మన రాజ్యాంగం


   మన రాజ్యాంగపు లౌకిక సామ్యవాద పునాదుల్ని రక్షించుకోవాలి.

       బ్రిటిష్ వారు రాకపూర్వం మనదేశంలో మనుస్మృతి భావజాలం వివిధ సామాజిక కట్టుబాట్ల రూపంలో కొనసాగుతూ ఉండింది. వాస్తవానికి ఇప్పటికీ ఇది దేశ ప్రజల సామాజిక, సాంస్కృతిక రంగాలను అజమాయిషీ చేస్తున్నది. 
          బ్రిటిష్ వారు ప్రారంభంలో చట్టాలు చేయడానికి భారతదేశంలో ఉన్న చట్టాలు ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు కొంతమంది మేధావులను పిలిచి భారతదేశంలో ఉన్న చట్టాలను గురించి అడిగారు వారు మనుస్మృతిని తెచ్చి వారు చూపించారు. మనుస్మృతిలో ఉన్న చట్టాలను చూసిన తర్వాత అవి చట్టాలుగావని సమాజాన్ని తమ చెప్పు చేతుల్లో ఉంచుకోవడానికి కొన్ని వర్గాలు చేసిన ప్రయత్నమని అర్థం చేసుకున్న బ్రిటిష్ వారు దాన్ని పక్కన పెట్టేసారు. వారు భారతదేశానికి అనుగుణంగా భారత దేశంలో ఉన్న చట్టాలను కొంచెం మార్చి ఇక్కడ చట్టాలను ఏర్పాటు చేశారు.ఇండో – బ్రిటిష్‌ రాజ్యాంగం సుమారు 250ఏళ్ల క్రిందటే వచ్చింది. 
      బ్రిటిష్ సామ్రాజ్యవాదంతో పోరాడి మనం స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత స్వతంత్రంగా పరిపాలించుకోవడానికి ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించింది అప్పటి నెహ్రూ ప్రభుత్వం. దాంతో26.11.1949 న కొత్త రాజ్యాంగం ఏర్పడింది. ఈ దినాన్ని రాజ్యాంగ దినోత్సవం గా జరుపుకుంటున్నాం. ఈ రాజ్యాంగం రచన చాలా మందితో జరిగినా దానిలో ప్రధాన పాత్ర వహించింది మాత్రం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్.
      26.1.1950 రాజ్యాంగం అమలులోకి వచ్చింది.దాన్నే రిపబ్లిక్ దినోత్సవం గా మనం జరుపుకుంటున్నాం. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు పూర్తయ్యాయి. నూతన రాజ్యాంగం అమలులోకి వచ్చి 74 ఏళ్లు కావస్తోంది. బిజెపి ప్రభుత్వం ఆజాది కా అమృత్ మహోత్సవ్ ను కూడా నిర్వహించింది.

        భారత రాజ్యాంగం మన ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టుగా ఉంది. కానీ రాజ్యాంగం కల్పించిన అన్ని స్వేచ్ఛలను గంగలో కలిపేందుకు ప్రస్తుత పాలకులు ఎన్నో రకంగా కుటిలయత్నాలు చేస్తున్నారు.

        బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన ఆవశ్యకత గురించి భారతదేశంలో పెద్ద చర్చ జరుగుతోంది. కారణమేమంటే బిజెపి ప్రభుత్వం పార్లమెంట్ నూతన పార్లమెంటును ప్రారంభిస్తున్న సందర్భంలో అందరికీ అందజేసిన రాజ్యాంగ పుస్తకంలో రాజ్యాంగ పీఠిక లో ‘లౌకిక, సామ్యవాద’ అనే పదాలను తొలగించి ఇచ్చింది. ఈ అంశమై పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. అంతకుముందు 2021, డిసెంబర్‌ 3న ‘రాజ్యాంగ సవరణ-2021’ పేరిట రాజ్యాంగ పీఠికకు ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టారు. దీనిపైనా తీవ్ర నిరసనలు రావడంతో పక్కనపెట్టింది. అంబేద్కర్ రాసిన మొదటి రాజ్యాంగంలో లౌకిక సామ్యవాద పదాలు వీటిలో లేవని ఆ తర్వాత 42వ సవరణ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని చేర్చింది కాబట్టి దానిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని బిజెపి చెప్తోంది.

        ఎస్‌ఆర్‌ బొమ్మై వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కర్ణాటక వ్యాజ్యంలో తీర్పు చెప్తూ లౌకిక అనే పదం పీఠికలో ప్రత్యేకంగా చేర్చినప్పటికీ లౌకికతత్వం ,సోషలిజం భారత రాజ్యాంగంలో మౌలికంగా అంతర్భాగంగా ఇమిడి ఉన్నాయని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పేర్కొనింది. దీన్నిబట్టి రాజ్యాంగ పీఠికలో ఉన్న పదాలను తొలగించడమంటే, రాజ్యాంగంపై దాడిగానే భావించాలి.

       గోలక్‌నాథ్‌ వర్సెస్‌ పంజాబ్‌ ప్రభుత్వానికి జరిగిన వ్యాజ్యంలో ‘రాజ్యాంగ మౌలిక స్వరూపం మార్చడం’ అనే అంశంపై సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. అప్పటి ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావు రాజ్యాంగ సవరణకు పార్లమెంటుకు ఉన్న అధికారాల గురించి చెప్పిన అధికరణ-368 గురించి ఒక కీలక వ్యాఖ్య చేశారు. ‘రాజ్యాంగాన్ని సవరించే అధికారాన్ని అధికరణ-368 పార్లమెంట్‌కు ఇవ్వలేదు. ఈ రకమైన అధికారాలు 245, 246, 248 అధికరణల నుంచి వచ్చాయని, ఆ అధికరణల ప్రకారం పార్లమెంటుకు చట్టాలు చేసే అధికారానికే పరిమితమని తెలిపారు. అధికరణం 13 (2)లో చెప్పిన ప్రకారం వాటిని చట్టాలుగానే భావించాలన్నారు. ఈ అధికరణం ప్రకారం ప్రభుత్వం చేసే చట్టాలు రాజ్యాంగానికి అనుకూలంగా ఉండాలి. ఆ చట్టాలు రాజ్యాంగంతో పొందిక లేకుంటే అవి రద్దవుతాయి. ఈ తీర్పులో అత్యధిక న్యాయమూర్తులు రాజ్యాంగ సవరణకు పార్లమెంట్‌కు పరిమిత అధికారాలే ఉన్నాయని పేర్కొన్నారు. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే హక్కు అధికారం పార్లమెంటుకు లేవని తేల్చి చెప్పింది.
        కేరళకు చెందిన మఠాధిపతి కేశవానంద భారతి అప్పీలుపై జరిగిన విచారణలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ‘రాజ్యాంగ మౌలిక స్వరూపం’ అనే పదం సర్వోన్నత న్యాయస్థానంలో అత్యధిక న్యాయమూర్తులు తొలిసారిగా పేర్కొన్నారు. 13 మంది సర్వోన్నత న్యాయమూర్తుల్లో 9 మంది రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం పార్లమెంట్‌కు లేదన్నారు. ఈ ‘మౌలిక స్వరూపం’ అనే పదం రాజ్యాంగంలో ఎక్కడా లేకపోయినా, అంతర్లీనంగా ఉందనే అంశాన్ని మొదట 1973లో జరిగిన ఈ కేసులో సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అప్పటినుంచీ రాజ్యాంగానికి భాష్యం చెప్పడానికి, పార్లమెంటు చేసిన రాజ్యాంగ సవరణలను సమీక్షించే మధ్యవర్తిగానూ సర్వోన్నత న్యాయస్థానం కొనసాగుతున్నది.

         బ్రిటిష్ కాలం నాటి భారత ప్రభుత్వ చట్టం 1935 రద్దయి భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఏర్పాటు చేయబడిన రోజు 1950 జనవరి 26. దేశం యావత్తు గణతంత్ర దినోత్సవాన్ని జరుపు కుంటున్నాం. భారతదేశాన్ని రాష్ర్టాల సమాఖ్య గా రాజ్యాంగం నిర్వచించింది. రాజ్యాంగంలో కేంద్ర రాష్ర్టాలకు సంబంధించి పాలనాధికారాలు, విధులను రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌లో స్పష్టంగా 3 భాగాలుగా పేర్కొన్నారు. కానీ నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశాలన్నింటా జోక్యం చేసుకొని రాష్ర్టాల నడ్డి విరుస్తోంది. 

       జీఎస్టీ రూపంలో రాష్ర్టాల ప్రధాన ఆదాయ వనరును సొంతం చేసుకొని, ఇవ్వాల్సిన నిధులు తొక్కిపెట్టి, వాటిని తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోంది. జాతీయ అర్హత పరీక్ష (నీట్‌), ప్రణాళికా సంఘం రద్దు జాతీయ అభివృద్ధి మండలి రద్దు, వంటి అనేక రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధమైన చర్యలకు పాల్పడుతూ, రాష్ర్టాల అధికారాల్లోకి చొరబడి, తానే పెత్తనం చెలాయిస్తోంది. 
       కరోనా వల్ల ప్రజానీకం ఓ పక్క అల్లాడుతున్నా, అవేమి పట్టించుకోకుండా అనేక రాజ్యాంగ వ్యతిరేక చట్టాలు చేసింది కేంద్ర ప్రభుత్వం. వ్యవసాయ బిల్లు ,విద్యా సంస్కరణలు, కార్మిక, విద్యుత్‌ సంస్కరణల బిల్లు వంటివి ఇందుకు ఉదాహరణ. పాఠ్య పుస్తకాల నిండా మత అంశాలు చొప్పించి, లౌకికవాదానికి గండి కొడుతున్నారు కేంద్ర పాలకులు. ముఖ్యంగా, జీఎస్టీతో పాటు, 3 వ్యవసాయ నల్ల చట్టాలు చేయడం,రాష్ర్టాల హక్కులు హరించడంలో ప్రధానమైంది. మూడు వ్యవసాయ నల్ల చట్టాలను రైతాంగం అలుపెరగకుండా చేసిన పోరాట పలుకంగా వాటిని రద్దు చేసింది.ఇక రాజ్యాంగంలో పొందుపరిచిన లౌకిక తత్వానికి వ్యతిరేకంగా, పౌరసత్వ సవరణ చట్టం ద్వారా దేశాన్ని మతరాజ్యంగా మార్చే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. దీంతో సామాజిక న్యాయం, మత సామరస్యం ప్రమాదకరంగా మారి బలహీన వర్గాలు తమ హక్కులు క్రమంగా కోల్పోయే పరిస్థితి వస్తోంది. 
       భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉండటం భారతదేశానికున్న ప్రత్యేక లక్షణం.కానీ ‘ఒకే జాతి, ఒకే భాష, ఒకే మతం’ అంటూ భారతీయ భిన్నత్వాన్ని భారతీయ భారతీయులకున్న సహజ సంస్కృతిని దెబ్బతీస్తోంది బిజేపీ ప్రభుత్వం. హిందీని బలవంతంగా రుద్దడానికి నిరంతరం ప్రయత్నిస్తోంది, ప్రజల ఆహారాన్ని కూడా నియంత్రించే చర్యలకు పూనుకుంది. సంపద సృష్టించే ఉత్పత్తి కులాలలో హిందూ మతానుయాయులు కానివారిని, మన ఉప్పు తింటూ మనకు వ్యతిరేకంగా ఉన్నారని విద్వేషాలు రెచ్చగొడుతున్నది. ఇవన్నీ మతసహనాన్ని ప్రదర్శిస్తున్న ప్రజానీకంలో విష బీజాలు నాటుతోంది. భిన్న సంస్కృతులు, భాషలు, ఆరాధనా పద్ధతులున్న భారత ఉపఖండంలో నిజమైన ఐక్యతాభావం పెంపొందాలంటే, రాజ్యాంగ స్ఫూర్తితో రాష్ర్టాల హక్కులు, ప్రత్యేకతలను గౌరవించే ప్రజాస్వామిక పాలన రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
రాష్ట్రాలకు ఆర్థిక సహాయం చేసే ప్రణాళికా సంఘాన్ని రద్దు చేశారు. ఇలా ఎన్నో రాజ్యాంగానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇది దీర్ఘకాలం కొనసాగితే భారతదేశం లో కూడా ఒక్కొక్క జాతి ఒక్కొక్క దేశంగా కావాలనే డిమాండ్ ముందుకు వచ్చే అత్యంత ప్రమాదకరమైన భావన ప్రజలలో ఏర్పడుతుంది. మన జాతి సమైక్యతకు ప్రమాదం ఏర్పడుతుంది.

       ప్రశ్నించే వారిని నోరు మూయించడానికి రాజ్యాంగ వ్యవస్థలోని సంస్థలను పావులుగా ఉపయోగించుకుంటూ అప్రజాస్వామిక పద్ధతులకు పాల్పడుతోంది. ఈ రాజ్యాంగ రక్షణ కోసం వామపక్ష ప్రజాతంత్ర లౌకిక సామాజిక శక్తులన్నీ ఐక్యంగా పోరాడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యాంగ పరిణామ క్రమాన్ని పరిశీలించాల్సి ఉంది. 
         భారతీయ సమాజం స్థూలంగా మూడు రాజ్యాంగాలను చవి చూసింది. మొదటిది బ్రిటిష్‌ పాలన స్థిరపడక ముందున్న మనువాద రాజ్యాంగం( మనుస్మృతి). రెండవది బ్రిటిష్‌ పాలనలో అమలైన బ్రిటిష్ రాజ్యాంగం . మూడవది ప్రస్తుతం అమలులో ఉన్న భారత రాజ్యాంగం.

      కొన్ని సందర్భాలలో కొత్త మార్పులు చోటు చేసుకునే క్రమంలో రాజ్యాంగం లో చిన్న సవరణలు చేసుకుంటున్నాయి. ఇప్పుడు పూర్తిగా రాజ్యాంగం ఉనికి లేకుండా చేసి మనువాద బ్రాహ్మణీయ రాజ్యాంగాన్ని పునఃప్రతిష్టించాలని బీజేపీ ప్రభుత్వాన్ని ఆసరా చేసుకొని సంఘ్ పరివార్ ‌ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది.

      మనువాదం ఇప్పుడు ఎక్కడ ఉందని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. మనువాదం మన మెదడులలో ఇంకిపోయి ఉండడం వలన అది ప్రత్యేకంగా కనిపించదు. మనుధర్మ రాజ్యాంగంలో 26 స్మృతులు( చాప్టర్స్‌), 2500 పైగా శ్లోకాలూ (ఆర్టికల్స్‌) ఉన్నాయి. ప్రజలను కులాలుగా విభజించి, శ్రామికుల శ్రమను దోచుకునేందుకు కట్టుబాట్లు విధించటమే మనుధర్మం లక్ష్యం. 
        మనుస్మృతిలోని 2వ అధ్యాయం (స్మృతి) 16వ శ్లోకం (ఆర్టికల్‌)ననుసరించి శూద్రులెవరూ చదువరాదు. నిరక్షరాస్యులుగానే ఉండాలి. చదివితే విజ్ఞానవంతులవుతారు. విజ్ఞానవంతులయితే ప్రశ్నిస్తారు. అప్పుడు పెత్తందారీ శక్తులు ఇబ్బందులపాలవుతాయి. కాబట్టి చట్ట ప్రకారమే నిషేధించారు. 8వ అధ్యాయం, 417వ ఆర్టికల్‌ ప్రకారం శూద్రులు ఆస్తికలిగి ఉండకూడదు. రహస్యంగా ఆస్తి కూడబెట్టినా స్వాధీన పర్చుకోవచ్చు. దీని ఉద్దేశ్యం స్పష్టం. శూద్రుల వద్ద సంపద ఉంటే ఆధిపత్య శక్తులను ఎదిరిస్తారు. అందుకోసం చట్టపరంగానే శూద్రులకు సంపద నిషేధించారు. ఈ విధంగా సమాజంలోని 90శాతం ప్రజా సమూహాలకు చదువూ సంపదా నిషేధించిన సమాజాలేవీ ప్రపంచంలో లేవు. ప్రస్తుత సమాజంలో రాజకీయాల్లోనూ, ఉద్యోగాల్లోనూ దీని ప్రభావం చూస్తున్నాం. మనువాద రాజ్యాంగంలోని 8వ అధ్యాయం 413వ ఆర్టికల్‌ ప్రకారం శూద్రులు పై మూడు వర్ణాలకు సేవ చేయాలి. నిరాకరిస్తే చట్టరీత్యా నేరం. శిక్షార్హులు. ఇంకా చెప్పాలంటే అగ్రవర్ణాల వారు తిట్టినా కొట్టినా చంపినా శూద్రులు భరించాలి. శూద్రులు అగ్రవర్ణాల వారిని అగౌరవపరిచినా తీవ్రంగా శిక్షించాలని 8వ అధ్యాయం, 270వ ఆర్టికల్‌ చెబుతోంది.

కులం సమాజాన్ని ఐక్యం కాకుండా చేస్తుంది. సమాజాన్ని ముక్కలు ముక్కలు చేయడమే కాక నిచ్చెన మెట్ల వ్యవస్థ ఏర్పాటు చేసి ఒక కులం ఇంకొక కులాన్ని అసహ్యించుకునేలాగా చేస్తుంది. వివిధ కులాల మధ్య వివాహాలు జరగకుండా కులాంతర వివాహాలను చట్టరీత్యా నిషేధించారు. వాటిని అత్యంత ప్రమాదకర నేరంగా పరిగణించారు. వాటిని అతిక్రమించిన వారికి శిక్షలు ఖాయం చేశారు. ఉత్తర భారతంలోని ‘ఖాప్‌’ పంచాయితీ దాని వారసత్వమే. ఆ నియమాన్ని ఉల్లంఘించి కులాంతర వివాహాలు చేసుకుంటే మరణ శిక్ష విధించాలనేది మనువాద రాజ్యాంగం 1వ అధ్యాయం 64వ ఆర్టికల్‌ చెబుతుంది. పై రాజ్యాంగ విధులను కాపాడే బాధ్యత క్షత్రియులది అంటే పాలకులది అన్న మాట. అది కూడా స్పష్టంగా 1వ అధ్యాయం 31వ ఆర్టికల్‌లో ఉంది.
ఈ మనువాద భావజాలమే కట్టుబాట్ల పేరుతో భారతీయ సమాజాన్ని శాసించింది. బ్రిటిష్‌ పాలకులు తమ పరిపాలన సౌలభ్యం కోసం, వ్యాపార విస్తరణ కోసం, మనువాద రాజ్యాంగంలో మార్పులు చేయడం, కొన్ని అమానుష మనువాద చట్టాలను మార్చడానికీ ప్రయత్నించారు.
      
       1773లో రెగ్యూలేటింగ్‌ చట్టంలో బ్రిటిష్‌వారు మనువాద రాజ్యాంగాన్ని పక్కన పెట్టడంతో ఇండో – బ్రిటిష్‌ రాజ్యాంగం ప్రారంభమైనట్టు భావించవచ్చు. మనువాద రాజ్యాంగం శూద్రులకు 8వ అధ్యాయం 417వ ఆర్టికల్‌ ద్వారా నిషేధించగా 1795 ఇండో-బ్రిటిష్‌ చట్టం ద్వారా ఆస్థిహక్కును ఇచ్చింది. 1813 వరకు శూద్రులకు మనుధర్మ రాజ్యాంగం ప్రకారం చదువు నిషేధం. దానిని ఇండో – బ్రిటిష్‌ రాజ్యాంగం 1813లో అందరికీ చదువుకునే అవకాశం కల్పించింది. ఇండో-బ్రిటిష్‌ రాజ్యాంగం వచ్చే వరకు బాల్య వివాహాల పద్ధతి ఉండేది. కొన్ని ప్రాంతాలలో చనిపోయిన భర్తతో పాటు భార్యను కూడా చితిలో వేసే సతీసహగమన దురాచారం ఉండేది. దేవదాసీ విధానం నిర్బంధంగా చెలామణి అయ్యేది. 1829లో ఇండో-బ్రిటిష్‌ చట్టాల ద్వారా వీటిని నిషేధించారు. రాజా రామ్మోహన్‌రాయ్, కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు లాంటి వారు ఇలాంటి దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడినందుకు బ్రిటిష్‌ వారి తొత్తులని మనువాదులు ముద్ర కూడా వేశారు.1804లో ఆడశిశువులను చంపే దురాచారాన్ని నిషేధించే చట్టం తెచ్చారు. 
     మను రాజ్యాంగం 9వ అధ్యాయం 241వ ఆర్టికల్‌, 8వ అధ్యాయం 366, 379 ఆర్టికల్స్‌ ప్రకారం అగ్రవర్ణాల వారు ఎంత పెద్ద తప్పు చేసినా నామమాత్రపు శిక్షలు మాత్రమే వేయాలని, శూద్రులు చిన్న తప్పు చేసినా అణచి ఉంచడానికి పెద్ద శిక్షలు వేయాలని ఉంది. 1817 వరకు అన్ని కులాల వారికి ఒకే రకమైన నేరానికి ఒకే రకమైన శిక్షలు ఉండేవి కావు. ఈ మనువాద రాజ్యాంగాన్ని సవరించి సమాన తప్పుకు సమాన శిక్షలు నిర్దేశించే ఇండో – బ్రిటిష్‌ చట్టం తెచ్చారు. బ్రిటిష్‌వారు ఎన్ని చట్టాలు చేసినా, భూస్వామ్య విధానం బలంగా ఉన్న భారతీయ సమాజం మాత్రం మనుధర్మ కట్టుబాట్లనే పాటిస్తూ వచ్చింది. బ్రిటిష్‌వారు కూడా పెత్తందారీ శక్తుల నుంచి వ్యతిరేకత బలంగా వచ్చినప్పుడల్లా వెనక్కి తగ్గేవారు. అయినా వారికి తమ వ్యాపారం, లాభాలు తప్ప భారతీయ సమాజ పురోగతి ప్రాధాన్యత కాదు గదా!
      మనువాద రాజ్యాంగం భారత దేశాన్ని పురోగమించ కుండా అడ్డుగా నిలిచింది. భారతదేశానికి పూర్తి స్వాతంత్రం వచ్చాక ఒక రాజ్యాంగాన్ని లిఖించుకొనింది. ఇది బ్రిటిష్ వారు భారత దేశంలో అమలు చేసిన రాజ్యాంగం కంటే ఎన్నో రెట్లు మెరుగైనది. 

 ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం భారత రాజ్యాంగం. ఈ రాజ్యాంగం ప్రారంభంలో 395 ఆర్టికల్స్, 8 షెడ్యూళ్ళు, 22 రెండు భాగాలుగా ఉండేది. ప్రస్తుతం 465 ఆర్టికల్స్, 12 షెడ్యూల్ 25 భాగాలుగా ఉంది. 1951లో మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్, 1935 లో 52 వ రాజ్యాంగ సవరణ ద్వారా 10వ షెడ్యూల్ 1992లో 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా 11, 12వ షెడ్యూల్ చేర్చబడ్డాయి. జనవరి 2018 నాటికి భారత రాజ్యాంగానికి 123 ప్రతిపాదిస్తే 101 సవరణ చట్టాలు చేయబడ్డాయి. రాజ్యాంగంలో 4వ భాగంలో ప్రజలకు సమానత్వం కలిగించడానికి రాజ్యాంగం లో ఆదేశిక సూత్రాలను పొందు పరిచారు. 3వ భాగంలో ప్రాథమిక హక్కులను పొందుపరిచారు. 14వ అధికరణం ప్రకారం దేశంలోని పౌరులందరికీ సమాన అవకాశాలు రక్షణ కల్పించాలి. అలాగే ప్రజలందరికీ ఆర్థిక సామాజిక రాజకీయ న్యాయం అందించే లక్ష్యాలతో భారత రాజ్యాంగ రూపకల్పన చేయబడింది.

        12 అధ్యాయాలు, 444 ఆర్టికల్స్‌తో చాలా ఆధునిక అంశాలు చేర్చారు. 14వ ఆర్టికల్‌ ననుసరించి చట్టం ముందు అందరూ సమానం, 17 ప్రకారం అంటరానితనం పాటిస్తే శిక్షార్హం. 19 ప్రకారం భావ ప్రకటనా స్వేచ్ఛ, 23 ప్రకారం వెట్టి చాకిరీ రద్దు. 24వ ఆర్టికల్‌ ప్రకారం బాల కార్మిక వ్యవస్థ రద్దు, 39 ఆర్టికల్‌ ప్రకారం స్త్రీ, పురుషులకు సమాన పనికి సమాన వేతనం, ఇంకా జాతి సంపద కొందరి దగ్గరే పోగుపడకూడదు. 43వ ఆర్టికల్‌ ప్రకారం గౌరవ ప్రదంగా జీవించడానికి సరిపడా వేతనం ప్రభుత్వం కల్పించాలని ఉంది.

 అయినా అనేక అంశాలలో మనువాద కట్టుబాట్ల ప్రభావం నేటికీ సమాజంలో ప్రబలంగానే కనబడుతుంది. మనుషులందరూ సమానం అని రాజ్యాంగం చెబుతోంది. కానీ సమాజంలో నిచ్చెన మెట్ల వ్యవస్థ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది

 అంటరానితనం, కులవివక్ష నిర్మూలించాలనీ, పాటిస్తే కఠిన శిక్ష విధించాలని చట్టం చెబుతోంది. కానీ కుల వివక్ష తగ్గిందేమీ లేదు. అణగారిన జనాలపై దాడులు, దౌర్జన్యాలు నిత్యకృత్యం. కుల వ్యవస్థ మంచిదేననీ, కుల నిర్మూలన కోసం పోరాడటం తప్పని చినజీయర్‌ ప్రకటించడం చూస్తూనే ఉన్నాం. సంఘ్ పరివార్‌ కార్యకర్తలే ప్రస్తుత రాజ్యాంగాన్ని పక్కనపెట్టి తిరిగి మనుధర్మ శాస్త్రాన్ని పునఃప్రతిష్టించాలని అనేక వేదికలను సృష్టించి నిరంతరం ప్రచారం చేస్తూనే ఉన్నారు.

        ప్రస్తుత రాజ్యాంగం 39వ ఆర్టికల్‌ ప్రకారం సంపద కొందరి దగ్గర పోగుపడకూడదని ఉంది. కానీ ఆచరణలో మనుధర్మ రాజ్యాంగం చెప్పినట్టు సంపదంతా అగ్రవర్ణ పెత్తందారులూ, పెట్టుబడిదారుల దగ్గరే భారీగా పోగుపడింది. 70.74 శాతం సొత్తు 10 శాతం జనాభా చేతుల్లో ఉంది. 60 శాతం మంది వద్ద 4.8 శాతం సంపద మాత్రమే ఉంది. ధనికుల సంపద గత ఏడాది 20.9 లక్షల కోట్లు పెరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ తోసమానం. ప్రస్తుత భారతబిలీనియర్స్ సంఖ్య 198 కి చేరింది. వీరి ఆదాయం మొత్తం 400 బిలియన్ డాలర్లు అంటే 28 లక్షల కోట్లకు చేరిందని ఆక్స్ ఫామ్ నివేదిక తెలిపింది . కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలమొత్తం రెవిన్యూఖర్చు 2,08,166 కోట్లు. భారతదేశం ముఖేష్ అంబానీ సంపద 2.80 కోట్లు. దేశంలో అత్యధిక రాంకింగ్ కలిగిన అధికారి రోజువారి వేతనం 8,600. గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద పనిచేస్తున్న పేదల యొక్క రోజువారి వేతనం 187 రూపాయలు. ముఖేష్ అంబానీ రోజు వారి సంపాదన 300 కోట్లు. రాజ్యాంగ మౌలిక లక్షణాలలో ఉన్న సంపద పంపిణీ ఎంత వ్యత్యాసంగా ఉందో తెలుస్తుంది. అంటే ఇప్పటి వరకు ఈ భారతదేశాన్ని పరిపాలించిన పాలకులు పేదల అభ్యున్నతి కంటే కార్పొరేట్ల అభివృద్ధి కోసం కష్టపడ్డారు, పరిపాలించారు, చట్టాలను సవరణ చేశారని తెలుస్తుంది.

          కులాంతర వివాహాలు చేసుకుంటే మరణ శిక్షలు విధించాలని 1వ అధ్యాయం 64వ ఆర్టికల్‌లో మనుధర్మ రాజ్యాంగం చెప్పింది. కులాంతర వివాహాలు తప్పుకాదని ప్రస్తుత రాజ్యాంగం చెబుతున్నది. పైగా కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ప్రోత్సాహకాలు కూడా ఇస్తోంది. కానీ మనుధర్మ రాజ్యాంగం ప్రభావంతో ఇప్పటికీ స్వంత తల్లిదండ్రులే కులాంతర వివాహాలు చేసుకుంటున్న తమ పిల్లలను చంపుతున్న ఘటనలు కోకొల్లలు. చెప్పుకునేది ప్రస్తుత రాజ్యాంగం అయినా, ఆచరణలో అత్యధికుల మెదళ్లలో మనువాద రాజ్యాంగమే తిష్టవేసుకుంది. భారత రాజ్యాంగ ప్రభావాన్ని సమాజంపై పడకుండా చేసి మనువాద

Comments

Popular posts from this blog

మహాత్మా గాంధీ ఆచరణాత్మక తాత్విక చింతన

బాబాసాహెబ్ అంబేద్కర్‌ ఆధునిక తాత్విక చింతన

బౌద్ధం పునాదులపై లేచిన వైదిక ధర్మం