భారతీయ తాత్విక చింతన ను గొప్ప మలుపు తిప్పిన బుద్దుడు.
భారతీయ తాత్విక చింతన ను గొప్ప మలుపు తిప్పిన బుద్దుడు.
కపిలుని కన్నా, కణాదుని కన్నా ముందే క్రీ.పూ.563లోవైశాఖ పూర్ణిమలో నేటి నేపాల్ దేశంలోని కపిలవస్తు నగరానికి సమీపంలో లుంబినీ గ్రామంలో జన్మించిన బుద్దుడు ఈనాడు శాస్త్ర విజ్ఞానం చెప్తున్న విషయాలను ఆ రోజుల్లోనే ఆయన ప్రతిపాదించారు.
ఆయన చెప్పినవి ప్రధానంగా
1. ఈ ప్రపంచం ప్రతిక్షణం మారుతూ వుంటుంది. ఈ మారే ప్రపంచం వెనుక మారనిది ఏదీలేదు. నిత్యమైనది ఏది ఉండదు అని చెప్పారు. ప్రతీది నిరంతరం మార్పు చెందుతుందన్నారు.ఈ క్షణం లో కనిపించే దీపశిఖ మరో క్షణం లో కనిపించే దీపశిఖ ఒకటి కాదన్నారు..ఈ ప్రపంచం మారుతూ ఉంటుందన్నారు. దీనినే మార్క్స్ ప్రపంచంలో మార్పు ఒక్కటే మారని దన్నాడు.అయితే ఆయన ప్రపంచం లోని విరుద్ద శక్తుల మధ్య నున్న ఘర్షణ ద్వారా మార్పు జరుగుతోందన్నారు.
2. ఈ ప్రపంచానికి వెలుపల దీనికి ఆధారమైనది, ఆశ్రయమైంది మరొకటి ఏదీ లేదు. ఈ ప్రపంచం సర్వసమృద్ధం, సర్వస్వతంత్రం, తనకుతానే ఆధారమైంద న్నారు.విశ్వం స్వయంభువని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
3. ప్రతిదీ ఉన్నది అనేది ఒక కొస అయితే ప్రతిదీ లేదనేది మరో కొస అవుతుంది. అసలు సత్యం ఈ రెండు కోసల మధ్య ఉందన్నారు.
4. ప్రతిదీ తన రూపాన్ని పోగొట్టుకుంటుంది. ప్రతిదీ ఒక ప్రవాహం, నది ప్రవహిస్తున్నట్లు ఈ విశ్వం విస్తృతమవు తోందన్నారు. సైన్సువిశ్వం వ్యాకోచిస్తోందని చెపుతోంది.
5.ఆత్మ లేదని స్పష్టం చేశారు. ఆత్మ ఉన్నదని చెప్పే ఏ మతమైనా అది అనుసరణీయం కాదన్నారు. అలా చెప్పడం మూఢత్వమే అన్నారు.
6.ప్రతి కార్యానికి కారణం ఉంటుంది అన్నాడు. ప్రతిదానికి హేతువు ఉంటుంది అన్నారు. హేతువు లేకుండా ఉన్న దేనిని నమ్మకూడదు అన్నాడు. ప్రతీది పరిశీలించి, చూసి, మీ పరిశీలనలో నిజమని తెలితేనే నమ్మండి అన్నారు. ఎవరో చెప్పినది నమ్మడానికి వీలులేదు అన్నారు.ఇది నేడు విజ్ఞాన శాస్త్రం చెప్తున్నదిదే.
7.ఆయన ప్రతిత్యాసముత్పాద సిద్ధాంతం ప్రవేశ పెట్టారు. దీని ప్రకారం పాతది నశించి కొత్తది పుడుతుంది.ఈ పద్దతి ఒక ప్రవాహం లాగా సాగుతుంది.దీనిని విచ్చిన్న ప్రవాహం అన్నారు. విత్తనం నాశనం అవుతూనే మొక్క పుడు తుంది. కులనిర్మూలన జరిగాకే సమాజం మార్పుకు గురవుతుంది.పాతది పూర్తిగా నశించి కొత్తది ఏర్పడుతున్న సంధికాలం మనం గుర్తించనంతగా వుంటుంది.ఇదొక శూన్యకాలం.నాగార్జునుడు దీన్నే శూన్యవాదంగా ప్రతిపాదించాడు. పాత దాంట్లో నుంచే కొత్తది ముందుగానే ప్రారంభమై పాతది నశించగానే కొత్తది ముందుకొస్తుందని మార్క్సిజం చెపుతోంది.
8.దేవుడు ఉన్నాడా లేడా అన్నది ప్రధానం కాదు.దుఃఖనివారణే ప్రధానం అన్నారు. సృష్టికర్త అంటూ ఎవరో ఉన్నారని నమ్మడం మూఢత్వమే అవుతుందంటూదైవ భావనను వ్యతిరేకించారు.
8. విద్యుత్తు ఎక్కడ ఉంటుందో అక్కడ అయస్కాంత శక్తి కూడా ఉంటుంది. విద్యుత్తును వెన్నంటి అయస్కాంత శక్తి ఉన్నట్టే శరీరంతో పాటు చైతన్యం కూడా ఏర్పడు తుందన్నారు.
9.ఎవరో చెప్పినారనో, ఎక్కడో రాసినారనో వాటిపై ఆధార పడకుండా నీ స్వబుద్ధితో
ఆలోచించి స్వయంగా తేల్చు కోవడమే బుద్ధునిగా మారిడాన్నదాని కర్థమన్నారు. సృష్టి నియమాన్ని అర్ధంచేసుకొని సత్యాన్ని గ్రహించి ఆ ధమ్మం లో నడవడమే బౌద్ధమని ఆయన చెప్పారు.
10.యజ్ఞ యాగాదులను చేయవద్దన్నారు. వేదప్రమాణాలను తిరస్కరించారు. జీవహింస చేయరాదన్నాడు.మనిషి నాగరికంగా జీవించడాని కనువైన పంచశీల బోధించారు. అయితే ఆయన పునర్జన్మ విషయంలో స్పష్టం గా చెప్పక పోవడంతో ఆయన తదనంతరం బౌద్ధంలో చీలిక వచ్చింది. వీరు మహా యానులు,( హీనయానులు)థేరవాదులుగా చీలి పోయారు. హీనయానులను ఇప్పుడు థేరవాదులంటున్నారు.మహా యానంలో భావవాదం ప్రవేశించింది. బుద్దుని దేవునిగా చేశారు. మరికొంతమంది తాంత్రిక విద్యలను కూడా ప్రవేశపెట్టి వజ్రయాను లయ్యారు.థేరవాదులు మాత్రం భౌతిక వాదం స్వీకరించి బుద్దుని ధమ్మాలను పాటిస్తున్నారు.
ఇలా బౌద్దం భారతీయ తాత్విక చింతనను గొప్ప మలుపు తిప్పింది.
_____ kumaraswaamy,9490122229
Comments
Post a Comment