హిందూధర్మం పై నిరసన సనాతనమైంది.
అధిపత్య హిందువుల నుండి సాధారణంగా ఎదురయ్యే ప్రశ్న. “మీరు హిందూమతాన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? క్రైస్తవుల పాపాలు కనప
డవా? ముస్లిముల దురాగతాలు కనపడవా?” అని.
కానీ లెఫ్టిస్టులు లేదా వామపక్షవాదులు అని పిలవబడే వారు మైనారిటీల గురించి, మైనారిటీల హక్కుల గురించి మాట్లాడతారని వాళ్ళు మతాన్ని బట్టి మైనారిటీలు అవ్వవచ్చు, కులాన్ని బట్టి అవ్వవచ్చు లేదా జీవిస్తున్న ప్రదేశాన్ని బట్టీ అవ్వవచ్చు. మన దేశంలో ముస్లింల హక్కుల గురించి పోటాడేది వాళ్ళే.ముస్లిం మెజారిటీ దేశంలో హిందూ హక్కుల గురించి పోట్లాడేది వాళ్ళే! ఇక్కడ హిందూ మతం మెజారిటీ ప్రజల మతంగా వుంది గనుక అది వామపక్షాల నుండీ, లౌకికవాదుల నుండీ, రాజ్యాంగవాదుల నుండీ ఎక్కువ విమర్శను పోరాటాన్ని ఎదుర్కోవడం వింత కాదు, సహజాతి సహజం.
అలాగని మిగిలిన మతాలను నెత్తికెత్తుకున్నట్టు కాదు. మిగిలిన మతాలను సమర్థించినట్లు కాదు. ఓ మతం వల్లో, కులం వల్లో మైనారిటీలుగా వివక్షను ఎదుర్కొంటున్న ప్రజల పక్షాన మాట్లాడటం అంటే ఆ ప్రజల మతం పక్షాన మాట్లాడటం కాదు.ఇది ఎక్కువ మంది గ్రహించలేకపోతున్నారు.
హిందూ మతంలోని వివక్ష గురించీ, కుల మెట్ల గురించి మాట్లాడినప్పుడల్లా ఇదేదో మెకాలే చదువుల ఫలితమని విదేశీ శక్తుల ప్రోద్భలమని ఓ వైపు మాట్లాడేవాళ్ళను శత్రువుల్లా చిత్రించడమే గాకుండా అసలు కులాలు హిందూ మతంలోనే గాకఅన్ని మతాల్లో ఉన్నాయనిఅ దేమంతపెద్ద విషయంకాదని అంటుంటారు.
హిందూమతంపై విషం చిమ్మడం వందేళ్ళనుండే మొదలయింది కొంతమంది అంటూంటారు. కానీ అది నిజం కాదు.హిందూ ధర్మంమతంగా స్థిరపడు తున్నప్పటినుండే దానిమీద నిరసనలూ, పోరాటాలూ కూడా ప్రారంబమయ్యాయి..
చార్వాకుడు లేదా లోకాయుత ధర్మం బహుశా వేదాలను, వేద ధర్మాన్ని వ్యతిరేకించిన తొలి నిరసన కావచ్చు..
రెండువేల సంవత్సరాల కంటే పూర్వమే బౌద్దాన్ని నెలకొల్పిన బుద్దుడిదీ హైందవం మీద నిరసనా, తిరుగుబాటే!
బుద్దుడి తర్వాత మరో వెయ్యేండ్లకు బసవ తత్వం నెలకొల్పిన బసవన్నదీ హైందవం మీది తిరుగుబాటే!
పధ్నాలుగు, పదిహేనో శతాబ్దాల్లో భక్తి వుద్యమాన్ని నడిపిన కబీరూ, తుకారాం, మీరా లాంటి కవులు హిందూమతంలోని అనాచారాల మీద గొంతెత్తినవారే!
పదిహేడో శతాబ్దపు మన వేమన చేసినదీ తిరుగుబాటే, నిరసనే!
ఇక స్వాతంత్య్ర పోరాటం మొదలయ్యాక సామాజిక మార్పు కోసం, హిందూ కుల వివక్షల మీద పోరాటం చేసిన పూలే దంపతుల నుండీ అంబేద్కర్ వరకూ
పోరాటం జరుగుతూనే వుంది జరుగుతూనే వుంటుంది..
పోరాటం ఆగిపోవడం అనేది అన్యాయం ఆగిపోవడంతోనే సాధ్యం.. ఒకరు చెబితేనో, ప్రోత్సహిస్తేనో జరిగే పోరాటం గుప్పున మండి ఆరిపోవచ్చేమో గానీ శతాబ్దాల తరబడి జరగదు.. శతాబ్దాల తరబడీ పోరాటం జరుగుతోందంటే
సమాజం మార్పు దిశగా అడుగులు వేస్తోందని అర్థం.
ఔను. సహజాతి సహజంగా మార్పు జరుగుతోంది. మార్పు ను సహించనివారి దౌర్జన్యం పెరుగుతోంది. మాటల యుధ్ధాలను ఫేక్ పోస్టుల పరంపరలు శరపరంపరగా వస్తున్నాయి...
ReplyDeleteవేమనయే కాక ఆంధ్ర నుండి వీరబ్రహ్మేంద్రస్వామి.. ఆయన మనుమరాలు ఈశ్వరమ్మ లు కూడా గొప్ప సంస్కరణ భావాలతో సామాజిక విప్లవకారులు గా ప్రసిద్ధులు. వారిని దేవతలుగా మార్చింది హైందవం.