మనువు చెప్పిన ముఖ్య (అ)ధర్మాలు
మనుధర్మం చెప్పిన ముఖ్య (అ) ధర్మాలు
* బ్రహ్మనోటినుండి బ్రాహ్మణులు, భుజమునుండి క్షత్రియులు, తోడలనుండి వైశ్యులు, పాదములనుండి శూద్రులు ఉద్భవించారు.
●బ్రాహ్మణులను వేద పండితులు మరియు గురువులుగా, క్షత్రియులు పరిపాలకులుగా, వైశ్యులు వ్యాపారులు మరియు వ్యవసాయదారులుగా, శూద్రులు సేవకులుగా ఆశీర్వదించాడు మనువు.
● బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మాత్రమే వేదాలు చదవడానికి, యజ్ఞోపవీతాన్ని ధరించడానికి అర్హులు.
●స్త్రీల పేర్లు పలకడానికి తేలికగా, చక్కటి అర్ధం వచ్చేలా ఉండాలి.
● 8 సంవత్సరాల బ్రాహ్మణుడికి, 11 సంవత్సరాల క్షత్రియుడికి, 12 సంవత్సరాల వైశ్యుడుకి ఉపనయనం జరపాలి.
●బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మాత్రమే ద్విజులు, అనగా యజ్ఞోపవీతం ధరించేవారు.
●గురువు బ్రాహ్మణుడి ప్రతిరూపం, తండ్రి ప్రజాపతి రూపం, తల్లి భూదేవి రూపం, పెద్ద సోదరుడు తన స్వరూపం.
● ద్విజులు శూద్ర స్త్రీలను భార్యగా స్వీకరిస్తే, వారి పిల్లలు శూద్రులవుతారు.
●స్త్రీలు తమ సోదరుల చేతను, తండ్రుల చేతను, భర్తల చేతను, మరుదుల చేతను గౌరవించబడాలి, ఆరాధించబడాలి.
●స్త్రీలు గౌరవింపబడిన చోట దేవతలు నాట్యం చేస్తారు. గౌరవింపబడనిచోట ఎటువంటి కార్యాలు చేసినా ఫలితం శూన్యం.
●స్త్రీలు కన్నీరు కార్చిన చోట ఆ కుటుంబం సర్వనాశనమవుతుంది. వారు సంతోషించిన కుటుంబం ఆశీర్వదింపబడుతుంది.
● పురుషులు తమ క్షేమం కోసం వస్త్రములతోను, ఆభరణములతోను, స్త్రీలను పొందాలి
●భార్య పట్ల భర్త, భర్త పట్ల భార్య ఆనందించిన కుటుంబము కలకాలం వర్ధిల్లుతుంది.
● స్త్రీలు స్వతంత్రంగా, తన ఇంటిలో కూడా ఏపనీ చేయరాదు.
●స్త్రీ బాల్యంలో తల్లిదండ్రుల రక్షణలో, యవ్వనంలో భర్త రక్షణలో, వృద్ధాప్యంలో కుమారుల రక్షణలో ఉండాలి. ఆమె ఎంత మాత్రమును స్వతంత్రంగా ఉండరాదు.
●తండ్రి, భర్త, కుమారులను వీడిన స్త్రీ కుటుంబాలను నవ్వులపాలు చేస్తుంది.
●ఇంటి పనుల్లోను, శుభ్రపరచటంలోను, ఆర్థిక విషయాల్లో స్త్రీ తెలివిగా, చురుకుగా ఉండాలి.
●భర్త గుణవంతుడైనా, దుర్మార్గుడైనా, భార్య తన భర్తను భగవంతునిగానే భావించాలి.
●భర్తకు లోబడిన స్త్రీ స్వర్గములో అధికం చేయబడుతుంది.
●భర్త పట్ల బాధ్యను మరచిన స్త్రీ లోకములో అవమానింపబడి, మరణం తరువాత తోడేలు కడుపులో చేరి పలు వ్యాధులతో పీడింపబడుతుంది.
●ఆలోచనలను, మాటలను, చేతలను నియంత్రించుకొని మరణం తరువాత స్వర్గంలో భర్తతోపాటూ ఉన్న స్త్రీయే నిజమైన భార్య.
●భర్త తన భార్యను దేవుడి నుండి పొందుతాడు, తన ఇష్ట ప్రకారం పొందడు. ఆమె నమ్మకంగా ఉన్నంత వరకూ ఆమెకు సాయపడాలి.
●బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మాత్రమే రెండు జన్మలు కలిగినవారు, శూద్రులు మాత్రం ఏక జన్మ కలిగినవారు, ఐదవ కులము లేదు.
●బ్రాహ్మణుడికి మరియు వైశ్య కన్య వల్ల కలిగిన కుమారుడిని అంబస్తుడు అని, శూద్ర కన్య వల్ల కలిగిన కుమారుడుని నిషాదుడు అని అంటారు.
●క్షత్రియుడికి శూద్ర కన్య వల్ల కలిగిన కుమారుడిని ఉగ్ర అని అంటారు.
●క్షత్రియుడుకి బ్రాహ్మణ కన్య వల్ల కలిగిన కుమారుడుని సూతుడు అని, వైశ్యుడుకి క్షత్రియ కన్య వల్ల కలిగిన కుమారుడుని మగధ అని, వైశ్యుడుకి బ్రాహ్మణ కన్య వల్ల కలిగిన కుమారుడుని వైదేహుడు అని అంటారు.
● బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు తప్ప ఇతరులందరూ దాస్యులు.దాస్యులు అంటే బానిసలు అని అర్ధం.
(అందుకే అంబేద్కర్ మనుధర్మాన్ని కాల్చివేశాడు)
Comments
Post a Comment