ఇస్లాం మతం-తాత్విక భావనలు
అరేబియన్ ఎడారిలో ని మక్కా అనే చిన్న పట్టణంలో మహమ్మద్ 570 సంవత్సరంలో పుట్టాడు. భర్తను పోగొట్టుకున్న ఒక ధనిక స్త్రీని పెళ్ళాడాడు. 40 ఏళ్ళ వయసులో అతనికి భగవంతుని సంబంధించిన ఆలోచనలు ప్రారంభమయ్యాయి.
అల్లా ఒక్కడే దేవుడు.ఆయన పంపిన ప్రవక్తను నేనని ప్రకటించుకున్నాడు మహమ్మద్. అబ్రహం, మోజస్, జీసస్ లాంటి ప్రవక్త ల లాగా మహమ్మద్ చివరివాడు. మక్కాలో కాబా అనే నల్లరాతి ముస్లిమేతర దేవాలయం చాలా కాలంగా ఉండేది .అందులో దాదాపు 360 విగ్రహాలుండేవి. అరేబియా లోని అన్ని ప్రాంతాల నుంచి యాత్రికులు ఆ దేవాలయానికి వచ్చేవారు. మహమ్మద్ దానికి వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభించాడు. దాంతో స్థానికులు అతని మీద దాడి చేశారు.
అందువలన ఆయన అక్కడికి 150 మైళ్ళ దూరంలో ఉన్న మదీనా పట్టణానికి పారిపోయాడు. అక్కడ ఆయన ప్రవచనాలను అక్కడి ప్రజలు శ్రద్ధగా విన్నారు. మెల్లగా మదీనా మొదటి ముస్లిం రాజ్యం గా అవతరించింది. మొట్టమొదటి మసీదు ఒకటి అక్కడే నిర్మించబడింది .పదివేల సైన్యాన్ని సమీకరించుకొని మక్కా మీద దాడి చేశాడు. మక్కా మహమ్మదుకు దాసోహం అయింది. కాబా లోని విగ్రహాలు ధ్వంసం చేయబడ్డాయి. కానీ తెలివిగా అతను ఆ దేవాలయంలో వున్న నల్లరాతినిమాత్రం పడగొట్టలేదు. దాన్ని ముస్లిం యాత్రాస్థలంగా మార్చాడు. ఈనాటికీ ఆ సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది.
క్రైస్తవ మతం లాగా ఇస్లాం కూడా ఇంతకు ముందు మతాల సంప్రదాయాలను తనలో కలుపుకుంది క్రైస్తవ మత సంప్రదాయం మాత్రమే కాదు స్థానిక ముస్లింలు, ఇతర మతాలు సంప్రదాయాలన్నింటిని ఇలా కలిపేసుకున్నవే. మక్కాలో ఒక రాయి ఉంది. ఆ రాతి మీద ఒక మహా దేవత సంకేతం చిత్రించబడి ఉంది. ఆ దేవతను ఆరాధించే మతం ఈ కొత్త మతాలు రావటానికి కొన్ని వేల సంవత్సరాల పూర్వం నుంచి ఉండేది. అది ఇస్లాంలో కలిసి పోయింది.
అరేబియాలో ఇస్లాంకు పూర్వ కాలంలో స్త్రీలకు తమ భర్తల్ని తామే ఎన్నుకునే అధికారం ఉండేది. అంతేకాకుండా వారు బహుభర్తృత్వాన్ని అనుసరించేవారు. స్త్రీ గర్భంతో ఉన్నప్పుడు తన భర్తలో ఎవరిని పుట్టబోయే పాపకు తండ్రిగా ఎన్నుకోవాలో నిర్ణయించుకునేది.మహమ్మద్ దీన్ని పూర్తిగా మార్చి వేశాడు. లైంగికంగా పురుషునికి ఆధిపత్యాన్ని ఇచ్చాడు.
బహుభార్యత్వాన్ని అనుసరించే హక్కును ప్రవేశపెట్టాడు. ముస్లిం జ్ఞానులలో ఒకనిగా పేరు గాంచిన గజాలీ 1000 పాళ్ల ప్రతిభలో పురుషులకు 999 పాళ్ళు స్త్రీలకు మాత్రం కేవలం ఒక పాలు ఉంటాయని ప్రకటించాడు.
సాధారణ శకం 661లో ఇస్లాం రెండు శాఖలుగా చీలిపోయింది. మహమ్మద్ ప్రవక్త సోదరులు అల్లుళ్ళు కాకుండా ఉమయ్యద్ కుటుంబీకులు ఖలీఫాలుగా (ఇస్లాం మతాధిపతులు) గుర్తింపబడ్డారు. దీన్ని గుర్తించిన వారు సున్నీలుగాను, వ్యతిరేకించిన వారు షియాలుగాను పేరొందినారు. ఇస్లాం లోని సాంస్కృతిక ఆధ్యాత్మిక శక్తి చాలా బలంగా ఉండటం వలన ఒక శతాబ్ద కాలం లోనే ఆఫ్ఘనిస్తాన్ నుంచి మొరాకో వరకు ఉన్న అన్ని దేశాలు ఈ మతాన్ని స్వీకరించాయి. ఆదేశాలు ఈ నాటికీ ఇస్లామిక్ దేశాలు గానే ఉంటున్నాయి. ఇస్లామిక్ నాగరికత ఒక ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఆ రోజు ల్లో మక్కాలో ఒక బ్యాంకు డ్రాఫ్ట్ తీసుకుని దాన్ని మొరాకోలోని మరకేష్ పట్టణం లో మార్చుకునే వీలు కూడా ఉండేది. ఆధునిక బ్యాంకింగ్ వ్యవస్థ కు దారి చూపిన వారు ముస్లింలే పని క్రిస్ బ్రేజియర్ తన ప్రపంచ చరిత్రలో వివరించాడు.
ఇస్లాం అనే పదం అరబీ భాషాపదం 'సిల్మ్' నుండి వచ్చింది. సిల్మ్ అంటే శాంతి, స్వచ్ఛత, అర్పణ, అణకువ , సత్ శీలత. ఇస్లాం అంటే భగవంతునికి అర్పించడం.అతని ధర్మానికి అనుగుణంగా నడచుకోవడం. ముస్లిం భగవదేఛ్ఛకు లోబడి ఉంటాడని అర్థం. మరో రకంగా మహమ్మద్ ప్రవక్త ప్రవచించిన మార్గాన్ని, ధర్మాన్ని అవలంబించువాడని అర్థం.
అల్లా దేవుడు. ఆయన చెప్పినదే ఖురాన్. వేదాలను దేవుడు పలికాడని చెప్పుకున్నారు మన దేశంలో ప్రాచీనులు. అందువల్లనే వాటిని అపౌరుషేయాలన్నారు. ఇదే విధంగానే ముస్లింలు కూడా ఖురాన్ అల్లా చెప్పినాడన్నారు. ప్రతి మతంలోనూ తాము చెప్పిన వాటిని దేవుడు చెప్పినాడని చెప్పడం ద్వారా వాటికి ప్రత్యేక తాను ఆపాదించారు. ఇంకా విజ్ఞానం వికసించని దశలో అవి రాజ్యమేలాయి. 1400 సంవత్సరాలకు పూర్వం రమజాను మాసంలో ఖురాన్ ను ఆవిష్కరించారు.
ఖురాన్ లో 114 అధ్యాయాలు ఉన్నాయి. ప్రతి అధ్యాయాన్ని సూరా అని పిలుస్తారు . ప్రతి సూరాలో అనేక శ్లోకాలున్నాయి. ప్రతి శ్లోకాన్ని అయా అని పిలుస్తారు. మహమ్మద్ చెప్పిన వాటిని
హదీసులన్నారు.ఖురాన్ పుట్టుక, పరిణామం క్రీస్తు శకం 610లో మొదలయ్యింది. సా.శ. 610 నుండి 632 (ముహమ్మద్ ప్రవక్త పరమదించిన సంవత్సరము)మధ్య కాలంలో ఖురాన్ ఆవిర్భవించింది.అప్పుడు మహమ్మద్ కు 23 సంవత్సరములు. క్రీస్తు శకం 653, ఉస్మాన్ కాలంలో ఆ మహమ్మద్ ప్రవచనాలను సేకరించి సంకలనం చేశారు.ఖురాన్ సంకలనం ఉస్మాన్ కాలంలో జరగలేదని భావించే పరిశోధకులు అనేక మంది ఉన్నారు. ఇప్పటికి అందుబాటులో ఉన్న అతి పురాతన ప్రతులు 9వ శతాబ్దం నాటివని పరిశోధకుల వాదన.
అల్లా పంపిన దూత, ప్రవక్త మహమ్మద్ ప్రచారం చేసుకున్నాడు.మహమ్మద్ చెప్పినవే ఇస్లాం తాత్విక భావాలు గా ప్రచారమయ్యాయి. ఆయన భావాలు ఇలా ఉంటాయి.
ఇస్లాం ప్రకారం ప్రపంచానికి సృష్టి కర్త అల్లా.
నీతివంతులకు బహుమతిగా స్వర్గం ఇస్తాడు అల్లా. అన్యాయస్తులకు నరకంలో శిక్షిస్తాడు.
అన్ని ప్రాంతాల లో స్వర్గం, నరకం భావాలు ప్రచారం లో ఉండినాయి.
అల్లా సర్వాంతర్యామి. ఆయనకు రూపం లేదు. అందువల్ల విగ్రహారాధన చేయరు. మహమ్మదీయ రాజులు భారతదేశం పై దండెత్తి వచ్చిన సందర్భంలో అనేక శిలలను ధ్వంసం చేయడం వెనుక కారణమిదే. అదే సమయంలో విగ్రహాల కింద దాచిపెట్టిన నిధుల కోసం కూడా. అయితే ఇతర హిందూ రాజులు కూడా ఇదే పని చేశారు.రాజు యుద్ధం చేస్తున్నాడంటే పట్టపగలే దోపిడీ చేస్తున్నాడని అర్థం.
సమాజం లోని ప్రజల భాష, ఆహార్యం, ఆచార వ్యవహారాలు, మత విశ్వాసాలు,జాతి, కళలు, సాహిత్యం, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన స్థాయి వంటి అంశాలు ఆయా సమాజాల యొక్క సంస్కృతిని తెలియజేస్తాయి.
ఆంధ్రపదేశ్ లోనూ ఇస్లాం వ్యాపించడానికి సూఫీ తత్వం బాగా దోహదపడింది.12 శతాబ్దానికి చెందిన పెనుకొండ బాబా ఫక్రుద్దీన్, హైదరాబాద్ కు చెందిన హజ్రత్ యూసుఫైన్ చిష్తీ, హజ్రత్ షర్ఫుద్దీన్ సహర్ వర్ది, హజ్రత్ షరీఫైన్ చిష్తి, కడపకు చెందిన ఖ్వాజా పీరుల్లాహుసేనీ, హజ్రత్ నాయబే రసూల్, నాగూరుకు చెందిన ఖాదిర్ ఔలియా మొదలైన వారు సూఫీ తత్వం ప్రచారం చేశారు.సమాజంలోని అంటరానితనం, అస్పృశ్యత, కులవిధానాలు, వర్ణవిభేదాలు కూడా, ఇస్లాం వ్యాప్తికి పరోక్షంగా తోడ్పడ్డాయి. ముస్లిం రాజులు హిందూ మత సంబంధ విషయాలలో జోక్యం చేసుకోలేదు. అందువల్లనే వర్ణ వ్యవస్థ,కుల వ్యవస్థ అలాగే ఉండిపోయింది.
ప్రతి మతం నిబంధనలు పెట్టినట్లు ఈ మతం
కూడా ఐదు నిబంధనలు పాటించాలని చెప్పింది.
అల్లాను తప్పనిసరిగా నమ్మాలి. నమ్మని వాడిని కాఫిర్ అన్నారు. తమ సమాజం నుంచి వెలి వేస్తారు.తప్పకుండా వివాహం చేసుకోవాలి. బ్రహ్మచర్యాన్ని నిషేధించింది. ఇది మత విస్తరణ కోసమే.
ప్రతి వ్యక్తి నమాజ్ చేయాలి. అంటే దైవం ప్రార్థన రోజుకు ఐదు సార్లు చేయాలి. జీవితంలో ఒకసారైనా మక్కా సందర్శించాలి.
రంజాన్ నెలలో రోజా ( ఉపవాసం) ఉండాలి. రంజాన్ నెలలో జకాత్ దానం చేయాలి. అంటే దోపిడీ చేసిన వాడు పేదలకు పంచాలని చెప్పడం. చాలా మంది ముస్లిం పెట్టబడీదారులు తమ దగ్గర పనిచేస్తున్న వారి జీతం పెంచమంటే పెంచరు గానీ రంజాన్ లో జకాత్ పేరుతో కొంత విదిలిస్తారు. వీరి దోపిడీ ని కప్పి పుచ్చుకోవడానికి ఇదొక ముసుగు.
దైవ భావాన్ని, మహమ్మద్ ప్రవక్తత్వాన్నీ,ఖురాన్ దివ్యత్వాన్ని నిరాకరిస్తే వారు ముస్లిం పరిధిలోకి రారని ప్రచారం చేశారు. వారిని కాఫిర్ లని నిందించారు. భిన్న ధోరణులు చూపినవారిని తీవ్రంగా బాధ పెట్టడంలో అన్ని మతాల లాగానే ఈ మతం చేసింది. చరిత్ర చెప్పే సత్యమిదే. నమ్మకాలు లేని వారి పట్ల అసహనం, మరణ శిక్షలూ విధించాలన్నారు. షియైట్లు, ఖరీజైట్లు, మురీజైట్లు, ముతాజిలైట్లు ప్రవక్త దైవ వచనాలవంటివి సందేహించే సున్నీలను అతివాదులుగా భావించారు.
పునర్జన్మ వంటివాటిని కేవలం భ్రాంతిగా పరిగణించాలన్నారు. సత్యాన్ని తెలుసుకోవటానికి దేవుని సహాయం అవసరం లేదన్న భావాన్ని ఇస్లాం నిరాకరించింది. దైవసత్యం వెల్లడైతేనే నిజం తెలుస్తున్నదన్నారు. పునరుజ్జీవనం పొందిన ఇస్లాం, అల్జీరియా, ఇరాన్, సూడాన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, సౌదీ అరేబియా, ఈజిప్టులలో ఆటవిక ధోరణిలోకి పోతోంది. ఇస్లాం రాజకీయంగా ఆధునిక ప్రపంచ సమస్యలను, ముఖ్యంగా, సాంఘిక, ఆర్థిక, తాత్విక విషయాలలో విఫలమైంది. ఏమతమైనా ఇలాగే విఫలమవుతుంది. లౌకిక ప్రజాస్వామ్య ప్రభుత్వాలే రాజకీయంగా సరైన ప్రపంచ సమస్య లకు సమాధానలిస్తాయి.
ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, పాకిస్తాన్ , ఇండోనేషియాలో ఇస్లాం ప్రధానంగా ఉంది.ప్రపంచ జనాభాలో 24.1% మంది ముస్లింలున్నారు. ముస్లింలలో రెండు తెగలున్నాయి. ఒకరు: సున్నీ (75-90%) రెండు: షియా (10-20%). ముస్లింలలో 13% మంది ఇండోనేషియాలో, 31% దక్షిణాసియాలో, 23% మధ్యప్రాచ్య-ఉత్తర ఆఫ్రికాలో నివసిస్తున్నారు, 15% ఉప-సహారా ఆఫ్రికాలో. అమెరికా, కాకసస్, మధ్య ఆసియా, చైనా, యూరప్, మెయిన్ల్యాండ్ ఆగ్నేయాసియా, ఫిలిప్పీన్స్ మరియు రష్యాలో కూడా ముస్లిం సమాజాలు ఉన్నాయి.
సౌదీ అరేబియా, సోమాలియా మరియు ఆఫ్ఘనిస్తాన్ లలో ముస్లిం జనాభా శాతం 100% కి దగ్గరగా ఉంది. మాల్దీవులు, పశ్చిమ సహారా, టర్కీ, ఇరాన్, అల్జీరియా, మౌరిటానియా, యెమెన్ వంటి దేశాల జనాభాలో 98-99% మంది ఈ మతాన్ని అనుసరిస్తున్నారు.2011 గణాంకాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ లో 14.7% ముస్లింలున్నారు.
____ పిళ్లా కుమారస్వామి,9490122229

Comments
Post a Comment