మాతృస్వామిక సమాజం
గణ సమాజం వ్యవసాయక సమాజంగా మారడంతో స్థిర జీవితం ప్రారంభమైంది. కొన్ని
గణాలు దగ్గరగా స్థిరపడి తెగలుగా పరిణమించాయి. తెగలోని వారందరికీ ఒకే భాష ఒకే ఆచారం ఏర్పడ్డాయి. తెగలోని వారి మధ్య వచ్చే తగవులు తీర్చడానికి తెగకు ఒక పెద్దల సమితి నాయకత్వం వహించేది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆ నాయకులందరూ కూర్చునేవారు. పెద్దల సమితిలో పురుషులకు స్త్రీలకు మధ్య తేడా ఏమీ లేదు. స్త్రీలు సంతానాన్ని కనడం ,పెంచడం వ్యవసాయం చేతివృత్తుల్లో స్త్రీల పాత్ర అధికంగా ఉండేది. వీరు ఎవరి కెంత ఆహారం కావాలో అంతే ఇచ్చేవారు. దీనిని ఆదిమ సోషలిస్టు సమాజం అన్నారు. మహాభారతం కథలో కుంతి తన పిల్లలకు అలాగే ఆహారాన్ని పంచుతుంది.
వ్యవసాయం ప్రారంభించింది స్త్రీలే .ఆహారం కోసం గింజలు సేకరించే పనిని స్త్రీలు చేసేవారు. మెత్తటి నెలలో గింజలు పడితే అవి మొలకెత్తి మొక్కలుగా మారి ఎన్నో గింజలు ఇస్తాయని తెలుసుకున్నారు. నేలను తవ్వి గింజలు నాటడం ప్రారంభించారు .తవ్వడం కోసం కొయ్యనాగలిని కనుగొన్నారు. చెట్లు నరకడానికి గొడ్డలి, కోయడానికి కొడవలి ,రాళ్ళతో తయారు చేసేవారు .కుండలు చేయడం , పీచు నుండి తర్వాత కాలంలో పత్తి నుండి నూలు తయారుచేయడం, నూలు బట్టలు నేయడం నేర్చుకున్నారు . బుట్టలు అల్లడం కూడా నేర్చుకున్నారు. వీటన్నిటిలోనూ స్త్రీలదే ప్రధాన పాత్ర.దాంతో వారికి సహజంగానే నాయకత్వంలో కూడా స్థానం లభించింది. అంతేగాక తొలిదశలో స్త్రీ పురుష సంబంధాలలో స్వేచ్ఛ ఉండింది.ఆ పరిస్థితిలో ఏర్పడిన తొలి కుటుంబ రూపం రక్తసంబంధీకుల కుటుంబం.
తర్వాత కాలంలో దీని పై నిషేధం విధించబడింది. వేరువేరు తరాల స్త్రీ పురుషుల మధ్య వివాహ సంబంధం నిషిద్ధమైంది తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య వివాహ బంధం నిషేధింపబడినది ఈ కుటుంబ రూపాన్ని ఫ్యూనలాన్ కుటుంబం అంటారు. ఈ నిషే ధానికి తోడు ఒకే తరానికి చెందిన వారిలో తోడబుట్టిన వారి మధ్య వివాహబంధం నిషేధింపబడినది.రుగ్వేదంలో అన్నా చెల్లెలు అయిన యమ, యమి ల మధ్య దీనిపై చర్చ జరుగుతుంది. పై రెండు రకాల కుటుంబ రూపాలు గుంపు పెళ్లి రూపాలు అందువలన బిడ్డను తల్లి వైపు నుండి గుర్తించేవారు.ఆ దశలో ఆ సమాజాలు అనేకం మాతృస్వామిక సమాజాలుగా ఉండేవి. మాతృస్వామిక సమాజంలో ఇంటి పేరు తల్లి వైపు నుంచే ఉండేది. ఉదాహరణకు గౌతముడు(బుద్ధుడు),మౌర్య చంద్రగుప్తుడు, గౌతమీపుత్ర శాతకర్ణి మొదలైనవారు.
ప్రతి గణానికి ఒక ఆది మాత ఉండేది. ఆదిమాతకు కూతుర్లు కొడుకులు ఉంటారు. కూతుర్లకు పుట్టిన సంతానమే గణంలోని సభ్యులు. కొడుకుల వల్ల కలిగిన సంతానం వేరొక గణంలోని స్త్రీల సంతానం .అందువల్ల ఆ సంతానం వేరొక గణం కిందకు వస్తారు . గణానికి ప్రత్యేకమైన పేరు ఉండేది. గణానికి ఉమ్మడి ఆస్తి ఉండేది. గణంలోని స్త్రీ పురుషుల మధ్య వివాహ బంధం నిషేధింపబడింది. దాంతో ఒక గణం ఇంకో గణంతో సంబంధం కలిగి ఉండాల్సిన అవసరం ఏర్పడింది .ఆ రకంగా కొన్ని గణాలు కలిసి తెగగా మారాయి.
పనిముట్లు అభివృద్ధి చెందని దశలో ఉత్పత్తి తక్కువగా ఉండేది. అంటే సమాజంలో సంపద తక్కువగా ఉంటుంది ఆ దశలో స్త్రీ పురుష సంబంధాల ప్రాబల్యం అధికంగా ఉన్నట్లు కనబడుతుంది.
వ్యవసాయం చేయడానికి ప్రారంభంలో రాతి పనిముట్లు ఉపయోగించేవారు. ఆ తర్వాత నాగలిని కనుగొన్నారు. నాగలితో ఎక్కువ భూమిని సులభంగా సాగు చేయ గలిగారు. భూమి ఉమ్మడి ఆస్తిగా ఉండేది.
మనదేశానికి సంబంధించిన సింధు సమాజంలో కుల వ్యవస్థ కనిపించదు. వర్గ బేధాలు మాత్రమే ఉన్నాయి. సమాజంలో స్త్రీలకు ఉన్నత స్థానం ఉన్నట్లుగా అసంఖ్యాకంగా లభించిన మాతృ మూర్తి విగ్రహాల వల్ల తెలుస్తుంది. వీరిది మాతృస్వామిక వ్యవస్థ అని కొందరి అభిప్రాయం.
ఆనాటి మాతృస్వామిక తెగల్లో కన్యాశుల్కం అనే సంప్రదాయం ఉండేది. అందులో పెళ్ళి కూతురు తల్లికే పెళ్ళి కొడుకు డబ్బులు ఇవ్వాల్సి వచ్చేది.
సిందూ సమాజంలోనే కాక ఇతర సమాజాలలో కూడా గోచరిస్తుంది. ఉదాహరణకు అట్లాంటిన్ నుండి మిసిసిపి వరకు, సెయింట్ లారెన్స్ నుండి కుంబర్ ల్యాండ్ వరకు స్త్రీలు కుటుంబంలోను, సమాజంలోను పురుషులతో సమానస్థానాన్ని పొందియున్నారు. సుమిత్రా దీవులలో స్త్రీలదే ఆధిపత్యము. ‘టైమోర్ ల్యూట్’ దీనిలో భార్యను కొట్టినపుడు భర్తను శిక్షించేవారు. అదే భార్య భర్తను కొట్టినప్పటికి శిక్ష ఉండేది కాదు. అయితే వేదాల్లో, ప్రాచీన ఈజిప్టు నాగరికతలో స్త్రీకి ఎంతో విలువ ఉండేది.
కానీ మనదేశంలో సింధూ సమాజం తరువాత వచ్చిన వైదిక సమాజంలో చాతుర్వర్ణ వ్యవస్థ ఉంది. శూద్రులతోపాటు స్త్రీలకు సామాజిక గౌరవం లేదు. మలి వేద కాలంలో అనేక దురాచారాలు వచ్చి చేరాయి. ఆర్యులది పితృస్వామిక వ్యవస్థ.
వీరు పితృస్వామిక స్వభావం కలిగి ఉండటమే దీనికి కారణం.
వేదకాలంలో పురుషులతో సమానంగా, అవకాశాలను హక్కులను స్త్రీ చూరగొన్నది. స్త్రీపట్ల, వివక్షత చూడలేదు. వేదకాలంలో స్త్రీకి పురుషునితో పాటుగా సమాన విద్యావకాశాలు ఉండేవి. వేదాలు అభ్యసించడానికి వారికి అనుమతి ఉండేది. ఉపనయన సంస్కారం ద్వారా, విద్యార్జనకు ప్రవేశం, బ్రహ్మచర్యాశ్రమానికి పురుషులకువలెనే స్త్రీలకు కూడా అవకాశం ఉండేది. వైవాహిక జీవనసాఫల్యానికి స్త్రీకి విద్య అవసరమని, విద్యా సంబంధ, మతపర కార్యాలలో, జంతుబలి కార్యాలలో స్త్రీ లు పాల్గొనేవారు. స్త్రీలు సాహిత్యరంగాలలో కూడా వారి విద్యా ప్రతిభా పాటవాలను ప్రదర్శించారు. వైదికయుగంలోని విశ్వసర, ఘోష , లోపాముద్ర, నికత, నివాసరి అనే స్త్రీలు ఆనాటి పురుషులతో సమానంగా వ్యవహారించినట్లు తెలుస్తోంది. స్త్రీ విద్యా వ్యాసంగాలతో పాటు యుద్దకళలను అభ్యసించే వారు.
వైదిక సామాజం ప్రారంభంలో స్త్రీకి వివాహవిషయంలో సంపూర్ణ స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు ఉండేది. ఆమె అభీష్టం మేరకే వివాహం జరిగేది. ఒక మతపరమైన సామాజికధర్మంగా ఉన్నప్పటికి స్త్రీపట్ల ఎలాంటి నిర్బంధం ఉండేది కాదు. వివాహ వయోపరిమితి విషయంలో ఎలాంటి ఆంక్షలు ఉండేవి కావు. పైగా ఆ కాలంలో గాంధర్వ వివాహాలకు అవకాశం ఉండేది.మతపరమైన కార్యక్రమాలలో తన భర్తతో స్త్రీ పాలుపంచుకొనేది. మత, కుటుంబపరమైన ధర్మప్రకార్యాలలో భర్తతోపాటు స్త్రీ తన విద్యుక్తధర్మాలను నిర్వరించేది. పూజ సంస్కారాది విషయాలలో, బలిదాన నిర్వహణలలో పాల్గొనడానికి భార్యలేని పురుషునికి అర్హతలు ఉండేవికావు. వేదొక్తులనుసరించి భార్యభర్తలిద్దరికి ఆస్తి విషయంలో ఉమ్మడి యాజమాన్యపు హక్కులుండేవి. బృహదారణ్యకోపనిషత్తులో యజ్ఞవల్కుని భార్యలిరువురికి ఆస్తిని సమానంగా పంచి ఇచ్చినట్లుగా చెప్పబడుతుంది. వేదకాలంలో స్త్రీకి ఉన్నతమైన అంతస్తు ఇవ్వబడింది. వారికి ఆస్తిహక్కు వారసత్వంగా లభ్యమయ్యేది. మత విధులలో, బలిదాన కార్యక్రమాలలో స్త్రీలు పాల్గొనేవారు. రాచరిక మహాసభలలో, సమావేశాలలో స్త్రీలు కూడా హాజరు అయ్యేవారు.
స్త్రీపురుషుడికి అన్నివేళలో మార్గదర్శిగా, ఆపద సమయంలో సలహాదారునిగా-చేయూతనిస్తూ, సర్వసుఖాలను అందిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఉన్నత అంతస్తును సంతరించుకున్నది.
వైదిక సామాజం ప్రారంభంలో స్త్రీకి వివాహవిషయంలో సంపూర్ణ స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు ఉండేది. ఆమె అభీష్టం మేరకే వివాహం జరిగేది. ఒక మతపరమైన సామాజికధర్మంగా ఉన్నప్పటికి స్త్రీపట్ల ఎలాంటి నిర్బంధం ఉండేది కాదు. వివాహ వయోపరిమితి విషయంలో ఎలాంటి ఆంక్షలు ఉండేవి కావు. పైగా ఆ కాలంలో గాంధర్వ వివాహాలకు అవకాశం ఉండేది.మతపరమైన కార్యక్రమాలలో తన భర్తతో స్త్రీ పాలుపంచుకొనేది. మత, కుటుంబపరమైన ధర్మప్రకార్యాలలో భర్తతోపాటు స్త్రీ తన విద్యుక్తధర్మాలను నిర్వరించేది. పూజ సంస్కారాది విషయాలలో, బలిదాన నిర్వహణలలో పాల్గొనడానికి భార్యలేని పురుషునికి అర్హతలు ఉండేవికావు. వేదొక్తులనుసరించి భార్యభర్తలిద్దరికి ఆస్తి విషయంలో ఉమ్మడి యాజమాన్యపు హక్కులుండేవి. బృహదారణ్యకోపనిషత్తులో యజ్ఞవల్కుని భార్యలిరువురికి ఆస్తిని సమానంగా పంచి ఇచ్చినట్లుగా చెప్పబడుతుంది. వేదకాలంలో స్త్రీకి ఉన్నతమైన అంతస్తు ఇవ్వబడింది. వారికి ఆస్తిహక్కు వారసత్వంగా లభ్యమయ్యేది. మత విధులలో, బలిదాన కార్యక్రమాలలో స్త్రీలు పాల్గొనేవారు. రాచరిక మహాసభలలో, సమావేశాలలో స్త్రీలు కూడా హాజరు అయ్యేవారు.
స్త్రీపురుషుడికి అన్నివేళలో మార్గదర్శిగా, ఆపద సమయంలో సలహాదారునిగా-చేయూతనిస్తూ, సర్వసుఖాలను అందిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఉన్నత అంతస్తును సంతరించుకున్నది.
వేద నాగరికత కాలం తరువాత చిన్నచిన్న తెగలు(గణ రాజ్యాలు) అంతరించిపోయి జనపదాలు గా మారాయి. జనపదాలు కలిసి రాచరిక రాజ్యాలు ఏర్పడ్డాయి. విశాల రాజ్య నిర్మాణంతో పాటు రాజుల అధికారాలు కూడా పెరిగాయి. ఆర్యుల్లోని ప్రధాన తెగలైన భరతులు, పురులు కలిసిపోయి ‘కురు’ తెగగా రూపాంతరం చెందారు. తరవాత వీరు పాంచాల దేశంతో కలసి కురు- పాంచాలులుగా మారారు. ఈ దశలో కురు, పాంచాల, కాశీ, కోసల, విదేహ, అంగ, మగధ రాజ్యాలు ఆవిర్భవించాయి. బ్రహ్మావర్త దేశం పెరిగి బ్రహ్మర్షి మండలంగా పరిణమించి ఆ తరవాత ఆర్యావర్తంగా రూపొందింది.
ఆర్యావర్త సమాజం(మలి వేదకాలం)లో స్త్రీ అంతస్తు కొంతమేరకు సన్నగిల్లింది. సంతానంలో మగవారికి ఎక్కువ విలువలు ఇస్తూ వారి అంతస్తునే ఉన్నతంగా పరిగణించారు. ఈ నేపథ్యంలో స్త్రీ అంతస్తును క్రమంగా కింది స్థాయికి గురిచేశారు. తండ్రి మరణ సంస్కారాలలో జరిపే పిండప్రదాన కార్యంలో కుమారుడే నిర్వహించాలనే నియమం బలీయంగా ఉంది. దాంతో స్త్రీ ప్రాధాన్యత కోల్పోయింది.అందువల్ల సమాజంలో స్త్రీ అంతస్తు తగ్గింది.పైగా ఆస్తి పంపకంలో స్త్రీ లకు హక్కు లేకుండా చేశారు.
వైదిక సామాజంలో కుమారులు లేని తండ్రికి మరణానంతరం నరకం ప్రాప్తిస్తుందనే బలీయమైన విశ్వాసం ఏర్పరచారు. దాంతో మగసంతానం లేకుంటే మరొకరిని దత్తత తీసుకొని కర్మకాండ, సంస్కారాలు జరిపించేవారు.
వైదిక సామాజంలో కుమారులు లేని తండ్రికి మరణానంతరం నరకం ప్రాప్తిస్తుందనే బలీయమైన విశ్వాసం ఏర్పరచారు. దాంతో మగసంతానం లేకుంటే మరొకరిని దత్తత తీసుకొని కర్మకాండ, సంస్కారాలు జరిపించేవారు.
మళ్లీ జన్మ లేకుండా చేసే ‘మోక్షం' కొడుకు తలకొరివితోనే వస్తుందన్న ప్రచారం తో స్త్రీలు నిర్లక్ష్యానికి గురయ్యారు.వారు పురుషులకంటే తక్కువనే భావన క్రమంగా ప్రచారం చేసింది పండిత వర్గం. ఈ క్రమంలోనే స్త్రీ అంతస్తును తగ్గించే అనేకమైన ప్రతిపాదనలు పెరుగుతూ వచ్చాయి. దాంతో స్త్రీలను బలహీనులుగా, చపలచిత్తులుగా, కూపస్థమండూక స్వభావులుగా చిత్రీకరించారు.
మనువు-వాత్సాయనుడు లాంటి మహానుభావులు ఒకవైపు స్త్రీని మహాశక్తి స్వరూపిణిగా అభివర్ణిస్తూనే మరోవైపు ఆ మహోన్నత లక్షణాన్ని కించపరుస్తూ వారి ఉన్నత స్థానాన్ని నీచ-నికృష్టమైన స్థాయికి పదిలంగా దిగజార్చారు. ఈ పరిణామక్రమంలో స్త్రీని మతాచారాలు, ధర్మసూత్రాల పేరిట, పవిత్రత మాటున, సాంప్రదాయాల చాటున స్త్రీ స్వేచ్ఛను బలిచేస్తూ వచ్చారు.
స్త్రీలకు ఆస్తిలో హక్కులేదు. బహు భార్యత్వం సర్వసాధారణమైంది. బాల్య వివాహాలు ప్రారంభమయ్యాయి. సతీ సహగమన ఆచారం చోటుచేసుకుంది. ప్రజాసభల్లో ముఖ్యంగా సమితిలో స్త్రీ లకు సభ్యత్వం లేకుండా చేశారు . మొత్తమ్మీద స్త్రీ అన్ని రంగాల్లో తన ఉనికిని, స్థానాన్ని కోల్పోయి గృహానికే పరిమితమైంది.
కానీ భారత దేశంలో కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ మేఘాలయలోని ఖాసీ తెగల్లో, కేరళలోని నాయర్ సమూహంలో మాతృస్వామిక వ్యవస్థ కనిపిస్తుంది.
ప్రస్తుతం పరిస్థితులు మారాయి.నేటి సమాజంలో ముఖ్యంగా, పారిశ్రామికీకరణ, నగరీకరణ వల్ల మహిళలు రకరకాల వృత్తుల్లో ప్రవేశిస్తున్నారు. ఆర్థికంగా స్వేచ్ఛ లభించింది. సామాజికంగా, ఆర్థికంగా మహిళా సాధికారికత కారణంగా మహిళల చాలాసామాజిక, ఆర్థిక స్థితిగతుల్లో మార్పులొచ్చాయి.కేరళలోని మొత్తం శ్రామిక శక్తిలో మహిళా కార్మికుల శాతం కేవలం 24.8 శాతం మాత్రమే. అదే విద్య విషయానికి వస్తే, ఇక్కడ 92 శాతం మంది మహిళలు విద్యా వంతులు.ఈ విషయంలో కేరళ మొదటిస్థానంలో ఉంది.
సామాజిక శాస్త్రవేత్తలు వంశానుక్రమాన్ని బట్టి కూడా కుటుంబాన్ని 3 రకాలుగా విభజించారు.
1.తల్లి ద్వారా గుర్తించిన వంశాలు మాతృవంశీయ కుటుంబాలు. అంటే తల్లిని మూలజననిగా భావించినట్లయితే అలాంటి కుటుంబాన్ని మాతృవంశీయ కుటుంబం అంటారు.
2. తండ్రి ద్వారా గుర్తించినవైతే పితృవంశీయ కుటుంబాలు.
3. పై రెండూ కాకుండా ఇద్దరి నుంచీ వంశానుక్రమాన్ని గుర్తిస్తే దాన్ని పితృమాతృ వంశీయ కుటుంబం అంటారు. ఇవి చాలా అరుదుగా కనిపిస్తాయి. కొన్ని గిరిజన సమాజాల్లో మాత్రమే ఇలాంటివి ఉన్నట్లు సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
వివాహానంతరం దంపతుల నివాసాన్ని బట్టి కుటుంబాలను 5 రకాలుగా పేర్కొన్నారు. అవి..
1. పితృస్థానిక కుటుంబం:
వివాహం తర్వాత భార్యాభర్తలు భర్త తల్లిదండ్రులతో కలసి జీవించడం
2. మాతృస్థానిక కుటుంబం:
వివాహానంతరం భార్యాభర్తలు భార్య తల్లిదండ్రులతో కలసి జీవించడం.
3. ద్విస్థానిక కుటుంబం:
వివాహానంతరం భార్యభార్తలు వారిరువురి తల్లిదండ్రులతో కలసి జీవించడం.
4. మాతుల స్థానిక కుటుంబం:
వివాహానంతరం భర్త తన భార్యతో కలసి తల్లిసోదరుడి అంటే మేనమామ ఇంట్లో నివసించడం. ఇది కొన్ని గిరిజన తెగల్లో కనిపిస్తుంది.
5. నూతన స్థానిక కుటుంబం:
వివాహానంతరం భార్యభర్తలు కొత్తగా తమదైన కాపురాన్ని ఏర్పాటు చేసుకోవడం. ఇలాంటివి నగర సమాజాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. స్వతంత్రంగా జీవించాలనే భావన నేటితరం ఎక్కువగా ఉంటుంది యువతీయువకుల్లో కాబట్టి ఇలాంటి ఏర్పడుతున్నాయి.
Comments
Post a Comment