండా శూద్రుని వస్తు,సంపదలను స్వాధీనం చేసుకోవచ్చు.
( మనుధర్మశాస్త్రం 8:417)
11. భగవంతుడు ఆదేశించినట్టుగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య జాతులను సేవించడమే శూద్రుల వృత్తి
( మనుధర్మశాస్త్రం 1:9)
12. బ్రాహ్మణులకు సేవకులుగా ఉండడమే శూద్రులకు తగిన వృత్తి. మరే పని కూడా దీనికి సాటిరాదు.
( మనుధర్మశాస్త్రం 10:123)
13. బ్రాహ్మణుడు జీతం భత్యాలతో నిమిత్తం లేకుండా శూద్రులతో సేవలు చేయించుకోవాలి. ఎందుకంటే బ్రాహ్మణులకు బానిసలుగా ఉండడానికే భగవంతుడు శూద్రులను సృష్టించాడు.
( మనుధర్మశాస్త్రం 8:413)
14. ఎవరైనా శూద్రుడు ద్విజుణ్ణి దూషించినట్లయితే ఆ శూద్రుని నాలుక కత్తిరించబడుతుంది.ఎందుకంటే శూద్రులు అతి తక్కువ జాతి వారు కనుక
( మనుధర్మశాస్త్రం 8:270)
15. ద్విజులయెక్క పేర్లు,కులాలను తిరస్కరిస్తూ ప్రస్తావించిన శూద్రుల నోటిలో పది వేళ్ల పొడవు గల ఇనుప మేకును ఎర్రగా కాల్చి దూర్చాలి.
( మనుధర్మశాస్త్రం 8:271)
16. బ్రాహ్మణుని పేరు సంతోషాన్ని గుర్తుకు తెచ్చేదిగా,క్షత్రియుల పేర్లు రక్షణకు మారు పేరుగా,వైశ్యుల పేర్లు వృద్ధిని చూపేదిగా ఉండాలి. శూద్రుల పేరు సేవక వృత్తిని చూపునట్లు ఉండాలి.
( మనుధర్మశాస్త్రం 2:32)
17. బ్రాహ్మణుల ఇంటిపేరు శుభప్రదమైనదిగా, క్షత్రియుల ఇంటిపేరు శక్తిని చూపేదిగా,వైశ్యుల ఇంటిపేరు ధన సంపత్తిని సూచించేదిగా ఉండాలి.శూద్రుల ఇంటిపేరు హేయమైనదిగా ఉండాలి.
( మనుధర్మశాస్త్రం 2:31)
👉🏿17. స్త్రీలకి, శుాద్రులకి విద్య నిషేదము.
మనుస్మృతి(18—679).
👉🏿18. స్త్రీలకి, శూద్రులకి చదువు చెప్పేవారు నరకానికి పోతారు. మనుస్మృతి(3—156)
👉🏿19. స్త్రీలంతా పాపగర్బం నుండి పుట్టారు. భగవద్గీత (9—32) మరి పురుషులు ??
👉🏿20. స్త్రీలంతా అపవిత్రులు, అవినీతిపరులు, అబద్దాలకోర్లు, దురాశపరులు. మనుస్మృతి(2—1
👉🏿 21.బ్రాహ్మణుడు తన ఉన్నతమైన జన్మకారణంగా ఈ విశ్వంలోని స్త్రీలందరికి భర్త అవుతాడు.(శృతి)
👉🏿22. స్త్రీ దుఃఖానికి మూలం. పుట్టేటపుడు తల్లిని, రజస్వలపుడు తల్లిదండ్రులను, వివాహ సమయంలో తల్లిదండ్రులను, బందుమిత్రులను ఏడిపిస్తుంది. వయస్సులో ఎన్నోతప్పులు చేసి వంశానికి, వర్ణానికి చెడ్డపేరు తెస్తుంది. ఇందరి దుఃఖానికి మూలం కాబట్టి స్త్రీని 'దారిక ' అన్నారు. (ఐతరేయ బ్రాహ్మణం)
👉🏿23. తన భర్త గుడ్డివాడైనా, మూగవాడైనా, చెవిటివాడైనా, ముసలివాడైనా, వికలాంగుడైనా, వ్యబిచారి ఐనా, జూదరి ఐన, తనను బాదపెడుతూ ఇతర స్త్రీలతో తిరుగుతున్నా, స్త్రీ అతనికి విశ్వాసపాత్రురాలై అణిగి మనిగి వుండాలి. తన భర్త తిన్న తర్వాతనే తినాలి. అతను కొడితే ప్రతిఘటించరాదు. అతను మరణిస్తే తన భర్త చితి పై పడి ఆత్మ త్యాగం చెయ్యాలి. అతనితో పరలోకమునకు పోయి అక్కడ కూడా ఈవిధంగా సేవచేసే మహద్బాగ్యం సంపాదించుకోవాలి.( పద్మపురాణం)
ఇలాంటివి కేవలం మచ్చుకు మాత్రమే...
ఇలా 3 వేల సంవత్సరాలుగా మనిషిని మనిషిగా చూడని సమాజంలో, స్త్రీలకు కనీస మానవ హక్కులు నిరాకరించిన వ్యవస్త ఇది.
(బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గారి రచనలు వాల్యూమ్ 5. పేజీ నంబరు 145 నుండి 149)
Comments
Post a Comment