వేదాలు ఎప్పటివి?
రుగ్వేదం క్రీ.పూ.2000-1500లో వచ్చింది.ఇది పూర్తిగా ఆర్యుల జీవన విధానం తెలియ జేస్తుంది.ఇందులో ఆనాటి ఆచార వ్యవహారాలు తెలుస్తాయి.ఈ కాలంలో ప్రజలు ఆహారసేకరణ దశలో ఉన్నారు. వారికి భాషకు లిపి లేదు. వ్యవసాయం చేయడం వారికి తెలీదు. ఆర్యులకు గుర్రాలు తోలడం తెలుసు. ఇది పూర్తిగా గణ సమాజం. విజ్ఞానం పూర్తిగా వికసించి దశ ఇది.
ఇనుము ను అప్పటికింకా కొనుక్కోలేదు.
అధర్వణ వేదంలో అనారోగ్యలకు మంత్రాలు ఉన్నాయి. ఇది క్రీస్తుపూర్వం 1200 లో వచ్చిందన్నారు పరిశోధకులు. ఆరోగ్యాన్ని గురించి అశ్వినీ గణం చూసేది. అందువల్ల ఆరోగ్య దేవతలుగా వారిని కీర్తించారు. తరువాత కాలంలో ఆ దేవతలను పక్కన పెట్టేశారు. ఉదాహరణకు మంత్రాలకు అర్థం చూస్తే
రుగ్వేదాన్నిగానం చేసే విధానాన్ని సామవేదం లో పొందుపరిచారు. ఇది క్రీస్తు పూర్వం 1100 వచ్చింది.
యజుర్వేదం క్రీ.పూ. 1000-600 లో వచ్చింది.
ఇందులో యజ్ఞయాగాదుల విధానాలను చెప్పి నారు. దీనిపై శతపథ బ్రాహ్మణంలో వ్యాఖ్యానం చెప్పినారు.
వీటన్నింటిపై వ్యాఖ్యానంగా బ్రాహ్మణాలు
అరణ్యకాలు ఉపనిషత్తులు వచ్చాయి. బ్రాహ్మణా లు 1000-700 మధ్యలో అరణ్యకాలు 800-600 మధ్యలో ఉపనిషత్తులు క్రీస్తు పూర్వం 1000-500 మధ్యలో వచ్చాయని చరిత్రకారులు భావిస్తున్నారు
ఇవన్నీ మొదట సంభాషణ రూపంలో వచ నంలో ఉండేవి. తర్వాత క్రీస్తు పూర్వం 500 నాటికి కవితా రూపంలోకి వచ్చినాయి.
Comments
Post a Comment