గణవ్యవస్థ

గణవ్యవస్థ
       Pc Wikipedia

_గణవ్యవస్థ_

అనేక తెగలు కలిసి ఒక గణంగా రూపొందాయి. ఈ గణానికి పెద్దగా గణాధిపతి ఉండేవాడు.ప్రతి గణానికి గుర్తుగా ఏనుగో గుర్రమో పులో నక్కో ఇలా ఒక జంతువు ఉండేది. అదే కాలం క్రమంలో ఇంటి పేరు గా మారింది. పిల్లి సుభాష్, పులి రవి, ఇలా చాలా పేర్లు మనం చూస్తున్నాం.
      గణం మరో గణాన్ని దోచుకునేది. మొదట్లో చంపేసే వారు. తరువాత చంపడంకన్నా వారిని తమ బానిసలుగా చేసుకుని వారితో పనులు చేయించుకోవడం మంచిదని తెలుసుకున్నారు.
లొంగిపోయిన గణానికి గుర్తుగా ఉన్న జంతువును
తమ చిహ్నమైన జంతువు పక్కనో తమ దేవత పక్కనో పెట్టుకున్నారు. అలా కుమారస్వామి వాహనంగా నెమలి, వినాయకుని వాహనంగా ఎలుక, శివుని నెత్తిన గంగ, ఇలా ఏర్పడినాయి.
       Pc alchetron.com
గణానికి మొదట్లో స్త్రీ యే అధిపతి. వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతున్న దశలో పురుషాధిక్యత పెరిగింది. ఆ తరువాత కాలంలోనే ఇలాంటివి వచ్చాయని చెప్పవచ్చు. ఆ తర్వాతే గణానికి మూలపురుషుడు ఏర్పడినాడు.మార్కండేయుడు, వశిష్టుడు, భరద్వాజ, కశ్యప మొదలైన వారు వచ్చారు. గణానికి గుర్తుగా ఉన్నవే గోత్రాలయ్యాయి. కొన్ని గణాలకు మూలపురుషుని పేరే గోత్రంగా మారింది.
          గణాధిపతిని మొదట మొక్కాక (పూజించాక) తక్కిన పనులు ప్రారంభించేవారు. అందువల్లనే నేడు వినాయకుని గణాధిపతిగా తీసుకొని పూజ చేస్తున్నారు. ఈ గణాధిపతిని గణప్రముఖులు ఎన్నుకుంటారు. ఇతని రాజు గా  గుర్తించారు. రాజు అంటే అంటే అప్పట్లో గుణం పెద్దే.     వేద సాహిత్యంలో పేర్కొనబడిన రాజులంతా ఇలాంటి రాజు లే గాని అభివృద్ధి చెందిన సమాజంలోని రాజులు కాదు. ఈ రాజు గణ సభ చెప్పినట్లు నడుచుకోవాలి. అతడు సార్వభౌముడు కాదు. అతని పాలన సర్వసత్తాక రాజ్యం కాదు .గణ సంప్రదాయాల్ని తోసి వేసి రాచరికాలు ఏర్పడిన రోజున రాజు  బలవంతుడయ్యాడు.
         గణాధిపతి గణానికి సంబంధించిన పురోహితుని ద్వారా అభిషిక్తుడయ్యేవాడు. అది వంశపారంపర్యంగా సంక్రమించేది. గణం సంపాదించిన  ఉత్పత్తిపై అతనికి అధికారం ఉండేది. ఆ ఉత్పత్తిని ఆయనే పంచేవాడు. రాజు వేదకాలంలో యజ్ఞ బలుల రూపంలో 
 కొంత ఉత్పత్తిని స్వీకరించేవాడు. తరువాత కాలంలో నాగరిక రాజు దానిని పన్నుల రూపంలో సేకరించడం మొదలుపెట్టాడు .పన్నుల కోసం అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేశాడు. దీనికోసం సైన్యాన్ని కూడా ఏర్పాటు చేసినారు. ఇతని పరిపాలన సార్వభౌమాధికారాన్ని కలిగి ఉంది. దాంతో వీరు తమ ప్రతిష్ట పెంచుకోవడానికి తమ పూర్వీకుల గురించి గొప్పగా కీర్తిస్తూ కవులతో రచనలు చేయించేవారు. అందుకు ప్రతిఫలంగా కవులు అగ్రహారాలను, ఆస్తులను పొందేవారు.
అలా రాయబడినదే మహాభారతం.వ్యాసుడు రాసిన 'జయం' కావ్యానికి అనేక చేర్పులు చేస్తూ మహాభారతంగా రాయించారు.ఇలా రాయించారని చైనా యాత్రికుడు హ్యూయాన్సాంగ్  భారత దేశాన్ని సందర్శించినప్పుడు తన అనుభవాలలో రాసుకున్నాడు.
        గణవ్యవస్థ ప్రాపంచిక దృక్పథం లో కర్మసిద్ధాంతం గణనీయంగా మార్పు తీసుకొచ్చింది. కర్మ సిద్ధాంతం ప్రకారం ఈ జన్మలో మంచి పనులు చేస్తే వచ్చే జన్మలో మంచి జీవితం ఉంటుందని చెబుతుంది. అలాగే ఈ జన్మలో చెడ్డ పనులు చేస్తే వచ్చే జన్మలో నీచ జన్మ వస్తుందని చెప్తుంది. ఇలాంటి  భావాలు రావడానికి కారణం వ్యవసాయం.  ఒక పంట వేసి దానిని బాగా చూసుకుంటే మంచి ఫలితం వస్తుంది. సరిగా చూసుకోకపోతే సరైన ఫలితం రాదు.అదే విధంగానే ఈ జన్మలో మంచి పనులు చేస్తే వచ్చే జన్మలో సుఖవంతమైన జీవితం ఉంటుందనే భావన ప్రవేశ పెట్టారు విశ్రాంత వర్గీయులు. ఇదే కర్మ సిద్ధాంతం గా వచ్చింది
 ఈ జన్మలో చేసిన మంచి పనికి రేపు జన్మలో  మంచి ఫలితాలు వస్తాయి. ఈ భావాలు ఆనాటి సమాజానికి బాగా సరిపోతాయి .అందుకనే ఈ సిద్ధాంతాలను  భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లుగా మహాభారతంలో రాసినారు.ఆనాటి ఆధిపత్య వర్గం ఆయా సమాజాలకు అవసరమైన తాత్వికచింతనలో మార్పులు తీసుకు వస్తూ అనేక రచనలు చేశారు .అందులో ఆదర్శాలను ఎక్కడా చెప్పలేకపోయారు. ముక్తి, మోక్షం గురించి మాత్రమే చెప్పినారు. అదే హిందూధర్మం గా మారింది. దీనికి భిన్నంగా  బౌద్ధ ధర్మం  ఆదర్శాలను, ఆచరణాత్మక జీవితం గురించి చెప్పింది. 

Comments

Popular posts from this blog

మహాత్మా గాంధీ ఆచరణాత్మక తాత్విక చింతన

బాబాసాహెబ్ అంబేద్కర్‌ ఆధునిక తాత్విక చింతన

బౌద్ధం పునాదులపై లేచిన వైదిక ధర్మం