సురులు- అసురులకు ఆ పేరు ఎలా వచ్చింది? వీరెవరు?


        pc: Wikipedia
వేదాంగాలు (శిక్ష ,ఛందస్సు,వ్యాకరణము , నిరుక్తము, జ్యోతిషము , కల్పము)లో నిరుక్తం రాసిన రచయిత యాస్కుడు.ఇతడు క్రీస్తు పూర్వం ఏడు ఎనిమిది శతాబ్దాల మధ్య కాలం వాడు.  రుగ్వేద కాలం నాటి తెగల నుండే దేవ, గంధర్వ, పితర, అసుర ,రాక్షస అనే ఐదు గణాలు ఏర్పడ్డాయని నిరుక్తంలో చెప్పాడు. నాగ, యక్ష అసుర గణాల మాదిరి దేవగణాలు కూడా ఒక మానవ సమూహమే. దేవ గణాలను సుర గణాలు అని కూడా అంటారు.వీరు అసురులకు శత్రువులు.అందువల్ల వీరిని సురులు అన్నారు. లడక్ ప్రాంతంలో ని సురూ లోయలో నివసించే ప్రజలు కాబట్టి  వీరిని సురులని కూడా పిలిచారన్నారు.
      మరో విశ్లేషణ ప్రకారం సుప్రీంను సేవించే వారిని 'సురులు' అన్నారు. సుర( మద్యం) ముట్టని వారిని 'అసురులు' అన్నారు. రక్షించే వారిని రాక్షసులు అని అన్నారు. బలహీనంగా పీలగా ఉన్న వారిని రాక్షసులని అన్నారు. పాములను పూజించే వారిని నాగులని అన్నారు. గోసె కట్టి నప్పుడు వెనకాల కొంత   బట్ట  తోకలాగా వేలాడుతుండేది. ఇలా వేలాడే బట్టతో గోసె ( సైకిల్ కట్టు) కొట్టే వారిని వానరులు అన్నారు.

  

Comments

Popular posts from this blog

మహాత్మా గాంధీ ఆచరణాత్మక తాత్విక చింతన

బాబాసాహెబ్ అంబేద్కర్‌ ఆధునిక తాత్విక చింతన

బౌద్ధం పునాదులపై లేచిన వైదిక ధర్మం