తాత్విక చింతన అంటే ఏమిటి?


తాత్విక చింతన అంటే ఏమిటి?


ఏది జీవితమేది మృత్యువు
ఏది పుణ్యం, ఏది పాపం
ఏది నరకం, ఏది నాకం 
ఓ మహాత్మా , ఓ మహర్షి

ఏది సత్యం, ఏదసత్యం
ఏదనిత్యం, ఏది నిత్యం
ఏది ఏకం, ఏదనేకం
ఏది కారణమేది కార్యం
ఓ మహాత్మా , ఓ మహర్షి అని శ్రీశ్రీ జీవితం గురించి ఈ ప్రపంచం గురించి ఎన్నో ప్రశ్నలు వేస్తాడు. ఇలాంటి ప్రశ్నలకు సమాధానంగా  ప్రజలు తమ గురించి, తాము నివసించే ప్రపంచం గురించి,   ఒకరికొకరుతో వారికి గల సంబంధాల గురించి ప్రాథమిక సత్యాలను అర్థం చేసుకోవడానికి  చేసే కార్యాచరణే  తాత్విక చింతన అంటారు.తాత్విక చింతన గురించి చర్చించేదే తత్వశాస్త్రం.
       తత్వశాస్త్రం అనేది నీతి, ఆలోచన, ఉనికి, సమయం, సంపద , విలువలు వంటి కొన్ని విషయాల గురించి ఆలోచించే మార్గం. ఆ 'ఆలోచనా విధానం'లో 4 రూపాలు ఉంటాయి:  రెస్పాన్సివ్‌నెస్ ఎఫెక్షన్,  రీజన్, మూల్యాంకనం.  అవగాహనను మరింతగా పెంచుకోవడమే తత్వశాస్త్రం లక్ష్యం. ఆలోచన చేయడం ద్వారా మనం మంచిగా ఆలోచించగలం. మరింత తెలివిగా వ్యవహరించడం నేర్చుకుంటాం. తద్వారా సామాజిక జీవితాల నాణ్యతను మెరుగుపరచడంలో అవి సహాయపడతాయి.

       తత్వచింతనా పరులు దేవుడు ఉన్నాడా?,నిజం అంటే ఏమిటి?,ఒక వ్యక్తి అంటే ఏమిటి? కాలక్రమేణా ఒక వ్యక్తిని ఒకేలా చేస్తుంది? ప్రపంచం ఖచ్చితంగా పదార్థంతో కూడి ఉందా? ప్రజలకు బుద్ధి ఉందా? అలా అయితే, మనస్సు శరీరానికి ఎలా సంబంధం కలిగి ఉంటుంది?ప్రజలకు స్వేచ్ఛా సంకల్పాలు ఉన్నాయా?ఒక సంఘటన మరొక సంఘటనకు కారణం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు వేసుకుని వాటికీ తగిన సమాధానాల కోసం అన్వేషిస్తారు.
        మరికొందరు జ్ఞానం అంటే ఏమిటి?మనకు ఏమైనా తెలుసా?మనకు తెలిసిన వాటిని ఎలా తెలుసుకోవాలి?కొన్ని విషయాలు తెలుసునని చెప్పుకోవడాన్ని మనం సమర్థించగలమా? లాంటి ప్రశ్నలు వేసుకుని వాటికి తగిన సమాధానాల కోసం ప్రయత్నం చేస్తారు. నైతికచింతనా పరులు ఏది మంచి? చర్యలు లేదా వ్యక్తులను ఏది మంచి చేస్తుంది? ఏది సరైనది? చర్యలను ఏది సరైనదిగా చేస్తుంది?నైతికత లక్ష్యం లేదా ఆత్మాశ్రయమా? నేను ఇతరులతో ఎలా ప్రవర్తించాలి? లాంటి ప్రశ్నలు వేస్తారు.

       తత్వశాస్త్ర అధ్యయనం అటువంటి ప్రశ్నలకు ఒకరి స్వంత సమాధానాలను రూపొందించడం మాత్రమే కాకుండా, గతంలో ఇటువంటి ప్రశ్నలకు ప్రజలు ఏ విధంగా సమాధానమిచ్చారో అర్థం చేసుకోవడం కూడా ఉంటుంది. ప్లేటో, లాక్ ,మార్క్స్, అరిస్టాటిల్, హ్యూమ్మిల్లు,అక్వినాస్కాంట్, విట్జెన్‌స్టెయిన్, డెకార్తే, నీషే, సార్త్రే మొదలై న వారందరు ఇతర దేశాల్లో నుంచి తాత్విక వేత్తలు. మన దేశంలో బుద్ద, కణద, శంకర, వేమన, వివేకానంద, రాజా రామ్మోహన్ రాయ్, గాంధీ, అరవింద, నెహ్రూ, పెరియార,  యం.యన్.రాయ్,  అంబేద్కర్, సుందరయ్య మొదలైన భారతీయ తాత్విక చింతనా పరులు ఎందరో ఉన్నారు.
       తత్వశాస్త్రం ఎవరికి ఎక్కువగా ఉపయోగపడుతుంది? ఇది ఎక్కువగా కవులకు రచయితలకు, శాస్త్రవేత్తలకు ఉపయోగపడే చింతన. సామాజిక చింతన,ఆచరణాత్మక చింతన లేకుండా రచనలు చేయడం సాధ్యం కాదు.  శాస్త్రవేత్తలు కనుగొనే కొత్త  విషయాలకు కూడా సామాజిక చింతన అవసరం. తాత్విక చింతన సమాజం పట్ల జీవితం పట్ల ఒక లోతైన విస్తృతిని ఆలోచనను అందిస్తుంది.  జీవితంలోని నైతికతకు,  వాస్తవికతకు ఉన్న సరైన అర్థాన్ని ఇది తెలియజేస్తుంది. కవులు తాము వ్యక్తీకరించే భావనల్లో ఈ తాత్విక దృక్పథం బహుముఖంగా వ్యక్తం అవుతుంది. సినారె రాసిన తూరుపు తెలవారుతుంది కవితలో సామాజిక తాత్విక దృక్పథం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఆ కవితా చరణాలు చదివి చూడండి.

తూరుపు తెలవారుతుంది ప్రతి దినం 
కాలం గతి మారుతుంది ప్రతీ క్షణం
మంచి మార్పు లోకానికి మంగళ దాయకం 
అది వికటించిందా...! 
లోకానికి అభ్యుదయవినాశకం 
ప్రసరించే గాలికి లేదు కులం
ప్రవహించే నీటికి లేదు మతం 
కులం పేర మతం పేర జరిగే కలహాలు 
మనిషిని పశువుగ మార్చే విష వలయాలు 
తూరుపు తెలవారుతుంది ప్రతి దినం
కాలం గతి మారుతుంది ప్రతీ క్షణం


        

Comments

Popular posts from this blog

మహాత్మా గాంధీ ఆచరణాత్మక తాత్విక చింతన

బాబాసాహెబ్ అంబేద్కర్‌ ఆధునిక తాత్విక చింతన

బౌద్ధం పునాదులపై లేచిన వైదిక ధర్మం