నిప్పు, చక్రం మానవుని ప్రకృతి తో వేరు చేసింది

  
      Pc: keapbk.com
                 క్రీ.పూ.6000 ముందు కాలాన్ని పాతరాతి యుగం అంటారు.రెండు ఘనపదార్ధాలమధ్య ఘర్షణ ద్వారా ఉష్ణం ఉత్పత్తి చెంది , అది మండుతుంది. అక్కడ నిప్పు ఉత్పత్తి ఔతుంది. అనాదిగా కనుగొనబడి , సృష్టించబడిన "నిప్పు" వినియోగం నిరంతరాయంగా కొనసాగుతూనే వుంది. మానవుడి ఆహారపదార్థాల ఉత్పత్తిలో నిప్పు పాత్ర లేకుండా ఊహించలేము. అందుచేతనే నిప్పు ఆవిష్కరణను సైన్సులో మొదటి విప్లవంగా గుర్తించబడింది. క్రీ.పూ. 6000 సంవత్సరాలకు ముందున్న "పాతరాతి యుగం" లోనే  నిప్పు కనుగొనబడింది. రెండు ఎండు కర్రలు/చెక్కలను ఎంతో బాగా ఒరిపిడి చేసి శ్రమించి రుద్దితే, ఆ ఘర్షణనుంచి నిప్పు పుడుతుంది. దాన్ని "అరణి" లో నిప్పు పుట్టించడం అనేవారు.  అడవులు, అరణ్యాలలో మంటలురావడం చూసి మనిషి నిప్పు  తయారు చెయ్యడం నేర్చుకున్నాడు. ఎంతో శ్రమతో ఉత్పత్తి అయ్యేది కనుకనే తాము సృష్టించిన "అగ్నిహోత్రం" ఆరిపోకుండా చూసుకునేవారు. నేడు అగ్గిపెట్టెలు , లైటర్లు రావడంతో మనకు "నిత్య అగ్నిహోత్రం"తో పనిలేదు. 
     "అరణి" తో కష్టపడి నిప్పు పుట్టించిన మానవుడు , నేడు అగ్నిపెట్టె/గ్యాస్ లైటర్" తో తేలిగ్గా నిప్పు పుట్టిస్తున్నాడు. గ్యాస్ లైటర్లు వినియోగించేవారు నాగరికులుగా మారిపోగా , ఇంకా "అరణి" తోనే అగ్నిపుట్టించేవాడు అనాగరికుడుగా పిలువబడ్డాడు. 
మెజారిటీ ప్రజలందరూ అగ్గిపెట్టెలు/గ్యాస్ లైటర్ వినియోగించడం మొదలుపెట్టడంతో అది వారి సంస్కృతి గా మారిపోయింది.
       పచ్చిమాసం తిన్న మానవులు కాల్చుకుతినడం నేర్చుకున్నారు. అది వారిని "నాగరికత" నేర్చిన నాగరికులుగా మార్చింది. పచ్చి మాంసం తినేవారు అనాగరికులుగా మిగిలిపోతారు. అందరూ కాల్చుకు తినడం అమలుచేయడంతో అలా కాల్చుకుతినడం వారి "సంస్కృతి"గా మారింది. 

          కొద్ది మంది తో  ప్రారంభమైన నాగరికత, అందరూ/మెజారిటీ అలవరచుకోడంతో అది వారి సంస్కృతి గా మారుతుంది. సైన్సులో నూతన ఆవిష్కరణలతో కొత్త కొత్త నాగరికతలు వస్తూవుంటాయి. కొంతకాలానికి ఆ నాగరికతలు సంస్కృతిగా మార్పుచెందుతూ వుంటుంది. కావున "నాగరికత & సంస్కృతి" శాశ్వతాలు కావు. 
          అంతేగాని మన ఆర్యబ్రాహ్మణులు చెప్పే యజ్ఞాలు, యాగాలు,పూజలు,  పురాణాలు , దేవుళ్ళు , పౌరోహిత్యాలు , చావులు , వివాహవేడుక విధానాలు, ..... ఇలాంటి అమాంబాపతు విధానాలు మన "సంస్కృతి కాదు". మెజారిటీ ప్రజల జీవన విధానమే ఆ "దేశ సంస్కృతి". అది చలనస్వభావమే గాని జడత్వ (శాశ్వత) స్వభావం కలిగివుండదు. 
          క్రీ.పూ6000 - 4000వరకు కాలాన్ని కొత్తరాతి యుగం అంటారు.గుండ్రటి వృత్తాకారంలో తయారు చేయబడిన "చక్రం" గమనం (రవాణా)కు ఎక్కువ సహాయకారిగా ఉండటాన్ని గుర్తించడం జరిగింది. చక్రం తయారీలో ఎన్నో మార్పులు వచ్చినా , ఉపయోగం ఒకటే. నేడు రెండు చక్రాల బండి దగ్గరనుంచి రోదసీలోకి ప్రయాణిస్తున్న రాకెట్లు (వ్యోమనౌకలు) వరకూ చక్రం లేకుండా తయారవ్వడం ఊహించలేని విషయం. అందుకనే చక్రం ఆవిష్కరణ "కొత్తరాతి యుగం"   (క్రీ.పూ. 6000 - 4000 వరకు) లో  కనుగొనబడిన రెండవ సైన్సు ఆవిష్కరణగా  గుర్తించడం జరిగింది. నిప్పుతో మట్టి ఇటుకలు కాల్చి ఆ ఇటుకలను తయారు చేసి మైదానప్రాంతాల్లో నివసించడం "నాగరికత" గా మారింది. ఆ కాల్చిన ఇటుకలు వినియోగించిన కాలం "కొత్తరాతి యుగం" గా పిలువబడింది. చీకటి గుహల్లో నివసించిన మానవులు మైదానప్రాంతాల్లోకి , నదీతీరప్రాంతాల్లోకి వచ్చి నివసించడం ప్రారంభించడంతో వారి "నాగరికత" పురోగామి దిశలో మార్పుచెందింది. ఇంకా కొండగుహల్లోనే నివశించేవాడు అనాగరికుడుగానూ , మైదానప్రాంతాల్లో నివశించేవాడు నాగరికుడుగానూ అవతరించారు. 
మెజారిటీ కొండగుహలు మైదానప్రాంతాల్లో నివశించడం ప్రారంభించడం వారి "నూతన సంస్కృతి" గా మారిపోయింది. 

 
          క్రీ.పూ.4000 - 2000 మధ్య కాలాన్ని లోహయుగం
 అన్నారు.లోహయుగంలో మొదట రాగియుగం (క్రీ.పూ.4000 - 3500 వరకు), కంచుయుగం (క్రీ.పూ.3500 - 3000 వరకు) తర్వాత ఇనుప యుగం (క్రీ.పూ. 3000 - 2000 వరకు) ప్రారంభమైంది. 

రాగి మెత్తగా వుండటంచేత,కంచు పెళుసుగా వుండటంచేత అవి వ్యవసాయ పరికరాలకు ఉపయోగపడలేదు. కానీ ఇనుము బలిష్టంగానూ పదునుగానూ , వంగకుండానూ ఉండే లక్షణాలు కలిగి ఉండటంతో  వ్యవసాయ పరికరాలు, పనిముట్లు తయారుకు ఎంతో ఉపయోగపడింది. ఇది ఆహార ఉత్పత్తి దశలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చింది. ఈనాటికీ ధృడంగా ఉండాల్సిన ఏ వస్తువైనా ఇనుము/స్టీల్ తోనే తయారు చేయబడుతున్నాయి. ప్రజలు ఎముకలతో , కర్రలతో తమ ఆయుధాలు తయారు చేసుకోడం మానేసి , ఇనుప వస్తువాహనాలు తయారు చేసి వాడకంలోకి తెచ్చుకోవడం తో నవీన నాగరితకు మార్పు చెందారు. క్రమేణా అదే వారి "నూతన సంస్కృతి"గా మారిపోయింది. 
    క్రీ.పూ.2000 - క్రీ.శ.1000వరకు ప్రాచీన(చరిత్ర) యుగం గానూ, క్రీ.శ.1000 - 1600 వరకు మధ్య(చరిత్ర)యుగం గానూ,క్రీ.శ.1600 నుంచి ఆధునిక(చరిత్ర) యుగం గానూ 
పిలుస్తున్నారు.   క్రీ.శ. 1685లో నీటియావిరిని కనుగొనడంతో నవీన యుగం ప్రారంభమయింది.

Comments

Popular posts from this blog

మహాత్మా గాంధీ ఆచరణాత్మక తాత్విక చింతన

బాబాసాహెబ్ అంబేద్కర్‌ ఆధునిక తాత్విక చింతన

బౌద్ధం పునాదులపై లేచిన వైదిక ధర్మం