పూలే తాత్విక దృక్పథం
మహాత్మా జ్యోతి బా పూలే
1827 ఏప్రిల్ 11 వ మహారాష్ట్రలో జన్మించిన జోతిభాపూలే మార్క్స్ మహనీయుని సమకాలికుడు. భారతీయ తాత్వికతకు నిజమైన వారసుడు. సమానత్వ సమాజం రావాలని ,మనువాదుల కబంధ హస్తాల్లో నలిగిపోతున్న విద్య , విజ్ఞానం మనుషులందరికి సమానంగా దక్కాలని తపించిన వాడు. సమాజానికి చదువు ప్రాధాన్యతను ప్రబోధించిన సామాజిక విప్లవ స్ఫూర్తి శిఖరం పూలే . మనువాద చట్టాలను ప్రతిఘటించడమే గాక మెజార్జీ ప్రజలకు చదువెందుకు లేదో, ఇండ్లు భూములెందుకు లేవో,బట్టలెందుకు లేవో , కనీస ఆహారం కూడా ఎందుకు దొరకడం లేదో,సంపద సృష్టిస్తున్న వారికి అందులో చాటా ఎందుకు దక్కడం లేదో ప్రశ్నిస్తూ అసమానతలపై తిరుగుబాటు చేశాడు.
1848 ప్రపంచంలో పెను మార్పులు సంభవించాయి .
ప్రపంచ మానవాళి విముక్తి సిద్ధాంతం కమ్యూనిస్టు మ్యానిఫెస్టోను కారల్ మార్క్స్ ప్రపంచానికి అందించిన సంవత్సరం అది.
అమెరికాలో స్త్రీల విముక్తి ఉద్యమం కూడా ముమ్మరంగా జరుగుతున్న రోజులవి . ఆ స్ఫూర్తితో పూలే మొట్టమొదటి బాలికల ఉన్నత పాఠశాలను నెలకొల్పారు .తన భార్య సావిత్రి బాయి పూలేకు తానే గురువై ఈ దేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయినిగా తీర్చిదిద్దాడు . వయసులోనూ కాలంలోనూ గాంధీ కంటే పూలే చాలా ముందు వాడు .ఎరవాడ జైలులో జ్యోతిభా చర్చ వచ్చినప్పుడు గాంధీజీ ఆయనను ఎంతో శ్లాఘించాడు .
కుల వివక్ష ప్రత్యక్షంగా అనుభవించిన ఆయన దాన్ని రూపుమాపడానికి తుది శ్వాస వరకు కృషి చేశాడు .
ఒక బ్రాహ్మణ మిత్రుడి వివాహ ఉరేగింపులో పాల్గొన్నందుకు బ్రాహ్మణులు ఆయన పట్ల చూపిన వివక్షతో రగిలిపోయాడు . "
'' అదవా మాళి కులస్థుడివి. దైవజనులైన బ్రాహ్మణుల ఊరేగింపులో ఎలా పాల్గొంటావు , అపచారం అపచారం " అంటూ ఆ ఊరేగింపు నుండి గెంటివేశారు .
ఈ సంఘటన ఆయన హృదయాన్ని గాయపర్చింది . వాటి నుండే అతడు పోరుబాట పట్టాడు . వేల సంవత్సరాల మనువాదుల కుతంత్రాలను , అమానవీయ పద్దతులను తుదముట్టించాలని భావించాడు .
బానిసత్వా న్ని,ఆధిపత్యాన్ని వ్యతిరేకించాడు.వాటి నుండి అందరూ విముక్తి కావాలని ఆయన 1973 లో గులాంగిరి అనే పుస్తకం రాశాడు. ఆయన ఆదర్శ వివాహాలకు నాంది పలికాడు .రోజువారీ రెక్కల కష్టంతో బతికేవారు ... పండుగలు , దేవుళ్ళ పేరుతో భారీగా ఖర్చులు పెట్టకడం మానుకోవాలన్నాడు.
ఆ వెలుగులో అపూర్వ సాహసంతో అందరికీ విద్య కోసం పాటుపడింది సావిత్రిభాయి పూలే అవమానాలకు , నిందలకు గురైన వితంతువులారా అనవసరంగా మీ ప్రాణాలు తీసుకోకండి . మీకు మేము అండగా ఉంటామంటూ బ్రాహ్మణ వితంతువులకోసం కూడా ప్రత్యేక శరణలయాలను నెలకొల్పారు .
1880 లో బొంబాయి నూలు మిల్లు కార్మికుల పోరాటం ప్రముఖ కార్మిక నాయకుడు నారాయస్ లోఫౌండే నిర్వహిస్తుండగా ఆయనతో కలిసి కార్మిక సమస్యలపై పోరాడాడు .
1873 లో ' సత్యశోధ సమాజ్ను " స్థాపించాడు . ప్రజలను బానిసత్వం నుండి విముక్తి చేయడమే ఈ సమాజ్ లక్ష్యమని చెప్పాడు .
పరమత సహనం పాటించడం ,
మూఢనమ్మకాలు ,
జ్యోతిష్యం ,
జాతకాలు , దెయ్యాలు ,
భూతాలు వంటి వాటి నుండి ప్రజలను కాపాడడం ,
కులవ్యవస్థ . విగ్రహారాధనలను వ్యతిరేకించడం , మనుషుల మధ్య సోదరభావం పెంచడం వంటి సామాజిక చైతన్య కార్యక్రమాలు ఈ సత్యశోధక్ సమాజ్ చేపట్టింది .
1877 లో తీవ్ర కరువు సంభవించింది . కరువు కోరల్లో చిక్కుకున్న ఆనాథ పిల్లలను కాపాడేందుకు 1877 మే 17 న అనాధ శరణాలయం నెలకొల్పాడు .
స్త్రీల కోసం ప్రత్యేక పాఠశాలను స్థాపించాడు .
సతీసహగమనం ,
అంటరానితనం ,
పురోహిత వ్యవస్థ నిర్మూలనకు కృషి చేశాడు .
వితంతు వివాహాలను ప్రోత్సహించారు .
కార్మిక కర్షక హక్కుల పోరాటాల్లో పాల్గొన్నారు .
అందుకే ఆయనను అంబేద్కర్ వంటి మహనీయులు ఎందరో సూర్తిగా తీసుకోవడమే గాక గురువుగా ప్రకటించుకున్నారు .
వూలే ఆశయాలు నేటికీ పూర్తిగా నెరవేర్చబడలేదు .
బిసీ ప్రధాని అయ్యాడని దేశంలో 50 శాతం మంది సంబురపడి చంకలు గుద్దుకున్నారు.
కానీ ఆయన విదేశాలు తిరగడం , దేశం బయట సరిహద్దు వివాదాలు సృష్టించడం , దేశంలోపం హిందూత్వాన్ని రెచ్చగొట్టడడం , మన జాతీయ జెండాను కాషాయ జెండాగా మార్చజూడడం , భావోద్వేగాలను రెచ్చగొట్టడం , మతోన్మాద దుష్ట చర్యలకు పాల్పడటంలో నిమగ్నమయ్యారు .
బీజేపీ పాయలు పూలే ఆశయాలకు బొంద తీసి పాతి పెడుతున్నారు .
అందరికీ విద్య కోసం ఆయన తుదిశ్వాస వరకు కృషి చేస్తే ..
నూతన విద్యావిధానం పేరుతో ప్రయివేటు కార్పొరేట్ విద్య విధానాన్ని తెచ్చిన బీజేపీ సర్కార్ కొన్నవారికే విద్యను అమ్ముతున్నది .
బలహీన వర్గాలు దళితుల హక్కుల కోసం ఆయన అనునిత్యం శ్రమిస్తే ...
ఆ హక్కులను ఒక్కొక్కటిగా తొలగిస్తున్నది .
అంబానీ ఆదానీ ఆస్తులు పెంచడమే తమ పార్టీ విధాన లక్ష్యంగా బీజేపీ కృషిచేస్తున్నది .
కోటీశ్వరులను మరింత కోటీశ్వరులుగా పేదలను మరింత పేదలుగా మార్చుతున్నది . ఇప్పటికే
16 లక ప్రభుత్వ రంగ సంస్థలను పట్టపగలే అంగడిలో సరకులాగా శేరు,పావుశేరు లెక్కన అమ్మింది దళితులు బలహీన వర్గాలకు ఉండబడిన రిజర్వేషన్లకు సమాధి చేస్తున్నది .
కక్ష్య పూరితంగానే దళితులు ,
బలహీన వర్గాలు ,
మహిళలు ,
మైనార్టీలకు అన్ని రకాల హక్కులపై ఉక్కుపాదం మోపుతున్నది .
మన దేశం అనే దేహానికి శ్రామికులు రక్త నాళాల వంటి వారు అని ఆయన పేర్కొంటే ...
నేటి పాలకులు మాత్రం ఆధిపత్య శక్తులను , సంపన్న పెట్టుబడి దారి శక్తులను అభివృద్ధి చేసి అణగారిన వర్గాలను అధఃపాతాళంలోకి తొక్కేస్తున్నారు .
" Let others go where they will. We follow Phule path. We may or may not take Marx But we certainly not abandon Phuley's philosophy.". .
. Dr. B. R. Ambedkar ,(speech in 1954)
Quoted in Debrahminizing History, Manohar Publishers, 2015
********
మహాత్మా జ్యోతిరావు పూలే ( 1827- 1890 ) మాత్రమే ఆధునిక భారత దేశానికి సామాజిక విప్లవ పితామహుడు ( Father of Modern India) గా
మొత్తం సమాజాన్నీ, దాని పునాదుల తత్వాన్ని శాస్త్రీ యంగా ఆకళింపు చేసుకున్న వారినే చరిత్ర, విశాల ప్రజా బాహుళ్యం ఎంపిక చేసుకొంటుంది.
భారత దేశంలో సాంఘిక రుగ్మతలను, మూఢాచారాలను ఎంతో నిబద్ధతతో వ్యతిరేకించి, పోరాడిన వారెందరో ఉన్నారు. ఉదాహరణకు, రాజా రామ్ మోహన్ రాయ్ ( 1772- 1833 ). అతి భయంకరమైన సతీ సహగమనం, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా నిలిచి , వారి విద్యకు పట్టం కట్టి, స్త్రీ బానిసత్వాన్ని ప్రశ్నించి చరిత్ర కారుల ప్రశంశలు అందుకున్న మేధావి, ప్రసిద్ధి గాంచిన
బ్రహ్మ సమాజ్ స్థాపకుడైన రామ్మోహన్ రాయ్, ఫూలే కంటే ముందున్న వాడే కదా? అలాగే వితంతు పునర్ వివాహాలను పెద్ద ఎత్తున ప్రోత్సాహించి, స్త్రీ జాతిలో ఎంతో ఉత్తేజం నింపిన ఈశ్వర చంద్ర విద్యాసాగర్ ( 1820- 91 ) ఫూలే సమకాలికుడే. ఇక వివిధ వర్గాల ప్రజల్లో ఉన్నత స్థాయి లో ప్రశంసలు అందుకున్న ఆర్య సమాజ్ స్థాపకుడు, సామాజిక సంస్కర్త , స్వరాజ్య పిపాసి స్వామి దయానంద సరస్వతి ( 1824- 83 ) సైతం ఫూలే సమకాలికుడే కదా? అయినప్పటికీ జోతిబా ఫూలేని మాత్రమే ఆధునిక భారత సామాజిక తాత్విక వేత్తగా కీర్తించారు.
ఆధునిక భారతీయ సంస్కర్తలు స్త్రీ పురుష అసమానతల నూ, మూఢత్వాన్నీ, పీడన నీ వ్యతిరేకించారు కానీ, వాటన్నింటికీ మూలమైన వర్ణాశ్రమ వ్యవస్థను ఖండించక లేకపోయారు. ఆ వర్ణ ధర్మానికి పట్టు కొమ్మలైన బ్రాహ్మణీయ హిందూ ధర్మ శాస్త్రాలు, స్మృతుల నీ, వ్యతిరేకించలేక పోవడమే. పైగా ప్రత్యామ్నాయ సమాజ నిర్మాణానికి కూడా తిరిగి అదే వర్ణ వ్యవస్థను ఆశ్రయించడం, ప్రతిపాదించడమే. ( మరిన్ని వివరాలకు చదవండి, బ్రజ్ రంజన్ మణి, మడి విప్పిన చరిత్ర, హైదరాబాద్ బుక్ ట్రస్ట్, హైదరాబాద్, 2018, అధ్యాయం 4 ) ఈ అప సవ్యతనీ, డొల్లతనాన్నీ సూటిగా ప్రశ్నించి, సమస్త అసమానతలకు వర్ణ ధర్మమే మూలమనీ దానిని రద్దు పరుచు కోవడమే విమోచనా మార్గమనీ సిధ్ధాంతీకరించి, పోరాడిన తొలి తాత్వికుడు జ్యోతిరావు ఫూలే మాత్రమే. ఇదే ఫూలే విశిష్టత, ప్రత్యేకత.
శూద్ర , అతిశూద్ర జాతుల బానిస జీవితాలకు కులవ్యవస్తే మూలకారణం అని కులం పునాదుల ను ధ్వంసం చేసే దిశగా క్షేత్ర స్థాయిలో ఉద్యమించిన యోధుడు, మేధావి ఫూలే. కుల ధర్మం మాటున భూమికీ, భుక్తికీ, ఆస్తికీ అధికారం కీ దూరం
చేయబడడడమే కాక, కనీస విద్యకూ, గౌరవానికీ కూడా నోచని కట్టు బానిసలుగా ప్రజారాసులను దిగజార్చిన చరిత్ర బ్రాహ్మణిజానిదేనని విశ్లేషించారు. భారత దేశం లోని కుల వ్యవస్థ అమెరికా లోని నల్ల జాతీయుల బానిస వ్యవస్థ లోని అస్వతంత్ర నిరంకుశ విధానం వంటిదని విశ్లేషించారు. కుల వ్యవస్థ ను దునుమాడుతూ ఫూలే 1873 లో రాసిన తన ప్రసిద్ధ గ్రంధానికి ' గులాం గిరీ' ( slavery ) అని నామకరణం చేయడం తో బాటు, నీగ్రో జాతిని సుదీర్ఘ బానిసత్వం నుంచి విడిపించి, విముక్తి కల్పించిన అమెరికా ప్రజలకే ఆ పుస్తకాన్ని అంకితం చేయడం విశేషం.
అంతేకాక, స్త్రీ జాతి పురుష బానిసగా బ్రతకడానికీ కూడా కులమత వ్యవస్థ లే కారణమని నిగ్గు తేల్చి, వారికి విద్య నేర్పారు. బ్రాహ్మణ, బ్రాహ్మణేతర వితంతు వులకు, ఆశ్రయం కల్పించారు . ఫూలే బ్రాహ్మణీయ వ్యవస్థ కే గానీ బ్రాహ్మణ వ్యక్తులకు వ్యతిరేకం కాద నే సత్యం ఆయన రచనలలో కన్నా ఆచరణలో మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఆ విధంగా మహాత్మా ఫూలే భారత దేశం లో తొలి బ్రాహ్మణేతర పోరాటాలకూ, కుల వ్యతిరేక పోరాటాలకూ పితామహుడై చరిత్రలో తనకంటూ ఒక విశిష్టమైన అధ్యాయం స్రుష్టించుకున్నారు.
తన సమకాలీన సాంఘిక సంస్కర్తలెవ్వరూ ఫూలే లాగా కులం పైన గానీ, దాని సామాజిక వ్యవస్థల కున్న సైద్ధాంతిక పునాదుల పైన గానీ, దాడి చేసిన దాఖలాలు లేవు. పైగా వారు హిందూ స్మృతులు పురాణాలను సవాలు చేయడం మాని, వాటిని తమ సమ కాలీన పరిస్థితులకు తగినట్లుగా పునర్వ్యాఖ్యానించడం మాత్రమే చేశారంటూ కుబేర్ లాంటి మేధావులు చేసిన భాష్యం పరిగణించ దగిందే. ( Kuber, WN , "Ambedkar: A Critical Study", People's Publishing House, New Delhi,1992, page. 284 ).
ఫూలే విద్యకి గల విమోచనా శక్తిని గుర్తించి దానికి ఎంతో విలువను ఇచ్చాడు. ఎప్పుడైతే మనుషులు విద్యకు దూరం చేయబడతారో , అప్పుడు తమ పురోగతి కి కావలసిన విలువైన విజ్ఞానం, వికాసం, విత్తమూ వారికి దూరమైపోతాయని నిరూపించాడు. (ఫూలే రాసిన 'విద్యా బినా మతి గేలీ' అనే తన ప్రసిద్ధ గీతం చూడండి). ఆ ఆలోచన తోనే అంటరాని జాతులకు, స్త్రీ లకూ ప్రత్యేక పాఠశాలలు నెలకొల్పి తన సహచరి సావిత్రి భాయి తో కలిసి విద్యా జ్నానాన్ని పంచారు..విద్యకూ విముక్తి కీ గల సూటి సంబందాన్ని వివరిస్తూ, అణచివేత, దోపిడీ దౌర్జన్యాలను తిప్పికొట్టేందుకు కావలసిన విద్యను పంచి, వారిలో మూడో నేత్రం ( తన విశిష్ట నాటకం ' త్రుతీయ రత్న' 1855, చదవండి), తెరిపించినవాడు ఫూలే.
బ్రాహ్మణేతర కులాలకు చెందిన రైతులు, కార్మికులు, ఎన్నో పీడిత కులాలుగా విడబడి పోయినా , వారందరిదీ సమానమైన జీవన విధానమూ, .సమశ్యలే ననీ , అందుకు జరగాల్సింది సాంఘిక పునర్నిర్మాణమూ, ఆ దిశలో దళితులు అంతా ఐక్యం కావడమనీ ఫూలే ఈ నాటకం ద్వారా స్పష్టం చేశారు. ఇదే అభిప్రాయాన్ని ప్రముఖ విశ్లేషకులు హాన్లన్ , పూలే జీవితం పై రాసిన పుస్తకం ద్వారా వివరంగానే తెలియ చేశారు.
( రోజలిండ్ ఓ హాన్లన్, " జోతిరావు పూలే", హైదరాబాద్ బుక్ ట్రస్ట్, హైదరాబాద్, 1998, పేజీ. 50).
ఇక సామాజిక వైరుధ్యాల విషయంలో ఫూలే ఏమంటారంటే, భారత దేశం లో బ్రాహ్మణ వర్ణమే దోపిడీ వర్గమనీ, శూద్ర్రాతి శూద్ర వర్ణాలే పీడిత వర్గమనీ ఈ రెండు వర్ణాల మధ్య నెలకొన్నదే నిజమైన సామాజిక వైరుధ్యం అనీ సూత్రీకరిస్తారు. ఆ అవగాహన తోనే పీడితుల సారధ్యంలో సాగించేదే నిజమైన విముక్తి పోరాటం కాగలదనీ తన సందేశాలూ, పోరాటాల ద్వారా స్పష్టం చేశారు.
( See, " Selected writings of jothirao Phule with Introduction", Deshpande, GP, ed.Left word, Delhi, 2002).
కార్ల్ మార్క్స్ కి సమ కాలికుడైన ఫూలే , మార్క్స్ సిద్ధాంతానికి భిన్నంగా భారత దేశం లో దోపిడీ, అసమానతలకు ఆర్ధిక రాజకీయ కారణాల కన్నా సాంఘిక, సాంస్కృతిక మూలాలే ప్రధాన మైనవని సిద్ధాంతీకరించడమే విశేషత సంతరించుకున్న అంశం. అంటే, భారత దేశం లో జరిగింది వర్గ పోరాటాల చరిత్ర అనడం కన్నా , వర్ణ పోరాటాల చరిత్ర అనడమే సమంజసంగా ఉంటుందని పూలే సిద్ధాంతం. వాస్తవం గమనించినా, ఈ దేశం లో ఈనాటికీ సామాజిక సంపదనంతా దాదాపుగా అగ్ర కులాల కూటమే చేజిక్కించుకోగా, బడుగు, బలహీన వర్గాలు ఆర్ధిక , సాంఘిక, రాజకీయ రంగాల్లో అట్టడుగునే మిగిలి పోవడం కళ్ళ ఎదుటే కనిపించే సత్యమే. ఈ కారణంగా, ఫూలే ఈ సామాజిక దోపిడీ కి ఆయువు పట్టు గా నిలిచిన బ్రాహ్మణీయ ఆధిపత్య భావజాలాన్ని నాశనం చేయడం ద్వారా నే సమానత్వ సాధన చేకూరుస్తుందని సిధ్ధాంతీకరించారు.
( Chakraborty, B & pandey,R.K., " Modern Indian Political Thought" , Sage Publications India Pvt.Ltd., New Delhi, page.18 ).
కాబట్టి భారత దేశ సమాజం లో కులబలమే సర్వాంతర్యామి ( omnipresent), సర్వశక్తి సంపన్నత ( omnipotent ) కలిగినదిగా స్పష్టం అవుతోంది. అంటే ఈ దేశంలో ఒక వ్యక్తి కి కావలసిన సాంఘిక పరమైన సామాజిక హోదా, అవకాశాలు, స్వేచ్ఛతో బాటు ఆర్ధిక పరమైన ఆస్తి, అధికారాలు సైతం కులం పునాది పైనే నిర్మితం అవుతాయనే సత్యాన్ని ఫూలే తొలిగా గుర్తించి, సిధ్ధాంతీకరించినట్లు స్పష్టం అవుతోంది. అంటే దీనినే కమ్యునిస్టు పరిభాషలో చెప్పాలంటే , భారత దేశం లో కులమే పునాది, కులమే ఉపరితలం అని ఫూలే సూత్రీకరించినట్లే.
మహాత్మా ఫూలే ని తన స్వగురువు గా ప్రకటించుకున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఈ సైద్ధాంతిక పునాది పైనే నిలబడి, భారత దేశ పీడిత ప్రజల కు కులాన్నే ప్రధాన శత్రువు గా ప్రకటించారు. అందుకే కులవ్యవస్థ రద్దు దిశగా జరగాల్సినదే సిసలైన విప్లవోద్యమం అని నిర్ధారణ చేశారు. ఒక వైపు భారత దేశం లో కమ్యునిస్టులు ప్రధానం గా ఆర్ధిక అసమానతల ప్రాతిపదిక పై వీరోచిత వర్గ పోరాటాలు నడుపుతున్న దశలోనే డాక్టర్ అంబేద్కర్, కులం రద్దే దోపిడీ రద్దుకు పరిష్కారం అంటూ, దళిత బహుజనుల సమూహం లో ఒక
నిలకడైన ప్రభంజనాన్ని ( sustainable movement ) సృష్టించగలగడం అంత తేలికైన విషయం కాదు.
మొత్తం మీద, ఫూలే భారత దేశ సామాజిక వైరుధ్యాల ను ప్రత్యేకించి అధ్యయనం చేసిన తాత్వికుడు. అన్ని రంగాల్లో అసమానతలకు మాత్రుక గా నిలిచిన కుల వ్యవస్థ ను రద్దు పరుచు కోవడమే విమోచనా మార్గమనీ సిధ్ధాంతీకరించి గొప్ప బ్రాహ్మణేతర పోరాటాలకు పునాది వేసిన యేధుడు. ఫూలే విప్లవ వారసత్వం కోసం దళిత, బహుజనుల సమూహం స్పష్టమైన ఎజెండా తో ముందుకు సాగాల్సిన సమయం ఇది. ఇంతకన్నా మహాత్మునికి అర్పించగల జన్మ దిన కానుక ఏముంటుంది?
(ముగింపు తదుపరి వ్యాసం లో )
9 ఏప్రియల్ 2021
ఏప్రిల్ 11 భారత ప్రప్రథమ సామాజిక తత్వవేత్త మహాత్మా జ్యోతిరావ్ పూలే జయంతి
విద్య ద్వారానే సమాజాన్ని మార్చాలని, అణిచివేయ బడుతున్న అణగారిన వర్గాల జీవితాల్లో అఖండ అక్షర జ్యోతులు వెలిగించి సమాజాన్ని చైతన్య పరిచిన మహనీయుడు, విద్యావ్యాప్తి కోసం ఆజన్మాంతం అగ్రకుల, ఆధిపత్య పెత్తందారులతో అక్షర యుద్ధం చేసిన గొప్ప సంఘసంస్కర్త,అసమానతలను చేధించిన క్రాంతిరేఖ, అణగారిన వర్గాల ఆశాజ్యోతి,ఆదిగురువు మహాత్మ జ్యోతిరావు పూలే గారు..
మనం ప్రపంచ మేధావిగా కొలిచే డా,, B.R అంబేద్కర్ గారే 'పూలే' గారిని తన ఉద్యమ గురువుళ్ళల్లో ఒక గురువుగా భావించిన సందర్భం..అసమానతలు లేని సమాజం కోసం ఆయన పడ్డ శ్రమ,తపన..తన జీవిత భాగస్వామి ఐనా సావిత్రిబాయ్ పూలే" గారిని "చదువుల తల్లి"గా మార్చి తన ఉద్యమాల్లో భాగం చేసి అట్టడుగు,అణగారిన వర్గాల అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడ్డ మహనీయుడి కృషి చారిత్రాత్మకమైనది..అంతేకాదు 'గులాంగిరితో' కుల కుట్రల గుట్టును రట్టు చేసి,మనువాదాన్ని తిరస్కరించి బ్రాహ్మణాధిపత్యాన్ని ఖండిస్తూ 'దీనబందుతో' 'స్వేచ్ఛ'ను సామాన్యుల వేతలను సమాజానికి చూపిన ధీరుడు, మహిళా హక్కులు కూడా మానవ హక్కులేనని చాటుతూ 'స్త్రీ'ల హక్కులకై పోరాడుతూ సమానత్వాన్ని కోరిన సామాజిక వైతాళికుడు,సామాజిక తత్వవేత్త సమాజ హితం కోసం సర్వసం ధారపోసి శ్రామికుడు అందరికంటే ముందుగా మానవాళి చేతనే "మహాత్మా" అని పిలిపించుకున్న గొప్ప మానవతావాది పూలే గారు.
కులం పేరుతో తరతరాలుగా, అన్నిరకాలుగా అణచివేతకుగురెైన బడుగు, బలహీనవర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి, వారి హక్కుల కోసం పోరాడి, సాధికారత కల్పనకు కృషి చేసినమహనీయుడు మహాత్మ జోతిరావ్ గోవిందరావు ఫూలే. సామాజిక తత్వవేత్త, ఉద్యమకా రుడు, సంఘసేవకుడెైన ఫూలే మహారాష్టక్రు చెందినవా డు. ఆయన భారతదేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా కోట్లాది ప్రజానీకం కోసం, పేద, అణగారిన, అంటరాని ప్రజల హక్కుల కోసంపోరాడాడు. మహారాష్టల్రోని పూణే జిల్లాలో ఖానవలి ప్రాంతంలో 1827 ఏప్రిల్ 11న జోతిరావ్ ఫూలే జన్మించాడు. ఆయన తండ్రి గోవిందరావు మొదట్లో కూరగాయలు అమ్మేవాడు. కాలక్రమేణా పీష్వా పరిపాలనాకాలంలో పూల వ్యాపారం చేయడంవల్ల వారి ఇంటి పేరు ఫూలే గా మార్పు చెందింది.
జోతిరావ్‌కి సంవత్సరం వయస్సు రాకుండానే తల్లి తనువు చాలించింది.7 సంవత్సరాల వయస్సులో ఫూలే ఒక మరాఠీ పాఠశాలలో ప్రాథమిక విద్యనభ్యసించాడు. తరువాత చదువు మానివేసి వ్యవసాయంలో తండ్రికి సాయంగా ఉండేవాడు.
అతి తక్కువ కాలం పాఠశాలకు వెళ్ళినప్పటికీ ఫూలేకి పుస్తక పఠనం పట్ల ఆసక్తి ఎక్కువ. ప్రతిరోజూ నిద్రకుపక్రమించే ముందు లాంతరు వెలుతురులో చదువుకునే వాడు. జోతిరావ్‌కు చదువుపట్ల ఆసక్తిని గమనించిన ఒక ముస్లిం టీచర్, ఇంటి ప్రక్కనేఉండే ఒక క్రైస్తవ పెద్దమనిషి జోతిరావ్ తండ్రిని ఒప్పించి ఆయన విద్యాభ్యాసం కొనసాగేలా చేశారు. ఆయన 1841లో స్కాటిష్ మిషన్ పూణేలో నడుపుతున్న పాఠశాలలో చేర్పించాడు.
సదాశివ భిల్లాల్ గోవింద్ అనే బ్రాహ్మణునితో ఫూలే పరిచయం జీవితకాల స్నేహంగా మారింది.
చిన్నప్పుడే మానవ హక్కుల ప్రాథమిక సూత్రాలపై జ్ఞానాన్ని సంపాదించాడు ఫూలే .జోతిరావ్‌కు చిన్నప్పటి నుంచే శివాజీ అంటే అభిమానం ఎక్కువ. శివాజి, జార్జ్ వాషింగ్టన్‌ల జీవితచరిత్రలు ప్రభావితం చేయడంవల్ల దేశభక్తి, నాయకత్వ గుణాలు అలవాటయ్యాయి.
థామస్ రచించిన ‘మానవ హక్కులు’ పుస్తకం అతని ఆలోచనలను ప్రభావితం చేసింది.
అమెరికా స్వాతంత్య్రపోరాటం ఆయనను ప్రభావితం చేయడమే కాకుండా మానవత్వపు విలువలెైన స్వేచ్ఛ, సమానత్వం గురించి లోతుగా ఆలోచింపచేసింది.
గులాంగిరి, పూణే సత్య సోధక సమాజ నివేదిక, తృతీయ రత్న, ఛత్రపతి శివాజీ, రాజ్‌భోంస్లే యాంఛ, విద్యాకాథాతిల్, బ్రాహ్మణ్ పంతోజి మొదలెైనవి మహాత్మ ఫూలే ముఖ్య రచనలు.
13 ఏళ్ళ ప్రాయంలో జోతిరావ్‌కి 9 సంవత్సరాల సావిత్రితో వివాహం జరిగింది. విద్యాభ్యాసం పూర్తయినతర్వాత ఆయన తన కుటుంబవ్యాపారమైన పూలవ్యాపారం ప్రారంభించాడు.
1848లో జరిగిన తన బ్రాహ్మణ స్నేహితుడి వివాహంలో ఫూలే, బిసి ‘మాలి’ కులానికి చెందిన వాడవడం వల్ల కులవివక్షకు గురయ్యాడు. భార్య ప్రోత్సాహంతో ఆ క్షణం నుండి కుల వివక్షపై పోరాడాలని నిశ్చయించుకున్నాడు. కుల విధానంలో ఆయన బ్రాహ్మణుల నువిమర్శించ డమే కాకుండా సమాజంలో వారి ఆధిపత్యాన్ని వ్యతిరేకించాడు. జ్ఞాన సంపదకు అందరికీ అవకాశం ఇవ్వక పోవడానికి ఆయన అభ్యంతరం తెలిపి బ్రాహ్మణాధిపత్యాన్ని వ్యతిరేకించవలసినదిగా సామాన్యుల్ని ప్రోత్సహించాడు.
సమాజంలో సగభాగంగా ఉన్న స్ర్తీలు అభివృద్ధి చెందకపోతే సమాజం అభివృద్ధి చెందదని ఫూలే భావించాడు. అందువల్ల స్ర్తీలు విద్యావంతులు కావాలని నమ్మాడు. ఇతరులకు ఆదర్శంగా ఉండాలని ముందుగా తన భార్య సావిత్రిని పాఠశాలకు పంపాడు.
1948 ఆగస్ట్‌లో బాలికలకు పాఠశాల స్థాపించాడు. ఈ పాఠశాలలో అన్ని కులాలకు ప్రవేశం కల్పించడం, అస్పృస్యులకు కూడా బోధించవలసిరావడంతోఉపాధ్యాయులెవరూ ముందుకు రాలేదు. చివరకు జోతిరావ్‌ఫూలే తనభార్య సావిత్రి సహాయంతో పిల్లలకు పాఠాలు బోధించేలా చేశాడు.
పాఠశాల నిర్వహణలో అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. కొంతకాలం పాఠశాలను నిర్వహించలేక మూసివేశాడు. అయినా పట్టు వదలక తన మిత్రులెైన గోవింద్, వల్వేకర్‌ల సహాయంతో పాఠశాలను పునఃప్రారంభించాడు.క్రమంగా ఆదరణ పెరగడంతో 1851-52లో మరో రెండు పాఠశాలలు స్థాపించాడు. బ్రిటిష్ ప్రభుత్వం ప్రాథమిక విద్యను నిర్లక్ష్యం చేయడాన్ని ఫూలే విమర్శించేవాడు.
ఆనాడు సమాజంలో బాల్య వివాహాలు సర్వసాధారణంగా జరిగేవి. ముసలివారికిచ్చి పెళ్ళి చేయడంవల్ల చిన్నతనంలోనే మహిళలు వితంతువులయ్యేవారు. వీరు మళ్ళీ వివాహం చేసుకోవడాని కి సమాజం అంగీకరించేదికాదు. అందువల్ల వితంతు పునర్
వివాహాలను గురించి ఫూలే ప్రజల్లో చెైతన్యం తీసుకువచ్చాడు. స్వయంగా వితంతువులకు వివాహాలు జరిపించాడు.
1864లో గర్భస్రావ వ్యతిరేక కేంద్రాన్ని స్థాపించి, వితంతువులెైన గర్భిణీ స్ర్తీలకు అండగా నిలిచాడు. దేశంలోనే ఇటువంటి కేంద్రం స్థాపించడం ఇదే మొదటిసారి. 1872లో ఈ కేంద్రంలో జన్మించిన ఒక బ్రాహ్మణ వితంతువు కుమారుణ్ణి ఫూలే దత్తత తీసుకున్నాడు.
1873 సెప్టెంబర్ 24న సత్య శోధక సమాజాన్ని ఫూలే స్థాపించాడు. దేశంలోనే ఇది మొట్టమొదటి సంస్కరణోద్యమం. శూద్రులను బ్రాహ్మణ చెర నుండి కాపాడటమే ఈ ఉద్యమ ముఖ్య ఉద్దేశ్యం. ఈ సంస్థ సభ్యులు పురోహితుల అవసరం లేకుండానే దేవుణ్ణి పూజించేవారు.
కుల, మత వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికి సభ్యత్వం కల్పించేవారు. వేదాలను పవిత్రంగా భావించడాన్ని ఫూలే వ్యతిరేకించాడు. విగ్రహారాధనను ఖండించాడు.
1891లో ప్రచురించిన సార్వజనిక్ ధర్మపుస్తక్ మత, సాంఘిక విషాయలపెై ఫూలే అభిప్రాయా లను తెలియచేస్తుంది. స్ర్తీ, పురుషుల మధ్య లింగవివక్షను ఫూలే విమర్శించాడు. సమానత్వం, స్వేచ్ఛ, ఐకమత్యంతో కూడిన సమసమాజాన్ని కాంక్షించాడు.
1853లో వితంతు మహిళల అనాథ శిశువుల కోసం సేవాసదనం ప్రారంభించాడు. ఈతరహలో ఒక భారతీయ హిందువు ఒకసంస్థను ప్రారంభించడం అదే మొదటిసారి.
1968లో తన ఇంటి దగ్గరున్న స్నానాల తొట్టి వద్ద స్నానం చేసేందుకు అంటరాని వారికి కూడా అనుమతి ఇచ్చాడు.
1869లో ‘పౌరోహిత్యం యొక్క బండారం’ పుస్తక రచన చేశాడు. 1871 సత్యశోధక సమాజం తరపున ‘దీనబంధు’ వార పత్రిక ప్రారంభించాడు.
1880లో భారత ట్రేడ్ యూనియన్ ఉద్యమ పితామహుడు లొఖాండేతో కలసి రెైతులను, కార్మికులను సంఘటితం చేసేందుకు ప్రయత్నించాడు. 1873లో ‘గులాంగిరి’ (బానిసత్వం) పుస్తకం ప్రచురించాడు.దీనిలో బ్రాహ్మణీయ అమానుష సూత్రాలను, శూద్రులు- అతి శూద్రులపెై బ్రాహ్మణీయుల క్రూర వెైఖరిని ఫూలే తులనాత్మకంగా పరిశీలించాడు. సహపంక్తి భోజనానికి సంసిద్ధత ప్రకటించాడు.భారతదేశంలోని శూద్రాతి శూద్రులు దళిత బహుజన, ఆదివాసీ గిరిజన, ముస్లిం మైనార్టీలు బ్రాహ్మణీయ కుల వ్యవస్థలో బానిసలుగా ఉన్నారనీ, వీరు, అమెరికాలోని నల్లజాతి బానిసల్లాగా ఉన్నారని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ఫూలే. అందుకే బ్రాహ్మణీయ కుల వ్యవస్థలోని బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడడమొక్కటే మన ముందున్న ప్రథమ కర్తవ్యంగా ఫూలే ప్రకటించారు.
1883 కల్టివేటర్స్ విప్‌కార్డ్ (సేద్యగాడిపెై చెర్నకోల) పుస్తక రచన పూర్తిచేశాడు. ఏప్రిల్‌లో బొంబాయిలో జరిగిన ఒక సమావేశంలో పుస్తకాన్ని వినిపించాడు. 1885లో సత్యసారాంశం ప్రచురించాడు. ఇదే సయంలో ప్రచురితమైన తన హెచ్చరిక బుక్‌లెట్‌లో ప్రార్థనా సమాజం, బ్రహ్మసమాజం తదితర బ్రాహ్మణీయ సంస్థలమీద తీవ్ర విమర్శలు చేశాడు.
1891లో ఫూలే రచించిన ‘సార్వజనిక్ సత్యధర్మ పుస్తకం’ ఆయన మరణాంతరం ప్రచురితమైంది. ఇందులో చాతుర్వర్ణ వ్యవస్థను దుయ్యబట్టాడు.మధ్యపానాన్ని వ్యతిరేకించి,1888లో మున్సిపాలిటీ అధ్యక్షునికి మధ్యం షాపులను మూసి వేయవలసిందిగా ఉత్తరం వ్రాశాడు.
ఆయన వ్రాసిన 33 ఆర్టికల్స్ గల సార్వజనిక్ సత్యధర్మ పుస్తకంలో కుటుంబ సృష్టి నియమాల గురించి వివరిస్తూ ప్రపంచం మొత్తాన్ని ఒక కుటుంబంగా వ్యక్తీకరించాడు.
ప్రతి ఒక్కరికి సమాన స్వేచ్ఛ హక్కును తీర్మానించాడు. 1879 చివర్లో ‘దీనబంధు’ వారపత్రికను ముంబయిలో స్థాపించాడు. దీనిలో రెైతులు, కార్మికుల సమస్యలు, బాధలు వివరించేవాడు. శెత్కర్యాచ అస్సోడ్ పుస్తకం సామాజిక ప్రాముఖ్యం గలది.
భారతదేశంలో కులం గురించిన సిద్ధాంతాన్ని శాస్ర్తీయంగా రూపొందించిన తొలి దార్శనికుడు ఫూలే. దుర్మార్గమైన కులవ్యవస్థ సమూలంగా నిర్మూలన కావాలని ఆయన కోరుకున్నాడు. ఆయన ఆలోచనల, విశ్లేషణకి ‘గులాంగిరి’ అద్దం పడుతుంది. మనుషుల చుట్టూ బ్రాహ్మణులు చుట్టిన దాస్యపు సంకెళ్ళ నుండి వాళ్ళు విముక్తికావడం, తోటి శూద్రుల నిజపరిస్థితిని బహిర్గతం చేయడం, ఇవి ఏకాస్త విద్యనెైనా నేర్చిన శూద్రసహోదరుల కర్తవ్యాలు. ప్రతిగ్రామంలోనూ శూద్రులకు పాఠశాలలు కావాలి. కానీ వాటిలో బ్రాహ్మణ ఉపాధ్యాయులు మాత్రం వద్దన్నాడు.
దేశమనే దేహానికి శూద్రులు ప్రాణం, రక్తనాళాలలాంటి వాళ్ళు అని చెప్పాడు. మహాత్మాఫూలే ఆధునిక భారతదేశ సమాజంలో అందరికంటే గొప్ప శూద్రుడు.
దక్షిణాఫ్రికా జాతీయోద్యమ నాయకుడు నెల్సన్ మండేలా భారతదేశ పర్యటనకు వస్తున్న సందర్భంలో ఆ మహనీయునికి సమర్పించాలని నిర్ణయించు కొన్న గౌరవ కానుక మహాత్మ ఫూలే రచించిన మహత్తర గ్రంథం ‘గులాంగిరి’.
సమాజంలో వెనుకబడినవర్గాల ప్రజలు, మహిళల అభ్యున్నతికోసం చేసినకృషికి ఆయనకు ‘మహాత్మ’ బిరుదు ఇచ్చారు.
దీర్ఘకాల జబ్బుతో బాధపడుతూ నిరంతరం సమసమాజ స్థాపన కోసం పరితపించిన సమన్యాయ సత్యశోధకుడు మహాత్మ ఫూలే1890 నవంబరు 28న కన్నుమూశాడు.

Comments
Post a Comment