పితృస్వామిక సమాజం

        photo: thoughtco.com
నాగలి వాడకం పెరిగాక వ్యవసాయంలో స్త్రీలు పాల్గొనడం కష్టమైంది భూమిని దున్నడం పురుషుల పనిగా మారింది. పనిముట్లలో సాంకేతిక అభివృద్ధి పెరిగేకొద్దీ సమాజంలో ఉత్పత్తి పెరిగి మిగులు ఏర్పడడం మొదలైంది ఆ మిగులు పై వ్యక్తిగత యాజమాన్యం ఏర్పడింది తయారైన స్త్రీకి యాజమాన్యం సంక్రమిస్తే ,పనిముట్ల పై పశువులపై మగవారికి యాజమాన్యం సంక్రమించింది. ఉత్పత్తి స్థాయి పెరిగే కొద్దీ మగవారికి ఆస్తిపై యాజమాన్య హక్కు పెరుగుతూ వచ్చింది. అయితే ఆ ఆస్తిని తన సంతానానికి అందించే వారసత్వ హక్కు లేకుండా ఉంది. దాంతో ఉత్పత్తిపై తనకు పెరిగిన యాజమాన్యపు హక్కును వినియోగించుకుని మాతృస్వామిక సమాజాన్ని మగవాడు పితృస్వామిక సమాజంగా మార్చేశాడు. దాంతో మగవాని ఆస్తి అతని సంతానానికి వారసత్వంగా చెందే పద్ధతి వచ్చింది. ఈ వ్యక్తిగత ఆస్తి హక్కును కాపాడుకోవడానికి గణసమాజ వ్యవస్థ పనికిరాకుండా పోయింది .అందువలన గణ సమాజాలు కలిసి తెగలుగా ఏర్పడిన పరిస్థితిలో అన్నీ కలిసి సమాఖ్యగా ఏర్పడ్డాయి. ఉత్పత్తి అభివృద్ధి చెందే కొద్దీ వ్యక్తిగత ఆస్తిని పెంచుకునే  క్రమంలో  గణ వ్యవస్థ విచ్ఛిన్నమైంది.
       గణం అంతా ఒకే కుటుంబం అనే పద్ధతి పోయి విడి విడి కుటుంబాలుగా ఏర్పడటం మొదలయ్యింది. గణాలన్నీ కలిసి తెగలుగా ఏర్పడ్డాయి అవి కూడా ఒక సమాఖ్యగా మారాయి. అనేక  సంవత్సరాల కాలంలో ఈ తెగలన్నీ కలిసి ఒక జాతిగా రూపొందాయి.
      సింధు సమాజానంతర వేదకాలం( క్రీ.పూ. 1500) వచ్చేసరికి మాతృస్వామిక వ్యవస్థ అంతరించి, పితృస్వామిక వ్యవస్థ ఏర్పడింది. 
      మనదేశంలో ఆర్య గణాలు, ద్రావిడ గణాలు పరస్పరం సంఘర్షించుకుని మెల్లగా అవి కలిసి పోయాయి. మహాభారత కథలో అలా వివిధ గణాలు కలిసి పోయి తెగలుగా మారిన క్రమం మనం గమనించవచ్చు. ఇలా తెగలన్నీ  జాతిగా ఏర్పడినాయి. తెగలున్న ప్రాంతాలే జానపదాలు ఆ జనం పదాలన్నీ కలిసి చిన్న చిన్న రాజ్యాలుగా మారాయి. అవన్నీ కలిసి సామ్రాజ్యాలయ్యాయి.
ఈ పరిణామం 600BCEనాటి వరకు జరిగింది.మగధ సామ్రాజ్యం మొదటిది. అప్పటికే పురుషాధిక్య సమాజం బలపడింది. మాతృ స్వామిక వ్యవస్థ బలహీన పడుతున్నదశ అది.
మహాభారత, రామాయణాలు పురుషాధిక్యతను బలపరుస్తూ వచ్చిన రచనలు.అవి కులవ్యవస్థను, పితృస్వామిక వ్యవస్థను స్థిరపరచడానికి తోడ్పడినాయి.
  


Comments

Popular posts from this blog

మహాత్మా గాంధీ ఆచరణాత్మక తాత్విక చింతన

బాబాసాహెబ్ అంబేద్కర్‌ ఆధునిక తాత్విక చింతన

బౌద్ధం పునాదులపై లేచిన వైదిక ధర్మం