ఆవు పూజ్యమా ? భోజ్యమా?



            ఆవు (cow)

ఆవు (గోవు) పవిత్రమైన జంతువనడం, ఆవు మూత్రాన్ని తన్మయత్వంతో త్రాగడం మనకు కొత్తగాదు. 

“నబ్రహ్మణాం పరివదేత్, నగవాయ్ దండ ఉద్యచ్చేవ్' (బ్రాహ్మణులను తూలనాడరాదు. ఆవులను కొట్టరాదు)

అంటూ దైవం, బ్రాహ్మణులతో బాటు, ఆవును కూడా పూజించాలని ప్రాచీన ధర్మశాస్త్రాలలో చెప్పినారని చెపుతుంటారు.

కానీ అది వాస్తవం కాదని, వేద కాలం నుంచి అంటే క్రీ.పూ.1500 నుండి కూడా  గోమాంసం తీసుకునేవారని ప్రాచీన సాహిత్యం ద్వారా తెలుస్తోంది. 

1 - “ అధో అన్నం వాయ్ గోవా” –  "వాస్తవానికి గోవు మన ఆహారం “. – (ఐతరేయ బ్రాహ్మణం: - 111.9.8 ) 

2 - “ మాంసం లేకుండా మధువు ను తీసుకోవడం సాధ్యంకాదు “(ఆశ్వలాయన గృహ్య సూత్రం:1-4) 

3 - "పండితుడు , ప్రసిద్ధుడు , సామాజికుడు , శ్రోతలున్న వక్త , వేదపాటి , దీర్గాయుష్మంతుడు  అగు పుతున్ని కనాలన్న కోరికగల తల్లి, ఆబోతు లేదా ఎద్దు మాంసం నేతితో వండుకొని తినవలయును"  (బృహదారణ్యకం )

4 – “ వయస్సు లో వున్న దూడది కానీ , లేదా ముదురు వయస్సు లో వున్న ఎద్దుది కానీ భుజించాలి “  (శంకారాచార్యులు)

5 – “ నా శరీరం మాంసమై ఉన్నంత వరకు నేను లేత ఆవు మాంసం తింటాను “. 
 ( యజ్ఞావల్కుడు - శతపద బ్రాహ్మణం )

6- భరద్వాజుడు ఒక ఆవుదూడను వధించి రాముడిని బోజనానికి ఆహ్వానించాడు (రామాయణం) 

7- ఎన్ని యజ్ఞాలు , యాగాలు చేసినా మాంసం తిననివాడు రాబోయే ఇరవై జన్మలు జంతువుగానే పుడతాడు. ( మనుధర్మ శాస్త్రం - 35 వ సూక్తం )

8  ఇంట్లో ఎద్దు మాంసం తినొచ్చు , పాలు ఇచ్చే ఆవులను దూడలను బలి ఇవ్వచ్చు కానీ కటిక వానికి అమ్మకుడదు. ( కౌటిల్యుని అర్ధ శాస్త్రం ) 

9  ఉత్తర క్రియలలో ( దశదిన కర్మ లో) భాగం గా ఆవునో , ఎద్ధునో వధించి బ్రాహ్మణులకు విందు ఇచ్చేవారు. ( రుగ్వేదం 10 ,14 -1 ) 
 
10 – రంతి దేవుని వంట గదిలో ఆవును వధించి ధాన్యం తో పాటు మాంసం వడ్డించేవారు 
(అధర్వణ వేదం – 11.2 , 4 ) 
 
11 – ఇంద్రునికి , శివునికి గోవులు బలివ్వాలి , గర్భిని స్త్రీ లు ఎర్ర ఆవు మాంసం తింటే పండంటి బిడ్డ కు జన్మనిస్తారు. ( యాజ్ఞవల్క స్మృతి ) 
 
12 – ఒక విషయం ఆశ్చర్యం కలిగిస్తుంది, ప్రాచీన , ఆద్యాత్మిక గ్రంథాలూ , సనాతన బోధనల సారం ఇప్పటికీ విస్మయం కలిగిస్తుంది.గో మాంసం తిననివారు ఎన్నటికి నిజమైన హిందువు కానేరడు. ( వివేకానంద: ది కంప్లీట్ వర్క్స్ అఫ్ వివేకానంద, వాల్యూం నెంబర్ 3 పేజి 356 )

     ప్రాచీన వైద్యులు మాత్రం ఆవు పూజ్యత గురించి పట్టించుకోలేదు. కాని దాని భోజ్యత గురించి క్షుణ్ణంగా పరిశీలించారు. ఆవు మాంసంలో మాంసకృత్తులు ఎక్కువగా వుంటాయని అవి శరీరం పెరగడానికి ఉపయోగపడతాయని చెప్పారు. దీన్నే 'మాంసకార' అని అన్నారు. జబ్బుపడిన శరీరం కృశించి పోయిన వారికి, బాగా కష్టించినందున ఆకలి అయ్యే వారికి కండరపుష్టి మరల రావాలంటే ఆవు మాంసం తినడం శ్రేష్టం అని పేర్కొన్నారు.

'గవ్యంకేవల-హితేషుపీనాసె విషయ జరె
పుష్కశ్రమ అత్యగ్ని పులినక్షయహితమ్ కాతత్'

ఈ రకంగా 'పవిత్రమైన’ ఆవు మాంసం అత్యంత ఉపయోగకరమైనదని అన్న వైద్యులను, ప్రాచీన
కవులను, ఉపనిషత్కారులను,వేదకారులను ఇప్పటి ధర్మ ప్రవచనకారులు క్షమిస్తారంటారా?
పైన చర్చించిన విషయాలను బట్టి వేద కాలంలోనూ, ఆ తర్వాత గోవును పవిత్రమైందిగా భావించలేదు. ఆ కాలంలో గోవధ నైతికమైన, చట్టపరమైన అతిక్రమణ కింద పరిగణించలేదు. నిజానికి క్రీ.పూ. 1500 నుంచి క్రీ.పూ. 600 దాకా "భారత్" లో గోమాంస భక్షణ సర్వసాధారణం. చరిత్రలో ఈ భాగాన్ని చారిత్రక రచయితలు  మరుగున పడేశారు.

     దేశవాళి గోజాతుల్లోని కొన్నింటి విశేషాలు:

  1. కపిల: ఇది అరుదైన జాతి. కపిల రంగులో (నల్లగా) చూడ ముచ్చటగావుంటుంది.
  2. దయోని: అందమైన ఆకారం గల ఈ గోజాతి మహారాష్ట్రలోని లాతూర్ ప్రాంతంలో ఉన్నాయి.
  3. ఒంగోలు: ఈ జాతి ఆవులు ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రమే ఉండేవి.ఈ జాతి మనదేశం నుండి ఇతర దేశాలకు తీసుకువెళ్ళబడ్డాయి. ఈ జాతి ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. వీటి ఆంబోతులు రాజ ఠీవితో ఎంతో దర్పంగా వుంటాయి. అతి బారి శరీరంతో ఠీవిగా అందంగా తెల్లగా వుండే ఈ ఆవులు కొమ్ములు మాత్రం పొట్టిగ వుంటాయి. వీటి ధరలు లక్షల్లో వుంటుంది.
  4. పుంగనూరు జాతి: ఈ జాతి ఆవులుకూడ ఆంధ్ర ప్రదేశ్ చెందిన చిత్తూరు జిల్లా పుంగునూరు పట్టణానికి చెందినవి. అతి చిన్న ఆవులుగా ఇవి త్వరలో గిన్నిస్ బుక్ లో రికార్డు నామోదు కాబడనున్నది. వీటి ఎత్తు రెండున్నర అడుగులు మాత్రమే.
  5. గిర్ జాతి. ఈ జాతి గోవులు గుజరాత్ కు చెందినవి. ఇవి కూడా పాల ఉత్పత్తిలో మంచివే. ఇవి ఖరీదైనవి కూడ.
  6. షాహియత్: ఈ జాతి గోవులు రాజస్థాన్, గుజరాత్ లో ఎక్కువ వుంటాయి. వంపులు తిరిగిన పెద్ద పెద్ద కొమ్ములతో బలమైన ఆకారంతో ఇవి ఎంతో హుందాగా అందంగా వుంటాయి.
   ప్రస్తుతం  గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, కర్నాటక రాష్ట్రాలలో  గో వధ నిషేధ చట్టాలున్నాయి. ఒరిస్సా, అస్సాం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాలలో షరతులతో కూడిన నిషేధం ఉంది. ఈ రాష్ట్రాలలో పాలివ్వని, పని చేయడానికి పనికి రాని పశువులను మాత్రమే వధించడానికి అనుమతిస్తారు.Arunachal Pradesh, Kerala, Meghalaya, Mizoram and Nagaland and one Union Territory that is Lakshadweep  లలో గోవధ నిషేధ చట్టాలు లేవు.మిగతా రాష్ట్రాలలో చట్టాలున్నాయి. కేంద్రంలో ఎలాంటి చట్టం లేదు.

Comments

Popular posts from this blog

మహాత్మా గాంధీ ఆచరణాత్మక తాత్విక చింతన

బాబాసాహెబ్ అంబేద్కర్‌ ఆధునిక తాత్విక చింతన

బౌద్ధం పునాదులపై లేచిన వైదిక ధర్మం