దేవుని పుట్టుక


తొలిదశలో పాతిపెట్ట బడిన శవాలు తిరిగి లేచి వస్తాయని నమ్మేవారు. అలా జరక్కుండా వాళ్లు రాళ్లు  పాతేవారు. క్రమంగా మరణించిన  వారి ఆత్మలు రాళ్ల లోకి ప్రవేశిస్తాయని అందువల్ల ఆ రాళ్లు చాలా పవిత్రమైనవన్న భావన మొదలైంది.
         వేట దశ నుంచి వ్యవసాయానికి  మానవ సమాజం మారింది. శవాలను పాతిపెట్టడానికి భూమిని తవ్వి తిరిగి మట్టిని కప్పేవాళ్ళు. అనుకోకుండానే ఆ భూమిలో విత్తనాలు పడి మొలకెత్తడం తో మరణించిన వారి ఆత్మలకు ఉన్న శక్తి వల్లనే చెట్లు పెరుగుతున్నాయని భావించేవారు. 
          తర్వాత క్రమంగా ఆహార ధాన్యాలు పండించడం మొదలుపెట్టారు విత్తనాలు మొలకెత్తి సమృద్ధిగా పంటలు ఇచ్చే కార్యకలాపం వెనక ఒక దివ్యమైన శక్తి ఉందని నమ్మే వాళ్ళు. పంటలు బాగా పండాలంటే వర్షం కురవాలి అనే అవగాహన పెరిగింది. అలా వర్షం కురవడానికి కూడా 
 ఏదో ఒక శక్తి కారణం అనుకునేవాళ్ళు. ఈ విధంగా తమకు తెలియని ప్రకృతి ధర్మాల వెనుక ఒక శక్తి ఉందని ఆశక్తి ఒక్కో దేవుని గా భావించారు. ప్రాచీన  నాగరికత (3150 BC)కలిగిన ఈజిప్టు దేశంలో  మమ్మీలను పూజించేవారు. మమ్మీలను పూజించడం అంటే మరణించిన తమ ప్రాచీనులను పూజించే ఆచారం. ప్రాచీన తెగ సంప్రదాయంలో  నాయకుడు మరణించినప్పుడు వారి స్మారక చిహ్నాలు నిర్మించేవారు. వారే కాలక్రమంలో  దేవుళ్లు గా పరిణామం చెందారు. వీళ్లే తర్వాత దశలో స్థానిక దేవుడుగా ఆరాధింపబడుతున్నారు. ఉదాహరణకు  ఇజ్రాయేలీయులు ప్రాచీన కాలంలో బహుదేవతారాధన చేసేవారు. యెహోవా  దేవుడు కూడా ప్రాచీన తెగలలో ఒక తెగకు సంబంధించిన దేవుడి గా ఉంటాడు. కాలక్రమంలో  వివిధ దేవతల లో ఉండే గుణాలన్నీ ఒకే దేవుడు గా రూపు దాల్చినట్టుగా సమాజం  భావపరిణామం చెందింది. అలా చెందిన దేవుడే యెహోవా.
మరణం తర్వాత మిగిలేదేమీ లేదా అని ఆలోచించిన మానవుడు భూమిపై జీవించడానికి అవసరమైన వెలుతురు నీరు నిప్పు గాలి మొదలైన వాటిని ప్రసాదిస్తూ అప్పుడప్పుడు భయకంపితులను చేస్తున్న ప్రకృతి  శక్తులపై ఏదో ఒక అతీత శక్తి ఉందన్న భావన దేవుడి భావాన్ని కలిగించాయి. అన్ని భావాలు మాదిరిగానే దేవుడి భావం కూడా పరిణామం చెందుతూ వచ్చింది.
                 __గ్రాంట్ అల్లెన్
(ఎవల్యూషన్ ఆఫ్ ది ఐడియా ఆఫ్ గాడ్)
_____(సేకరణ :పిళ్ళా విజయ్)

Comments

Popular posts from this blog

మహాత్మా గాంధీ ఆచరణాత్మక తాత్విక చింతన

బాబాసాహెబ్ అంబేద్కర్‌ ఆధునిక తాత్విక చింతన

బౌద్ధం పునాదులపై లేచిన వైదిక ధర్మం