ఆత్మ

            
ఆదిమ సమాజంలో సహజ మరణాలు  దాదాపు లేవు.శత్రువుల చేతిలో ను జంతువుల బారిన పడే మనిషి మరణించేవాడు. పోరాటంలో గాయపడి సృహతప్పిన వాడికి   మరణించిన వాడికి పెద్దగా తేడా తెలిసేది కాదు. సృహతప్పిన మనిషి మళ్లీ మేలుకొనే వాడు‌.దాన్ని చూసి మరణించిన మనిషి కూడా తిరిగి మేల్కొంటాడని నమ్మకం ఏర్పడింది. ఇదే మనిషిలో ఏదో తెలియని ఒక అదృశ్య శక్తి ఉందనే ఒక నమ్మకం ఏర్పడడానికి కారణమయింది. అలాగే మనిషి నిద్రించే సమయంలో కలలు కంటుంటాడు .అప్పుడు కూడా మనిషి మరణించిన  వాని లాగా ఉంటాడు .
మనిషి నిద్రిస్తున్నప్పుడు శరీరంలోని ఒక అదృశ్య శక్తి  బయటికి వెళ్లి ఎక్కడెక్కడో తిరిగి మళ్ళీ నిద్ర లేవగానే శరీరం లోకి వస్తోంది అని భావించే వాళ్ళు. ఈ భావనే ఆత్మభావన కు దారి తీసింది. ఇదే మరణించిన తర్వాత కూడా జీవిస్తుంది అనే నమ్మకం  ఏర్పడింది .ఈ ఆత్మలు జీవిస్తూ ఉంటాయని, బయట తీరని కోరికలతో తిరుగుతుంటాయని, అప్పుడప్పుడు శరీరాకృతిని ధరిస్తాయని నమ్మకం ఏర్పడింది. క్రమంగా 
దీనినే దయ్యం అన్నారు.

               గ్రాంట్  అల్లెన్ (ఎవవల్యూషన్ ఆఫ్ ది ఐడియా                                           ఆఫ్ గాడ్)


            

Comments

Popular posts from this blog

మహాత్మా గాంధీ ఆచరణాత్మక తాత్విక చింతన

బాబాసాహెబ్ అంబేద్కర్‌ ఆధునిక తాత్విక చింతన

బౌద్ధం పునాదులపై లేచిన వైదిక ధర్మం