ప్రాచీన నమ్మకాలు వాస్తవాలు
భూమి చాప లాగా వుంటుందని దానిని చుట్ట వచ్చని బైబిల్ చెప్పింది.కాని భూమి బల్లపరుపు గా చాపలాగా కాకుండా గుండ్రంగా బంతి లాగా ఉందని పరిశోధనల వల్ల తేలింది.
భూమి,సూర్యచంద్రు లను గ్రహాలుగా లెక్కించారు మనదేశ ప్రాచీన శాస్త్రవేత్తలు.దానికి ఎల్లలు న్నాయని,వాస్తు శాస్త్రం చెబుతుంది. కానీ చంద్రుడు భూమి కి ఉపగ్రహమని తేలింది.
రాహువు , కేతువు భూమి ని మింగడానికి రావటం వల్ల గ్రహణాలు వస్తాయని మనదేశంలో ప్రాచీనులు చెప్పినారని నమ్ముతారు. కానీ భూమికి సూర్యుడికి మధ్యలో చంద్రుడు అడ్డుగా రావడం వలన గ్రహణాలు వస్తాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కానీ ఈ రోజుకూ సూర్య చంద్ర గ్రహణాలగురించీ వాటి పట్ల అపోహల గురించి ప్రచారం చేస్తూనే ఉన్నారు.
సూర్యుడు తూర్పున ఉదయిండం,అస్తమించడం వాస్తవంలో జరగదు.మనకు అలా కనిపిస్తుందంతే. కనిపించేదంతా నిజం కాదంటే ఇదే. భూభ్రమణం కారణంగా అలా కనిపిస్తుంది. అంతే.
మనిషి పుట్టుక,మరణం గురించి తెలియని రోజుల్లో
భగవంతుడు మనుషులను, ప్రకృతిని సృష్టించాడని భావించాడు.అవన్నీ ఆయామతాల్లో రకరకాలుగా చెప్పుకున్నారు.కానీ వివిధ పరిశోధనల తరువాత మనిషి పరిణామక్రమంలో
ఒకానొక కోతి జాతి నుండి వచ్చాడని నిర్థారణ అయ్యింది.
భూమి పుట్టి ఇప్పటికీ వేల సంవత్సరా లే అయిందని కొన్ని మతాలు చెప్పాయి. బైబిల్ మరియు ఖురాన్ లోని కథలని బట్టి భూమి క్రీ.పూ. 4004 లో పుట్టిందని ఒకప్పుడు మత పెద్దలు చెప్పారు. కాని భూమి పుట్టి ఇప్పటికి 450 కోట్ల సంవత్సరాలవుతోందని తేలింది.
విశ్వాన్ని భగవంతుడు సృష్టించాడని భావించారు ప్రాచీన కాలంలో.మనిషి సృష్టించిన అద్భుతాలలో అంత్యంత అద్భుతమైనది
దేవుడని నోబుల్ బహుమతి గ్రహీత చంద్రశేఖర్ అన్నాడు.
విశ్వం అనంతం అని, అది ఒక సూక్ష్మ అణువు మహా విస్పోటనం ద్వారా విశ్వం ఏర్పడిందని ఊహించారు.అది వాస్తవమని తరువాత పరిశోధనల్లో కనుగొన్నారు.విశ్వం ఏర్పడి13.7 బిలియన్ల సంవత్సరా లైందని తేలింది.
నోవా కాలం లో ప్రళయం రావడంతో భూమి
మునిగిపోతుందని మతం చెబుతుంది. మన మృత్స్య పురాణం లో కూడా ఇలాంటి కథ వుంది. బైబిల్ కూడా ఇలాంటి కథనాలుచెప్పింది. అన్ని కాలాల శిలాజాలాలను పరిశీలిస్తున్నా అంత పెద్ద ప్రళయానికి సంబంధించిన ఒక్క శిలాజం(fosil) కూడా ఇప్పటికీ దొరకలేదు. భవిష్యత్తులో భూమి అంతమయ్యే సూచనలు ఏమీ లేవని తెలుసు కున్నారు. 2000లో అంతం భూమి అవుతుందని వేదవ్యాస (ఐఎఎస్),రాసింది వాస్తవం కాదని తేలిపోయింది.2012లో బైబిల్ విశ్వాసుల ప్రకారం భూమి అంతం కాలేదు.
పిల్లలు ఎలా పుడతారో నేడు అందరికీ తెలుసు.ప్రాచీనగాథల్లో కేవలం కుండ నుంచి,యజ్ఞం నుంచి పుట్టినట్లు కథలు రాశారు.
యజ్ఞం జరిపేటప్పుడు ఎవరి బిడ్డ నో తన బిడ్డ లాగా ప్రకటించుకున్నారు. దానిని యజ్ఞం నుంచి పుట్టినట్లు కవులు రాశారు. అలాగే కుండను గుర్తుగా గల గుణానికి చెందిన పిల్లలను కుండ నుంచి పుట్టినట్లు కవులు రాశారు.
క్రీస్తు జన్మ కూడా ఇలాంటి పుక్కిటి పురాణమే. క్రీస్తు తల్లి మేరీకీ, జోసెఫ్ కు పెళ్లి నిశ్చితార్థం జరిగింది. ఆ తరువాతే మేరీ గర్భం దాలుస్తుంది. అలా వారిద్దరూ క్రీస్తు తల్లి దండ్రులయ్యారు. దీన్ని ఆనాటి రచయిత క్రీస్తు ను దేవుని ద్వారా పుట్టాడని చెప్పాడు.కర్ణుడు, హనుమంతులపుట్టుక కథలన్నీ ఇలాంటివాస్తవ దూర కథలే. అలాగే ఖురాన్ లో మనిషిని అల్లా సృష్టించాడని,ఆమనిషి పక్కటెముక నుంచి స్త్రీ ని సృష్టించాడని ఖురాన్ రచయిత రాశాడు. ఇవన్నీ వాస్తవం కాదని తేలింది.కానీ వాటినీ ఇప్పటికీ నమ్మేవారు ఉన్నారు.కాని అవన్నీ తప్పని అండం,వీర్యం ఫలదీకరణంచెందడం ద్వారా జీవం ఏర్పడుతుందని నిర్థారించారు.
భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతాడని , భూమి తర్వాతే సూర్యుడు పుట్టాడని ఖురాన్ చెపుతుంది. కాని ఇది తప్పని నేడు స్పష్టంగా తెలుసు. భూమి పైన సప్త ఆకాశాలు ఉన్నాయని(ఖురాన్ 23:17) , భూమి కింద కూడా ఏడు లోకాలున్నాయని (హిందూ పురాణాలూ) మతాలు చెపుతున్నాయి. కాని ఆకాశమంటూ ప్రత్యేకంగా ఏది లేదని అది శూన్యమని, సూర్యకిరణాల వక్రీభవనం వల్లనే అది నీలం రంగులో కనిపిస్తుందని నోబుల్ బహుమతి గ్రహీత సి.వి.రామన్ కనుగొన్నారు.అలాగే భూమి గోళాకారంగా ఉంటే దాని కింద ఏడు లోకాలు ఎలా వస్తాయి? భూగర్భంలో ఇప్పటి వరకు ఎలాంటి లోకాలున్నట్టు కనుక్కోలేదు.
భూమి కి ఆధారంగా స్తంబా లున్నాయని మతవిశ్వాసాలు చెప్పాయి. కానీ భూమి, విశ్వం లో గురుత్వాకర్షణ శక్తితో ఏ ఆధారం లేకుండా భ్రమణం చెందుతోందని కనుగొన్నారు.
అయినప్పటికీ భూమి నిలకడగా ఉంటుందని, భూమి ఒకప్పుడు సముద్రం లో తేలియాడేదని , ఇంకా,ఇలా ఎన్నో కల్పనలను , కథలను మతగ్రంథాలు చెబుతున్నాయి. వీటిని విశ్వాసం పేరుతో కొంతమంది ఈనాడు కూడా నమ్ముతున్నారు.
పిళ్లా కుమారస్వామి,9490122229
Comments
Post a Comment