మకర సంక్రాంతి
సంక్రాంతి కాదు ఇది పొంగల్ ఉత్సవం
భారత దేశ ప్రజలు ముఖ్యoగా శ్రమ జీవులైన సాధారణజనాల పండగలు పూర్తిగాబ్రహ్మణీకరించబడ్డాయి. హరప్పా నాగరికత తో విలసిల్లిన భారత ఉపఖండాన్ని ప్రాచీన బ్రాహ్మణీయ వ్యవస్థ వేదకాలం నుండి పూర్తిగా వారి ఆధీనoలోకి తీసుకువెళ్లడం లో విజయం సాధించింది. వేదకాలం తరువాత బుద్ధుని కాలం లో బ్రాహ్మనీయ విధానం పూర్తిగా తప్పుడు సిద్ధాంతం అని తథాగతుని బోధనల వలన ఈ దేశ ఉపఖండ ప్రజలు తెలుసుకున్నారు. బుద్ధుని బోధనలు క్రీ.పూ. 5 వ శతాబ్దం నుండి మొదలయ్యాయి. దీనిని పూర్తిగా ప్రజల్లోకి తీసుకుపోయింది సామ్రాట్ అశోకుడు .సుమారు 5 శతాబ్దం నుండి క్రీస్తు శకం 15 శతాబ్దం వరకు బౌద్ధం ఈ దేశం లో విలసిల్లింది.
భారతదేశ చరిత్ర మొత్తం "బౌద్ధానికి బ్రాహ్మనిజానికి మధ్య జరిగిన సంఘర్షనే" అని డాక్టర్ అంబేడ్కర్ విశదీకరించారు.సుమారు రెండువేల ఏళ్ల బౌద్ధకాలం లో అనునిత్యం బౌద్ధం బ్రాహ్మనిజంతో సంఘరిస్తూనే ఉంది.భారత దేశం లో అనాదిగా కష్టజీవులు ,ఇష్టం గా శ్రమ జేసే శ్రామికులు.శ్రమ చేస్తున్న శ్రామిక ప్రజానీకం ఉత్సాహాలను వేడుకలను బ్రాహ్మణీకరించింది బ్రాహ్మణ పూజారి వర్గం. శ్రామికుల శ్రమను ధనం రూపం లో కొల్లగొట్టడానికి ఈ ఉత్సవాలను ఇలా మార్చేశారు.ఈ కోవలోనిది దక్షిణ భారతదేశ ప్రజలు చేసుకునే "పొంగల్ "పండగ.
తమిళ నాడు ,తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతిగా పిలువ
బడుతున్న పండగ తమిళ నాడులో పొంగల్ గా పిలువబడుతుంది.ఇది ద్రావిడ సంస్కృతి .కష్టజీవుల సంస్కృతి.పొంగల్ అంటే పొంగడం ,నిండిపోవడం అని అర్థం .భారత దేశ మెజారిటీ శ్రామికులు వ్యవసాయ దారులు ,వ్యవసాయం లో వరి , గోధుమ ఎక్కువగా పండిస్తారు. మన దేశం లో వ్యవసాయం జీవన విధాన మైన వృత్తి.అందులో వరి పంటలో మన దేశం ప్రపంచంలో రెండవ స్థానం లో ఉంది . ఖరీఫ్ కాలమైన జనవరి నెలలో వ్యవసాయ పనులు పూర్తైపోయి పంట చేతికి వస్తుంది.ప్రతి ఇల్లు వరి పంటతో నిండిపోతుంది.
దేవుడు అంటే ప్రకృతిలో కనబడేవే అని నమ్మే ఈ దేశ సాధారణ ప్రజానీకం ,సూర్యుణ్ణి మొక్కే వారు.ఇలా పంటను చేతికివచ్చిన సందర్భంగా పొంగల్ చేసుకోవడం ఆనవాయితీ.ఈ దేశ ప్రజలు గట్టు మీద ఒక రాయి పెట్టి గట్టమ్మ గా ,పొలిమేర రాయి పెట్టి పోలేరమ్మ గా,పోషణ కు గుర్తుగా ఊరిలో ఒక రాయి పెట్టి పోషమ్మగా ,దారిలో ఒక రాయి పెట్టి మైసమ్మ గా మాతృస్వామ్య పూజలు చేసుకునేవారు.ఈ పూజలు చాలా సాధారణంగా ఉండేవి పూజ సామాగ్రికి అంత ఖర్చుకూడా అయ్యేది కాదు .కానీ ఎప్పుడైతే విశ్రాంత వర్గం ఈ పండుగలో తలదూర్చిందో అప్పటి నుండి దేవుడు పేరుతో ప్రజలు దోపిడీకి గురి కావడం మొదలైంది.
జంతుబలులు ,మూఢత్వం కి వ్యతిరేకంగా బౌద్ధం మొదలైంది. అహింస వలన పశుసంపద మిగిలి ప్రజల సంపద పెరిగింది.దాంతో బౌద్ద సంస్కృతి శ్రామికులైన బహుజనులలోకి శరవేగంగా వెళ్లడాన్ని జీర్ణించుకోలేక కట్టుకథలు అల్లడం మొదలు పెట్టారు ఆనాటి విశ్రాంత వర్గం.సూర్యుణ్ణి రెండు చేతులతో మొక్కే వ్యక్తి సూర్యున్ని దేవుని గా కొలిచి విజ్ఞానం వికసించని దశలో ఏర్పడిన నవగ్రహాలలో ఒక గ్రహం గా భావించారు.కర్ణునికి తండ్రి అని కూడా నమ్ముతారు.అదే వ్యక్తి బౌద్ధం లోకి వెళ్తే తార్కిక ఆలోచనలో పడతాడు.ఈ విధంగా అనాదిగా బహుజనులలో ఉన్న తార్కిక వాదాన్ని తమ మనుగడ కోసం బ్రాహ్మణమతం అనేక నమ్మకాలను ప్రచారం చేసి తార్కిక ఆలోచనలకు బదులు కర్మ,తలరాత, పునర్జన్మ,మన చేతుల్లో ఏమీ లేదని మొదలైన భావాలను వివిధ రూపాల్లో ప్రవేశ పెట్టారు.
ప్రకృతిని ఆరాధించిన ఈ దేశ మూలవాసులు మెల్లగా అజ్ఞానం లోకి నెట్టబడ్డారు. ,
ప్రకృతిలో జరిగే సృష్టి రహస్యాలను తెలుసుకోకుండా వాటికి కట్టు కథలు అల్లారు. ప్రకృతి ఆరాధన నుండి ,గతి తార్కిక సిద్ధాంతం వైపు విగ్రహారాధన నుండి సైన్స్ వైపు మళ్ళాల్సిన ఈ దేశ ప్రజలను మూఢత్వం వైపు ప్రయనించేలా చేశారు.
ప్రజలు సంతోషాలతో జరుపుకునే ఉత్సవాలలో
,ప్రజలు భయంతో చల్లంగా తమను కాపాడాలని మొక్కే మొక్కల వరకు తిరిగి విశ్రాంత వర్గం అక్రమించుకుంది.రాళ్ళ ను మొక్కే స్థితి నుండి రాళ్ళ మీద పరిశోధన చేసే స్థితికి రావాల్సిన ప్రజలను రాళ్లను రోగాల మాన్పి ,సుఖ సంతోషాలు ,స్వర్గ నరకాలకు చేర్చే వాటిగా తీర్చిదిద్దుకుని పూజలు చేసే స్థితికి విశ్రాంత వర్గం నెట్టివేసింది.
బుద్ధుని రూపాన్ని ఇతర
దేవుళ్ళ ప్రతిరూపాలుగా చేసింది.బుద్ధుని భంగిమలు ఈ దేశ దేవుళ్ళ భంగిమలు చేసింది.అసలు దేవుడు అంటే ప్రకృతి అని ఆరాధించే ఈ దేశ ప్రజలకు దేవుని రూపం బుద్ధుడే.బుద్ధుని ముందు హిందు మతంలో దేవునికి రూపం లేదు.ఆయన ఆది మధ్యాంతరహితుడు.
వ్యవసాయం తో దేదీప్యమానంగావెలుగుతున్న ఈ దేశం లో కుల వ్యవస్థ ను రూపొందించి ,వ్యవసాయాన్ని కొందరికే పరిమితం చేసింది,భూమిని కొందరి చేతుల్లో ఉండేలా చేసుకున్నారు. శూద్ర కులాలను సేవకులుగా చేసి బ్రాహ్మణ.క్షత్రియ,వైశ్యకులాలను భూమి కి అధిపతులుగా చేసుకున్నారు.అందరూ యజమానులైతే చేసేవాడెవ్వడు అన్నారు.శూద్ర కులాలలో తిరుగుబాటును గమనించిన తెలివైన వర్గం శూద్రులలో హెచ్చుతగ్గులు పుట్టించి నయా క్షత్రియ వర్గాన్ని పుట్టించింది.శూద్రులలో నయా క్షత్రియ వర్గాన్నిది ఆమోదించింది. ఓసి కులాలకే అసంఖ్యాక భూములు ఉండటానికి కారణం వర్ణవ్యవస్థే.
వృత్తి కులాలకు ,అంటరాని కులాలకు వ్యవసాయ భూములు లేకపోవడం ,శ్రామికులుగా, కూలీలుగా బ్రతకడానికి కారణం కూడా మనువాద సంస్కృతే.
కులం పేరుతో రెండు వర్గాలను సృష్టించి ధనిక వర్గం దగ్గర డబ్బును పేద వర్గాల దగ్గర భక్తిని పొందాలన్నది మనువాదుల పన్నాగం.
పేదవారు అయిన ప్రజలను గుళ్ళు గోపురాలు తిప్పుకోవడం లో నూరు శాతం సఫలీకృతం అయ్యారు.ధనికుల డబ్బులతో గుడులు కట్టించుకొని పూజారులుగా విశ్రాంత వర్గం ఈ సమాజం లో గౌరవ మర్యాదలు పొందుతున్నారు. అదే ఆరుగాలం కష్టం చేసిన శ్రామికులు అప్పులపాలు అయ్యారు.
సరిగ్గా పండగలు ముఖ్యoగా ప్రజలు సుఖంగా ఉన్నప్పుడు చేసుకుంటారు ఆ కోవలోని సంక్రాంతి పండుగకు ,సూర్యుని సంక్రమణం జరుగుతుంది ,మకర రాశిలోకి సూర్యుడు వెళ్లిన రోజున సూర్యుని ఉత్తరాయణం ప్రయాణం మొదలవుతుంది ,ఇప్పుడు గుడిలో దేవుళ్లను దర్శించుకోవాలి ,బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేయాలని కట్టు కథలు చెప్పారు.ఈ కట్టు కథలు నమ్మిన మెజారిటీ పేద వారు అయిన బహుజనులు ప్రతీ ఏడాది జనవరి నెలలో తమ దగ్గర ఉన్న ధనాన్ని గుడులు గోపురాలు తిరగడానికి ఖర్చుబెడుతున్నారు. ఇదంతా తార్కికంగా ఆలోచించని భారతీయ వ్యవస్థ ఉండడం వల్లనే ఇది సాధ్యపడింది.
సీజన్ లో వచ్చే వ్యాధులకు మూఢనమ్మకాలను సృష్టించి దోచుకుంటున్న మనువాదం మన సంతోషాలను కూడా కబళించి దోచుకుంటుంది.
దేవుడు లేడని,ఏది మూఢంగా నమ్మద్దు అని చెప్పిన బౌద్ధం ను కూడా తమదే అంటూ బౌద్ధ ధమ్మాన్ని తమ తమ ధర్మ మే అంటూ ప్రచారం చేస్తున్న మనువాద కుట్ర బౌద్ధాన్ని ఆచరించినవారి మీద కక్ష సాధించడమే....
తమసోమ జ్యోతిర్మయా అంటూ వెలుగులోకి ప్రయాణం కావాల్సిన ఈ దేశ ప్రజలను చీకట్లోకి త్రోసింది ఈ మనుధర్మం.సూర్యుణ్ణి మొక్కిన ఈ దేశ ప్రజలను ఖగోళ శాస్త్రoలో పరిశోధనలు చేయాల్సిన సమయం లో కూడా రాశులను నమ్ముతూ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు అని నమ్మేలా చేసి మూఢత్వం లోకి ,తద్వారా చీకటిలోకి ప్రవేశించేలా చేసింది....
సంక్రాంతి అంటే సంక్రమణం.సంక్రమణం అంటే మార్పు చెందడం .ఈ పండగ పూర్తి అజ్ఞానం లో ఉన్న ఒక వ్యక్తి భూమి మీద నిలబడి సూర్యుణ్ణి చూసి చెప్పిన కథ అని కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తే అర్థం అవుతుంది.
సూర్యుడు మేషాది ద్వాదశి యందు ఉత్తరాయణo వైపు మకర రాశిలో కి ప్రయాణిస్తాడు.మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అంటారని పంచాంగకర్తలు చెబుతారు.
అసలు సూర్యుడు ప్రయాణించడం ఏంటి?
భూమి కదా తన చుట్టూ తాను తిరుగుతుంది.
సూర్యుడు భ్రమనం చెందడం నిజమే కానీ అది ఒక పాలపుంత దాటడానికి 225 మిలియన్ సంవత్సరాలు పడుతుంది.కానీ జ్యోతిష్యులు మాత్రం సూర్యుడు నెల నెలా ఒక రాశి లోనుండి ఇంకో రాశి లోకి మారతారని చెప్పడం అజ్ఞానం కాక మరేమవుతుంది?
సూర్యుడు 6 నెలలు అంటే మకర రాశి నుండి మిధున రాశివరకు ఉత్తరాయణం లో ఉంటాడు.
ఉత్తరాయణం అంటే దేవుళ్ళకు పగలు ,దక్షిణాయనం దేవుళ్ళకు రాత్రి అందుకే దేవుళ్ళు ఉత్తరాయణం లో మెలకువగా ఉంటారు కాబట్టి ఉత్తర దిశలో ఉన్న గుడి తలుపులు పూజారులు తెరుస్తారు.ఈ సమయం లో దేవుణ్ణి దర్శించుకుంటే సరాసరి స్వర్గ ప్రాప్తి కలుగుతుందని ప్రచారం చేశారు.అంతేకాకుండా దానాలు బ్రాహ్మణులకు చేస్తే విపరీతమైన పుణ్యం కలిగి స్వర్గ సుఖాలు అనుభవిస్తారని పురాణాల ద్వారా చెప్పారువిద్యాధికులు.
దీనికి భీష్ముడు కూడా ఉత్తరాయణo వచ్చేదాకా ఆగి అప్పుడు చనిపోయాడన్న కథను ప్రచారం చేశారు విశ్రాంత వర్గం.
ఉత్తరాయణం లో పూజలు ,దానాలు చేస్తేనే మంచి జరుగుతుంది.దేవతలు మెలకువగా ఉంటారని చెప్పడం వెనుక కుట్ర ఉంది.ఇది పంట చేతికి వచ్చే కాలం కాబట్టి అమాయకులైన ఈ దేశ ప్రజలను ఈ సమయం లో దోచుకోవచ్చనే నీచమైన కుట్రతో అబద్దాలు చెప్పి ప్రజలను మోసం చేసేందుకుచేసిన పథకం ఇది.
దక్షిణాయం కర్కాటక రాశిలో మొదలవుతుంది 6 నెలలు ప్రజలకు ముఖ్యంగా వ్యవసాయదారులైన ఈ దేశ ప్రజలకు గడ్డు కాలం కాబట్టి ఉత్తర దిశలో ఉన్న గుడుల తలుపులు మూస్తారు. దేవతలకిప్పుడు రాత్రి అని చెబుతారు.
ఇదంతా ఒక పద్ధతిగా చేసిన పన్నాగం.
ఖగోళ శాస్త్రాన్ని తప్పుగా ఈ దేశం లో ప్రచారం చేశారు.
నవ గ్రహాలు అని ప్రచారం చేస్తూ సూర్యుణ్ణి గ్రహం గా చెప్పారు.సూర్యుడు గ్రహం కాదు నక్షత్రమని
మనకిప్పుడు తెలుసు.చంద్రుణ్ణి కూడా గ్రహం అని చెబుతుందిజ్యోతిష్యశాస్త్రం.కానీ చంద్రుడు భూమికి ఉపగ్రహం. అసలు నవ గ్రహాలలో భూమి గురించి ప్రస్తావనే లేదు.రాహువు కేతువులు గ్రహాలు అంటూ కల్పితమైన వాటిని సృష్టించారు. ప్రజలను ఇప్పుడు కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నారు.ప్రజల మూఢ విశ్వాసాలువిశ్రాంత వర్గానికి ఎంతోలాభదాయకం.మూఢనమ్మకాలు వదిలి సైన్స్ నిరూపించిన వాటిని నమ్మండి.
Comments
Post a Comment