ప్రాచీన సాహిత్యంలో సృష్టి పరిణామవాదం
- Get link
- X
- Other Apps
ప్రాచీన సాహిత్యంలో సత్యాన్ని తెలసుకోవడానికి ప్రకృతి విషయాలను ప్రపంచ విషయాలను
ప్రత్యక్షంగా పరిశీలించడం ప్రారంభదశ అని భావించారు. దీన్నే ప్రత్యక్ష ప్రమాణం అన్నారు.
ప్రత్యక్ష పరిశీలన ద్వారా వచ్చిన సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా వస్తువు గురించి కొంత జ్ఞానం
ఏర్పడుతుంది. ఏ కారణం ఎటువంటి ఫలితాన్ని ఇస్తున్నదన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి.
అప్పుడు సూత్రీకరణ చేయమన్నారు. దీన్నే అసమాన ప్రమాణం” అని అన్నారు. ఈ సూత్రీకరణలు
వాటంతటవే సత్యాలు కాజాలవు. వీటిని ఆచరణలో చూసి రుజువైతే సత్యంగా అంగీకరించమని
చెప్పినారు. ఇది నేటి పరిశీలన, విశ్లేషణ, ప్రయోగం, సూత్రీకరణ పద్ధతులను పోలి ఉంది.
చరకుడు, అసితకేశ కంబరుడు, కణాదుడు మొదలైన భౌతికవాదులు మత గ్రంధాలలో
చెప్పిన వాటికన్నా భిన్నమైన అభిప్రాయాలు చెప్పినారు. ప్రధానంగా అవి;
(1) భూమి, నీరు, అగ్న్ని ఆకాశం, గాలి కలయికతో (పంచభూతాలతో) ప్రకృతి ఏర్పడింది.
(2) ఈ పదార్థాల విభిన్న కలయికల వల్లే ప్రకృతిలోని విభిన్న వస్తు జాలం ఏర్పడింది.
నిర్దీవదశనుండి సజీవదశకు, సజీవదశనుండి నిర్దీవదశకు నిరంతరం రూపాంతరం చెందుతాయి.
ఇది నేటి వస్తు నిత్యత్వ సూత్రాన్ని పోలివుంది.
(3) నిరంతరం మార్పు చెందే లక్షణం వాటిసహజ లక్షణం. నిప్పువేడిగా, నీరుచల్లగా
ఎట్లానో అట్లా మార్పుకూడా.
(4) ప్రకృతిలోని పంచభూతాలలో మనిషి తయారుచేయబడినాడు. దీనిని రసోత్పత్తి అన్నారు.
రసమంటే నిరంతర చలనం అని అర్థం. అగ్ని వలన ఆహారం రస గా మారుతుంది. ఈ
రసమరల రక్తం, మాంసం, కొవ్వు, మూలుగ, ఎముక, నీరులాగా మారుతుంది.
క్రీ.పూ. 1500లోని రుగ్వేదంలో 164వ సూక్తంలోని కవితల్లో దివి, పృథ్వి ఎవరు ముందు
పుట్టారు? ఎవరు తరువాత పుట్టారు? పృథ్వి నుంచి ప్రాణం ఎలాపుట్టింది? ఆత్మలు ఎక్క నుంచి
వచ్చాయి? భూమికి అంతం ఎక్కడ? లోకాలు ఎక్కడ నుంచి వచ్చాయి? అన్న (ప్రశ్నలు ప్రాచీన
మానవుడు వేసుకున్చాడు. ఆనాటికి విజ్ఞానం వికసించని దశలో సమాధానంగా అంతా దేవుడే
అన్న విశ్వాసంలోకి వెళ్ళిపోయినాడు.
క్రీ.పూ. 1000-600 మధ్య కాలంలో ఉపనిషత్తుల్లో బృహదారణ్యకోపనిషత్‌లో సృష్టిఎలా
జరిగిందో చెప్పినారు.
విశ్వమంతా శూన్యంగా ఉండేది. అందులో జీవంలేని ఆకలి మృత్యురూపంలో ఉండేది.
ఆకలి శరీరం కావాలనుకునింది. దాంతో బ్రహ్మ నీటిని సృష్టించినాడు. దాని నుండి నేలను
సృష్టించాడు. బ్రహ్మ తేజస్సు అగ్చిగా మారిపోయింది. ఇందులో మొదటి పదార్థం నీరుగా చెప్పినారు.
చాందోగ్యోపనిషత్( క్రీ.పూ 1000 _600) లో పదార్ధ వాదాన్ని జైవలి వివరిస్తాడు. శ్రద్ధను ఆహుతిస్తే దాని నుండి సోమం పుడుతుంది. హోమాన్ని ఆహుతిస్తే దాని నుంచి వర్షం పడుతుంది. వర్షాన్ని ఆహుతి ఇస్తే ధాన్యం పుడుతుంది ధాన్యాన్ని ఆహుతి ఇస్తే వీర్యం వస్తుంది. వీర్యాన్ని ఆహుతిస్తే గర్భం వస్తుంది. ఇలా ఐదు క్రియలు జరిగిన తర్వాతనే గర్భం వస్తుందని జైవలి రుషి చెపుతాడు. దీనినే గీతాకారుడు అన్నాద్భవంతి భూతాని అనే శ్లోకంలో వివరిస్తాడు.
పూర్తిగా భౌతిక వాదంతో చెప్పినాడు అసితకేశకంబరుడు. ఇతను బుద్ధునికి (క్రీ.పూ. 500)
ప సమకాలికుడు. ఇతను జీవం అనేది నీరు, నిప్పు, గాలి, మట్టి కలయికతో ఏర్పడిందన్చాడు. ఒక
జీవి మరణిస్తే ఆజీవిలోని నీరు నీటిలో, గాలి గాలిలో నిప్పు నిప్పులో మట్టి నేలలో కలిసిపోతుందన్నాడు.
స్వర్గం, నరకం, దేవతలు అంటూఏమీలేవు. ఉన్నవి ఈనాలుగే అని అన్నాడు.
ప్రకృతి కాత్సాయనుడు నీరు నిప్పు, గాలి నేలతోపాటు సుఖం, దుఃఖం, చైతన్యంల కలయికతో జీవం పుట్టిందన్నాడు.
క్రీ.పూ. 400 కపిలుడు సాంఖ్యదర్శనంలో “ప్రకృతి ముందువుంది. ఇప్పుడూ ఉంది.
భవిష్యత్తులో ఉంటుంది. అది నిత్యమైనది. ఈ సృష్టంతా దాని రూపాంతరాలే” నన్నాడు.
క్రీ.శ. 150లో కణాదుడు వైశేషిక దర్శనంలో ప్రతిపదార్థం పరమాణువు అనే చిన్న చిన్న
కణాలతో నిర్మితమైనదన్నాడు. పరమాణువులో చలనం ఉంటుందన్నాడు. ఇదే సృష్టికి మూలం
అన్నాడు. అణువుల సంయోగవియోగాల వల్ల పదార్థాలు ఏర్పడుతున్నాయన్నాడు. ఇవి నేడు
కనుగొన్న అనేక సైన్సు సత్యాలకు దగ్గరగా ఉన్నాయి. ప్రతి పదార్థంలో పరమాణువు ఉంటుంది.
పరమాణువులో న్యూక్లియన్ ఉంటుంది. న్యూక్లియస్ వెలుపల ఎలక్ట్రాన్లు చలిస్తుంటాయి. న్యూక్లియస్ లోపల ప్రొటాన్లు, న్యూట్రాన్లు చలిస్తుంటాయి. ప్రతి అణువు పరమాణువుల ద్వారా ఏర్పడి ఉంటుంది. అణువుల కలయికల వలనే పదార్థాలు ఏర్పడుతున్నాయి.
క్రీ.పూ.(568-483)లో బుద్ధుడు పదార్థం నిరంతరం మార్పు చెందుతూ ఉంటుందన్నాడు.
ప్రకృతి పరిణామ శీలమని మనకు నేడు తెలుసు. మార్పుకు లోనుకానిదేది లేదన్హాడు. మార్పువల్లనే
ఈ (ప్రపంచం నిలిచి ఉందన్నాడు. కార్యాకారణ సూత్రాన్ని ప్రతిపాదించాడు.
ప్రకృతి కాత్యాయనుడు బుద్ధుని సమకాలికుడు. ఇతని ప్రకారం ప్రకృతి అచంచలమైనదీ,
నిత్యమైనది. (ప్రకృతిని ఎవరూ సృష్టించలేదు, ఎవరిచేతా నిర్మింపబడలేదు, అది స్వయం సిద్ధం
అని చెప్పినాడు. (ప్రకృతి 7 తత్వాలుగా ఉందన్నాడు. పృథ్వీతత్వం, జంతు తత్వం, వాయుతత్త్వం,సుఖం, దు:ఖం, జీవితం. ఇవి ఒకదానికొకటి కారణం కావు. పరస్పరం హాని చేసుకోవు.
బుద్ధుని కాలంలోనే పాయసి అనే రాజు ఇహ పరలోకాలు లేవన్నాడు. చనిపోయినవారు
తిరిగిపుట్టరు. ఇంతవరకు చచ్చిన వాడెవుడూ తిరిగి వచ్చి పరలోకముందని చెప్పలేదు. ధర్మాత్ములు, ఆస్తికులు (దేవుని నమ్మేవారు) చావంటే భయపడుతున్నారు. నిజంగా మోక్షం ఉన్నదని నమ్మితే చావంటే వారికి భయమెందుకు? చనిపోయిన శరీరాలనుండి ఆత్మ వెళ్ళినట్లు గుర్తు ఎక్కడుంది? అని ప్రశ్నించాడు.
చార్వాకులు, లోకాయతులు కూడా సృష్టి పరిణామాన్ని చెప్పినారు. వాక్చాతుర్యం గలవారిని
చార్వాకులు అన్నారు. లోకమంతా విస్తరించినవారిని లోకాయతులు అన్నారు. వీరి ప్రకారం ఈ ప్రపంచం నిత్యం, సత్యం. ఈ ప్రపంచాన్ని గాని మానవున్ని గాని ఎవరూ సృష్టించలేదు. ప్రపంచం తనకు తానుగా ఆవిర్భవించింది.
జ్ఞానం పొందాలటే ఆచరణలో చూడాలన్నారు. ఆత్మ ప్రబోదం, అంతర్ దృష్టి వలన జ్ఞానం
రాదన్నారు. అగ్ని నీరు, భూమి, గాలి పదార్థానికి మూలం. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అచేతన
పదార్ధాలకు చెతన్యం వస్తుంది. ఆత్మ చైతన్యంతో ఉంటుంది. అది శరీరాన్ని విడిచి బయట విడిగా
ఉండలేదు. మనిషి మరణిచగానే శరీరం, ఆత్మ రెండూ నశిస్తాయని చెప్పినారు. ఇది నేడు ప్రాణం

ఎలా ఆవిర్భవించిందో చెప్పే దానికి దగ్గరగా ఉంది. నీటిలో కొన్ని వాయువులు ప్రత్యేక పరిస్థితుల్లో
కలిసినపుడు ప్రోటోష్లాజం ఏర్పడి ప్రాణం వచ్చిందని నేడు సైన్సు చెపుతోంది.
సృష్టిని గురించి ప్రాచీన సాహిత్యంలో రెండు రకాలు వాదనలు సాగినాయి. పైవాదనలు
ప్రజాసామాన్యంలో (ప్రచారంలో చాలా తక్కువగా ఉన్నాయి. కానీ పైవాదనలకు భిన్నంగా ఉన్నవన్నీ
మత సాహిత్యంలో భాగంగా ఉండి పోయినాయి. మొట్టమొదటగా హిందూమతంలో ఉన్న భావనలు
పరిశీలిద్దాము.
హిందూమతంలో ప్రారంభంలో విశ్వం ఓంకారం నుంచి జనించిందన్నారు. ఓంకారం
నుంచి ఆదిశక్తి పుట్టిందన్నారు. ఆదిశక్తి నుంచి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వచ్చారు. (బ్రహ్మ
సృష్టికర్త పాత్రను, విష్ణువు పాలననూ మహేశ్వరుడు లయకారకుని పాత్రను తీసుకున్చాడన్నారు.
బ్రహ్మ తన ముఖం నుంచి బ్రాహ్మణులను, భుజాల నుండి క్షత్రియులను, తొడలనుండి వైశ్యులను, కాళ్ళ నుండి శూద్రులను సృష్టించినట్లు చెప్పినారు. చండాలుర గురించి ఎక్కడా చెప్పలేదు. బ్రహ్మ ఆకాశాన్ని సృష్టించాడు. దాని నుండి జలం, జలం నుండి అగ్ని దాని నుండి వాయువు పుట్టించినాడు.అగ్ని వాయువుల కలయికతో భూమి ఏర్పడింది. ఈ విషయాన్నే శ్రీ కృష్ణుడు భగవద్గీతలో చెప్పినాడు. మరోచోట 'యాచ్ఛాపి సర్వభూతానాం బీజం' అనంటాడు. 'ఈ ప్రపంచం నా నుండి వచ్చింది .ఈ సృష్టికి ఆది నేను . మధ్యమం నేనే.అంతంనేనే.ఈ సృష్టి నాతోనే మొదలైంది .నాతోనే నడుస్తుంది. నాతోనే అంతమవుతుంది' అంటూ సృష్టికి మూలం తానేనని చెప్తాడు కృష్ణుడు.
బైబిల్ ప్రకారం దేవుడు ఒకరోజు ఆకాశాన్ని, మరోరోజు భూమిని, ఇలా సముద్రాన్ని, వృక్షాలను,
జంతువులను చివరిగా ఆడమ్, ఈవ్‌లను సృష్టించాడు. వారిని ఒక ఆపిల్ పండు తినొద్దని
చెప్పినాడు. కానీ వారు దేవుడు పంపిన దేవదూతల్లో ధిక్కార స్వరం వినిపించిన ఒకదేవదూత(దయ్యం) ఆ ఆపిల్‌ను తినమని చెపుతుంది. ఆడమ్, ఈవ్‌లు ఆపిల్ తినడంతో జ్ఞానం కలుగుతుంది.తాము దిగంబరులమని తెలుసుకుంటారు. వారి మధ్య సెక్సు కోరికలు ఏర్పడతాయి. వారికలయికతోమానవులు పుట్టుకొచ్చారు. ఇలా సృష్టి జరిగిందని క్రైస్తవ మతం చెపుతుంది.
ఇస్లాం మత (గ్రంథం ఖురాన్ (ప్రకారం సృష్టినంతా ఇల్లాహ్ ఎనిమిది రోజులలో చేశాడు.
ఆకాశాన్ని, భూమిని, తన రాజ్యపీఠాన్ని సృష్టించాక. సూర్యున్ని, చంద్రున్ని నక్షత్రాలను సృష్టించాడు.తరువాత మానవున్ని మట్టితో తయారుచేసి అతనిలో ఇల్లాహ్ తన ఆత్మను ఊదాడని రాసినారు.ఆమానవుని పక్కటెముక నుంచి ఒక స్త్రీని తయారుచేసి ఆమెకు కూడా తన ఆత్మను ఊదినాడు.ఇలా స్త్రీ పురుషులను దేవుడు సృష్టించాడని ఖురాన్ చెపుతుంది.
ప్రకృతిని విపరీతంగా పరిశీలించి, శోధించి చివరకు జీవజాతుల పుట్టుక (ఆరిజన్ ఆఫ్‌స్పీషీస్)ను ప్రపంచానికి అందించాడు. సృష్టికి సంబంధించిన అన్ని సిద్ధాంతాలను తోసేసి అదికొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. ఆ తరువాత జరిగిన అనేక పరిశోదనలు ఆయన సిద్ధాంతాన్నినిరూపించాయి. ఇప్పుడు అందరూ ఆమోదిస్తున్న రసాయనిక పరిణామ వాదం ప్రకారం ప్రకృతిలో ఉన్న కార్బన్, హైడ్రోజన్, ప్రాణవాయువు(ఆక్సిజన్), నైటోజన్ ఇవి అనేక విధాలుగాకలియడం వల్ల సేంద్రీయ పదార్థాలు వాతావరణంలో ఏర్పడి, అవి వానలతో పాటూ కలిసిసముద్రంలో చేరివుంటాయి. ఆ సేంద్రీయ పదార్థాలు తిరిగి అనేక విధాలుగా కలవడం వల్లసంకీర్ణమైన కొత్త పదార్థాలు ఏర్పడినాయి. అలా ఏర్పడిన క్రమంలో ఆల్టిహైడ్స్, కీటోన్స్,ఎమైనోయాసిడ్స్ మొదలైనవి ఏర్పడినాయి. జీవానికి కావలసిన ఎమైనోయాసిడ్లు(ప్రోటీన్లు) ఏర్పడటంతద్వార ప్రాథమిక జీవలక్షణాలను ప్రదర్శించే కణాలు ఏర్పడటం జరిగింది. దీనిని ఒపారిన్ అనేశాస్త్రవేత్త 1924లో సహేతుకంగా వివరించాడు. జీవానికి ప్రోటీన్ల వలెనే న్యూక్లియోటైడ్స్ కూడాచాలా అవసరం. న్యూక్లియోబైడ్స్ రకరకాలుగా చేరడం వల్ల డి.ఎన్.ఎ, ఆర్.ఎన్.ఎ మాలిక్యూల్స్‌ఏర్పడతాయి. ఇవి జీవుల వారనత్వాన్ని నిర్ణయిస్తాయి. ఇవి ఎలా ఏర్పడతాయోతెలుసుకోవడమేగాకుండా వాటిని కృత్రిమంగా ప్రయోగశాలలో సృష్టించారు. భారతీయ శాస్త్రవేత్తహరిగోవింద ఖురానా అమెరికాలో కృత్రిమ జీన్స్ సృష్టించాడు.ఈ రకంగా జీవం ఆవిర్భవించిందని శాస్త్రవేత్తలు కనుగొని ప్రపంచానికి సృష్టి ఎలా ఏర్పడిందోచెప్పడంలో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించారు.

Comments
Post a Comment