గోత్రమ్ అనే పదం రెండు సంస్కృత పదాల నుండి ఏర్పడింది. మొదటి పదం 'గౌ'- అంటే ఆవు, రెండవ పదం 'త్రాహి' అంటే కొట్టం. గోత్రం అంటే 'గోశాల' అని అర్ధం. అంటే ఆవులు నిలుపు స్థలం అని అర్థం. ఇది వంశ మూలపురుషుని పేరుని తెలియజేస్తుంది.
ఆటవిక జీవితమును గడపిన మానవుడు గోవులను వాటి రంగులను తొలుత ఆయా వ్యక్తుల తాతా, ముత్తాతలను గుర్తించడానికి నల్లావులవారు, కపిలగోవువారు, తెల్లావులవారు అని మూలపేర్లను కలిగి ఉండేవారు.
గోత్రం అనే పదం వేదాలలో ఎక్కడా కానరాదు. అయితే, పాళీ భాషలోని కొన్ని శాసనాలలో మనకు ‘గొట్ట’ అనే మాట కనిపిస్తోంది. బౌద్ధమతం సుస్థిరం అయిన కాలం నాటికే గోత్రం అనేది మన సమాజంలో స్థానం సంపాదించుకుంది. జైనులలోకూడా ‘గోత్రం’ గురించిన ప్రసక్తి ఉంది. ‘గోత్రం’ అంటే అనేక అర్థాలు ఉన్నాయని చెబుతారు. వాటిలో 1. వంశం, 2. గుంపు, సమూహం, 3. పేరు, 4. గొడుగు, 5. బాట అనేవి ఇక్కడ పేర్కొనవచ్చు.
‘గోత్రం’ అనే పదం ‘గౌః’ అనే సంస్కృతపదం నుంచి ఆవిర్భవించింది. ‘గౌః’ అంటే గోవులుఅని అర్థం. ‘గోత్ర’ అనే సంస్కృత పదానికి 1. భూమి, 2 గోవుల సమూహం అని రెండు అర్థాలు ఉన్నాయి. ఒకే గుంపులోని వారంతా రక్త సంబంధీకులే కాబట్టి, వారంతా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ల వంటి వారే కాబట్టి, సరైన జన్యువులతో వంశం సరిగ్గా వృద్ధి చెందేందుకు ‘సగోత్రీకుల’ను వివాహం చేసుకోరాదన్న నిబంధన సమాజంలో ఏర్పడింది.
ఒకే గోత్రమునకు చెందిన ప్రజలు ఒకే కులము నకు చెందిన వారు అయి ఉండరు.గోత్రము ఒక్కటే అయినా కులములు వేరు కావచ్చును.ఉదాహరణకు భరద్వాజ గోత్రము బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు కూడా కలిగి ఉన్నారు. (డా.చిప్పగిరి) ఒకే
గురువు వద్ద (ఇక్కడ భరద్వాజ) విద్యాభ్యాసమును చేయటము వలన వర్ణములు వేరు ఐనా గోత్రము ఒక్కటే అయినది. కానీ మాతృ స్వామ్యము మధ్య ఒక ప్రసిద్ధ మినహాయింపు ఉంది.ప్రాచీనకాలంలో ఒకే రుషి, లేదా ఆచార్యుడి దగ్గర ఉన్న శిష్యులు తమను తాము గురుసోదర, సోదరీమణులుగా భావించి కుటుంబ సంబంధాలు ఏర్పరుచుకునేవారు. అంటే కుటుంబంలో సోదరికి, సోదరుడికి ఎలా వివాహం జరగదో, అలాగే గురుసోదర, సోదరీమణుల మధ్య వివాహ సంబంధాలను తప్పుగా భావించడం ప్రారంభించారు.
గోత్రం’ అనే పదం మొట్టమొదటిసారిగా ‘ఛాందోగ్యోపనిషత్’లో ఉన్న సత్యకామ జాబాలి కథలో కనిపిస్తుంది.
గోవు, గురువు, భూమి, వేదం అని అర్థాలున్నాయి. అయితే వీటీకి, మనషులకు ఉన్న సంబంధం ఏంటి?. పురాతన కాలంలో గోవులే ధనం. ఒక చోట నుంచి మరోచోటికి వలస వెళ్తుండేవారు. అలాంటి సమయంలో గోవుల రక్షణకు గోత్రాలను ఏర్పరిచారు. ఒకరి గోవులు మరొకరి గోవులలో కలిసిపోవడం వల్ల వచ్చే గొడవలను గోత్రపాలకులు తీర్చేవారు. వారు ఎంతో క్రమశిక్షణ, తపోనిష్ఠతో ఉండేవారు. అలాంటి గోత్రపాలకుల పేర్లే ఆపై వారి వారి సంతానానికి గోత్రనామాలయ్యాయి. వారి వంశక్రమంలో జన్మించిన వారు, వారి వారి మూల పురుషులను గోత్ర నామంతో ఆరాధిస్తున్నారు. పూజల్లో, యజ్ఞాల్లో , యాగాల్లో, వివాహ సంబంధమైన విషయాల్లో గోత్రం యొక్క పాత్ర ఎంతో ఉంటుంది.
టోటెమ్ అనేది జంతువులు, చెట్లు లాంటి వాటికి సంబంధించినది. ఇందులో కొన్ని పేర్లు తర్వాత కూడా అలాగే కొనసాగుతున్నాయి. వీటిలో మత్స్య, మీనా, ఉదంబర్(అత్తి), గర్గ్(ఆబోతు), గోతం, రిషభ్(ఎద్దు), అజ్(మేక), కాక్(కాకి), బాఘ్(పులి), పైప్లాద్(చిలుక), కట్, అలి(తుమ్మెద) లాంటివి ఉన్నాయి.
అన్నిటికంటే మొదట గోత్రాలు సప్త రుషుల పేర్లతో చెలామణి అయ్యాయి. ప్రాచీన గ్రంథాల్లో సప్త రుషులుగా భావించే రుషుల పేర్లలో (శతపథ బ్రాహ్మణ, మహాభారతం) కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. ఈ గ్రంథాలను బట్టి మొత్తం రుషులు- గౌతమ, భరద్వాజ, జమదగ్ని, వశిష్ట, విశ్వామిత్ర, కశ్యప, అత్రి, అంగీర, పులస్తి, పులహ, క్రతు అనే పదకొండు మంది అవుతారు.
ఏదేమైనా మన పూర్వీకులను గుర్తించడానికి మూడు దశలున్నాయి. మొదటిది టోటెమ్ ఇందులో ఇతర ప్రాణులను మనుషుల కంటే ఎక్కువ తెలివైనవని, సమర్థమైనవని భావించి వాటితో తమ పూర్వీకులను జోడించేవారు. దీని చాయలు ధ్వజ, కేతు(గరుడధ్వజ్, రిషధ్వజ్) లాంటి వాటిపై కూడా ఉన్నాయి.
తర్వాత మిగతా వారి కంటే తమను ఉన్నతులుగా చెప్పుకున్న(ముండా, ఆర్య, అసుర, శక) లాంటి గోత్రాలు వచ్చాయి. చివర్లో అందరికీ విద్య, జ్ఞానం అబ్బిన తర్వాత ఆచార్యులు, రుషుల పేర్లను గోత్రంగా చేసుకునేవారు.
పురుషోత్తమ్ పండిట్ తను రాసిన 'గోత్రప్రవర మంజరి'లో మొత్తం 3 కోట్ల గోత్రాలు ఉన్నాయని అంచనా వేశారు. ఒక్క శుక్ల యజుర్వేద మధ్యందిన మహారాష్ట్ర బ్రాహ్మణులలోనే 188 గోత్రాలు ఉన్నట్లు విశ్వనాథ్ త్య్రంబక్ సేఠ్ తమ 'గోత్రావళి' పుస్తకంలో పేర్కొన్నారు. (ప్రచురణ : యాజ్ఞవల్క్య ఆశ్రమం, పూనా).
Comments
Post a Comment