ఆత్మ
ఆత్మ పరమాత్మ భావనలు సింధు నాగరికతా కాలంలో లేవు. వేద కాలంలో ఏర్పడిన ఆత్మభావన, ఉపనిషత్తుల్లో ఆత్మ,పరమాత్మల చుట్టూ తిరిగాయి.ఇవి భావాలు మాత్రమే.వీటికెక్కడా నిరూపణలేదు. వీటి గురించి తెలుసుకోవడమే జ్ఞానం అన్నారు.ఆత్మ గురించి తెలుసుకుంటే ఆత్మజ్ఞానం
పరమాత్మ గురించి తెలుసుకుంటే అది బ్రహ్మ జ్ఞానం అన్నారు.ఆత్మ లన్నింటికి పెద్ద పరమాత్మ.పరమాత్మే భగవంతుడు.ఈ ఆత్ పరమాత్మ లో లయమైతే(కలిసిపోతే)
దాన్ని మోక్షం అన్నారు.మోక్షమే
మనిషి అంతిమ లక్ష్యమన్నారు.ఆత్మజ్ఞానాన్ని తెలుసుకవడమంటే తన్ను తాను తెలుసుకోవడమన్నారు.
దీని కోసం తపస్సు చేసేవారు.
పరమాత్మ గురించి తెలుసుకుంటే అతను బ్రహ్మ జ్ఞాని అన్నారు.ఈరెండే ముఖ్యం కాబట్టి ఈ ప్రపంచం ఒక మిథ్య అన్నారు. భౌతిక ప్రపంచం వాస్తవం కాదన్నారు.వీటిని విశ్వసించేవారిని భావవాదులన్నారు.వీటిని విశ్వసించని వారిని భౌతిక వాదులన్నారు.
ప్రతిమనిషి లోనూ ఉన్న ఆత్మను "అంతరాత్మ" అని కూడా అన్నారు. ఇది అంతర్లీనంగా ఉండి, న్యాయాన్యాయాలను,ధర్మాధర్మాలను,తప్పొప్పులను నిష్పక్షపాతంగా చెపుతూ మనిషికి ఒక ఆత్మీయునిలాగ, సరైన మార్గాన్ని,ధర్మాన్ని తెలియజెప్తుందని భావిస్తుంటారు.ఒక రకంగా ఇది innersense లాగాభావించారు. మానవులందరిలోనూ ఈ అంతరాత్మ ఒకే విధంగా ఆలోచిస్తుందనుకన్నారు. ఆత్మకు రూపం లేదన్నారు. అదొక శక్తని భావించారు . ఈ శక్తిని తెలుసుకొనమనే రుషులు తమ బోధనలలో చెప్తుంటారు.
ఆత్మ వేరు మనస్సు వేరని అన్నారు.ఆత్మ లాగే మనస్సనేది ప్రతి మనిషి లోనూ ఉంటుందనుకున్నారు.ఇది కూడా ఆత్మ లాగే సమాంతరంగా పనిచేస్తూ ఉంటుంది. అయితే మనస్సు చుట్టూ ఉన్న పరిస్థితులకు, ఇతర కారణాలకు, ఇంద్రియాలకు, లోబడి ప్రవర్తిస్తున్నారు.ఇది సమయానుకూలంగా మారుతూ ఉంటుంది. ఆత్మ అలా కాదు.అది దేనికి లోబడదు, ఏ పరిస్థితులకూ, సమయానికి లోబడకుండా ఎప్పుడూ న్యాయమార్గాన్నే చూపుతూ ఉంటుందని భావించారు.
ఆత్మ అన్న పదం లేకుండా ఉన్న
మత గ్రంధమే లేదు. ఆదిమ సమాజంలో ఏర్పడిన ఈ భావనకు ఎల్లలు లేవు.అన్ని దేశాల్లో అన్ని మతాల్లో ఈ భావన ఉంది.
ఉపనిషత్తుల్లో దీన్ని రకరకాలుగా నిర్వచించారు. ఐతరీయోపనిషత్తు ప్రజ్ఞానం బ్రహ్మ అని చెపుతుంది. బృహదారణ్యకోపనిషత్తు అహం బ్రహ్మాస్మి అంటుంది. ఛాందోగ్యోపనిషత్తు లో తత్వమసి అనంటుంది.ముండకోపనిషత్తు అయమాత్మా బ్రహ్మ అని చెప్పింది.
ఛాంద్యోగ్యోపనిషత్తులో మనిషి చనిపోయాక ”ఆత్మ” ఎలా తన యాత్ర కొనసాగిస్తుందో చెప్పి నారు.
ఈ యాత్ర 2 యానాలుగా ఉంది.
1. పితృయానం, 2. దేవయానం.
పితృయానంలో జీవుడు చనిపోయాక ఆత్మ పొగలోకి చేరుతుంది. అక్కడ నుండి రాత్రికి, రాత్రి నుండి పితృలోకానికి, అక్కడినుండి ఆకాశం, తర్వాత చంద్రమండలం చేరుతుంది.
ఆ ఆత్మ గడువు తీరేదాకా అక్కడే ఉంటుంది. గడువు తీరాక తిరిగి భూలోక ప్రయాణం చేస్తుంది.అక్కడినుండితిరిగి ఆకాశం చేరుతుంది. తరువాత వాయువును, వాయువు నుండి పొగకూ, పొగనుండి మేఘాలకు చేరి, వర్షంతో కలిసి భూమికి చేరుతుంది. అక్కడ వరిధాన్యంగానో, ఔషధిగానో, వనస్పతిగానో, అపరాలుగానో మారుతుంది. ఇలా వివిధ ఆహార పదార్థాల నుండి ఆత్మ తిరిగి జీవుడిగా జన్మిస్తుంది”
ఇదీ .. ఛాందోగ్యోపనిషత్‌లో ఆత్మ షటిల్ సర్వీస్.
ఆత్మ వృక్షాలు, వనస్పతులు, అంతరిక్షం నుండి వస్తుందని చెప్పిన వేద కాలపు భావాలకు ఒక నిర్దిష్టరూపం ఈ ఉపనిషత్తు కల్పించింది. ఈ భావనే భగవద్గీతలో ”అన్నాద్భవంతి భూతానీ…” అనే శ్లోకంలో కన్పిస్తుంది.
ఇక, రెండోయాత్ర దేవయానం. ఈ యాత్ర ముక్తిపొందిన వారిది. జీవన్ముక్తులు ఈ యాత్ర కొనసాగిస్తారు. వీరిది నిష్కామకర్మ. వీరు తిరిగి మరలా పుట్టరు. వీరి ఆత్మకు మానవ జీవనం నుండి విముక్తి కల్గుతుంది.దీన్నే మోక్షం అన్నారు.
దీన్ని ఇలా చెప్పింది.
”మరణించిన వారి ఆత్మ మొదట కిరణాల్ని చేరుతుంది. అక్కడి నుండి పగలు లోచేరి,అటు నుండి సూర్యలోకం , తరువాత చంద్రలోకం ,అక్కడి నుండి మెరుపు లో చేరి అక్కడ నుండి
బ్రహ్మలోకం పోతుంది. అక్కడ ‘అ-మానవులు’ ఉంటారు. వారు ఈ జీవుణ్ణి (ఆత్మను) బ్రహ్మ దగ్గరకు తీసుకుపోతారు. ఆత్మ అక్కడే ఉండిపోతుంది.ఈ భావనే ఆ తర్వాత కైవల్యంగా మారింది. శైవులు శివైక్యం పొందటం, విష్ణు భక్తులు వైకుంఠానికి పోవడం జైనులు, బౌద్ధులు నిర్వాణం పొందడం- ఇలా విభిన్న పద్ధతులుగా వ్యక్తం అయ్యింది.
అయితే, ఛాందోగ్యంలో గమనించాల్సిన విషయమేమిటంటే ముక్తి పొందిన ఆత్మ- వేదాల్లో సూపర్ పవర్‌గా ఉన్న, అప్సరసలున్న ఇంద్రలోకం పోలేదు. కొత్తగా రూపొందిన బ్రహ్మలోకం వెళ్ళింది. ఇది వేదాన్ని బలంగా తిరస్కరించడమే.
బృహదారణ్యకోపనిషత్తు ఇలా చెపుతుంది.
”జీవుడు చనిపోయాక అతని శరీరంలోని ఇంద్రియాలు తిరిగి భూతాల్లో కలిసిపోతాయి. ఆత్మ మాత్రం ఆకాశంలో కలిసిపోతుంది”
ఈ ఉపనిషత్‌లో ‘ఆత్మ’ అనేది ‘ఆకాశం’ అనే ఇంద్రియానికి సంబంధించిందిగా భావించారు.
కేనోపనిషత్ 'బ్రహ్మం' గురించిచెప్పలేదు.
'ఆత్మ'చుట్టే తిరుగింది.ఇది ఆత్మ ఎంత అస్పష్టమో అంత అస్పష్టంగా చెప్పింది.దీని ప్రకారం" నాకు ఆత్మజ్ఞానం కలిగిందని అనేవాడికి ఆ జ్ఞానం లేదు.అలా ఉందనుకోనివాడికే'అది' ఉంటుంది. ఎందుకంటేచూస్తున్నాననుకునేవాడు
దాన్ని చూడలేడు. చూడలేననిఅనుకున్నవాడే దాన్ని చూస్తాడు."అంటే..ఆత్మను తెలుసుకునేవాడుమనో వికారాదులను అధిగమించిఆత్మ నుంచి విడిపోయినపుడే ఆ 'దాన్ని' చూడటం సాధ్యం.ఇలా ఆత్మను రకరకాలుగా ఉపనిషత్తులు రాసిన వారు చెప్పుకున్నారు.
ముండకోపనిషత్తు లో
అయమాత్మా బ్రహ్మ (ఈ ఆత్మే బ్రహ్మం).ఇక్కడ ఆత్మ, బ్రహ్మం అనేవి ఒకటే అని చెప్పారు. ఇందుకు ఉదాహరణగా సముద్రము, అందులోని కెరటం(అల) తీసుకున్నారు. ఒక్కో కెరటం ప్రత్యేకమైన ఉనికి ఉన్న వస్తువుగా అనిపిస్తుంది. కాని ఆకెరటం ఒడ్డును తాకి పడిన తరువాత కెరటానికి, సముద్రానికి తేడా లేదని తెలుస్తుంది. అలాగే ఆత్మ, బ్రహ్మం కూడా అలాంటిదే నన్నారు.ఆత్మ జ్యోతి స్వరూపం లో ఉంటుందన్నారు.ఆత్మ ప్రకాశవంతమైంది. అణువు కంటే సూక్ష్మం.ఇది అంతటా వ్యాపించింది. అత్యంత సూక్ష్మమైనది సృష్టికి మూలకారణమైంది.
అపరిమితమైన జ్యోతి స్వరూపమైన ఆత్మ
ఊహాతీతమైన బ్రహ్మం గా ప్రకాశిస్తుంది. అది
సూక్ష్మతి సూక్ష్మం గా ఈ శరీరలోనే జ్యోతిని వెదజల్లుతూ ఉంటుందని చెప్పినారు.
శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఆత్మ గురించి చెప్పినట్లు రాశారు.వీరి ప్రకారం ఆత్మ రెండు విధాలు. 1. జీవాత్మ 2. పరమాత్మ. విశ్వవ్యాప్తంగా ఉండే శక్తి 'పరమాత్మ'అని, జీవులలో ఉండే తన అంశ 'జీవాత్మ' అన్నాడు. ఈ జీవాత్మే 'ఆత్మ. ఆత్మ నాశనం కాదు. దాన్ని శస్త్రం ఏదీ ఛేదించలేదు. అగ్ని దహించలేదు. నీరు తడపలేదు.వాయువు ఆర్పలేదు అని వివరించాడు.
ఆత్మ లను పలికించేదే అసలైన భాష అన్నాడు సినారె.బౌద్దాన్ని భారతదేశం నుండి తరిమేయడంతో భారతదేశం తన ఆత్మను కోల్పోయిందని గురజాడ అన్నారు. శంకరాచార్యుని గొప్ప తనాన్ని చాటడానికి అనేక కథలు అల్లారు.ఆయన ప్రతిష్ట దెబ్బ తినకుండా ఉండేందుకు ఆత్మను ఉపయోగించు కున్నారు.ఆయన ఒకసారి పండితులతో వాదన చేస్తున్న సందర్భంలో ఆయన సన్యాసి కాబట్టి సంసార ధర్మాల గురించి ఆయనకేంతెలీదని ఆక్షేపణ చేస్తారు.దాంతో ఆయన అప్పుడే మరణించిన ఆ వూరి రాజు శరీరంలోకి తన ఆత్మను పంపిస్తాడు. దీన్ని పరకాయంలోకి (శరీరంలోకి) ప్రవేశం అన్నారు.ఇక్కడ ఆత్మ భావనను ఉపయోగించు కున్నారు.ఇంకో సందర్భంలోశంకరునికి ఎదురుగా ఒక దళితుడు వస్తాడు. అప్పుడాయన తొలగు తొలగు అంటాడు.అప్పుడా దళితుడు నన్నుపొమ్మంటావా?నా ఆత్మను పొమ్మంటావా?అడుగుతాడు.దాంతో శంకరునికిజ్ఞానోదయమవుతుంది. శంకరుని ప్రతిష్టకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు శివుడే దళితుని వేషంలో వచ్చినట్లు కథలల్లారు.
ఇలా కవులు రచయితలు ఆత్మ భావనను తమ రచనల్లో ఇప్పటికీ ఉపయోగించు కుంటున్నారు.
ప్రజానీకంలో మాత్రం ఆత్మ భావన పలు రకాలుగా ఉంది. తీవ్రమైన కోరికలు నెరవేరకుండా మరణించిన మనిషి ఆత్మ దయ్యంగా మారుతుందని ఇప్పటికీ భావిస్తున్నారు.ఈ భావన ఆధారంగా ఇటీవల అరుంధతి సినిమా లో ఒక పాత్ర అరంధతిపై వున్న మోహం తో చనిపోయి అతని ఆత్మ ఆమెకోసం ఆరాటపడుతున్నట్లు కథ సృష్టించారు.ఇలా ప్రజానీకంలో ఉన్న భావనను ఉపయోగించుకున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో దయ్యలైన ఆత్మ లు తిరుగుతుంటాయని భ్రమపడుతుంటారు.గతంలో కొరివి దయ్యాలుడేవి.
ఇప్పుడు కరెంటు(వెలుగు) రావడంతో
అవి వెళ్లి పోయాయని చెపుతుంటారు.ఇవన్నీ ప్రజల్లో ఆత్మల చుట్టూ అల్లుకున్న అనేక మూఢత్వభావనలు.
అప్పుడప్పుడూ కొంతమంది ఆత్మలను వీడియో తీశామని ఆత్మలున్నాయని యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నారు.ఇవన్నీ గ్రాఫిక్స్.
పెద్దల దినమని(వర్ధంతి) జరుపుతారు. ఇదికూడా ఆత్మ లకు సంబంధించినదే.వారొచ్చి ఇక్కడ పెట్టిన భోజనాదులను స్వీకరిస్తారని నమ్ముతుంటారు.
క్రైస్తవంలో దయ్యాలను సాతాను అన్నారు.ఇస్లాంలో సైతాన్ అన్నారు. థేరవాద బౌద్దమొక్కటే ఇవన్నీ తృణీకరించి నేటి శాస్త్రవిజ్ఞానం ఆధారంగా తమ పద్దతులను పాటిస్తోంది.
ఆదిమ సమాజంలో సహజ మరణాలు దాదాపు లేవు.శత్రువుల చేతిలో ను జంతువుల బారిన పడే మనిషి మరణించేవాడు. పోరాటంలో గాయపడి సృహతప్పిన వాడికి మరణించిన వాడికి పెద్దగా తేడా తెలిసేది కాదు. సృహతప్పిన మనిషి మళ్లీ మేలుకొనే వాడు.దాన్ని చూసి మరణించిన మనిషి కూడా తిరిగి మేల్కొంటాడని నమ్మకం ఏర్పడింది. ఇదే మనిషిలో ఏదో తెలియని ఒక అదృశ్య శక్తి ఉందనే ఒక నమ్మకం ఏర్పడడానికి కారణమయింది. అలాగే మనిషి నిద్రించే సమయంలో కలలు కంటుంటాడు .అప్పుడు కూడా మనిషి మరణించిన వాని లాగా ఉంటాడు .
మనిషి నిద్రిస్తున్నప్పుడు శరీరంలోని ఒక అదృశ్య శక్తి బయటికి వెళ్లి ఎక్కడెక్కడో తిరిగి మళ్ళీ నిద్ర లేవగానే శరీరం లోకి వస్తోంది అని భావించే వాళ్ళు. ఈ భావనే ఆత్మభావన కు దారి తీసిందన్నాడు గ్రాంట్ అల్లెన్ తన 'ఎవవల్యూషన్ ఆఫ్ ది ఐడియా ఆఫ్ గాడ్' లో .
తీరని కోరికలతో నున్న ఆత్మలు మరణించిన తర్వాత కూడా ఇక్కడిక్కడే బయట తిరుగుతుంటాయని, అప్పుడప్పుడు శరీరాకృతిని ధరిస్తాయని నమ్మకం ఏర్పడింది క్రమంగా.
దీనినే దయ్యం అన్నారు.
వేట దశ నుంచి వ్యవసాయానికి మానవ సమాజం మారింది. శవాలను పాతిపెట్టడానికి భూమిని తవ్వి తిరిగి మట్టిని కప్పివాళ్ళు. అనుకోకుండానే ఆ భూమిలో విత్తనాలు పడి మొలకెత్తడం తో మరణించిన వారి ఆత్మలకు ఉన్న శక్తి వల్లనే చెట్లు పెరుగుతున్నాయని భావించేవారు
తొలిదశలో పాతిపెట్ట బడిన శవాలు తిరిగి లేచి వస్తాయని నమ్మేవారు. అలా జరక్కుండా వాళ్లు రాళ్లు పాతేవారు. క్రమంగా మరణించిన వారి ఆత్మలు రాళ్ల లోకి ప్రవేశిస్తాయని అందువల్ల ఆ రాళ్లు చాలా పవిత్రమైనవన్న భావన మొదలైంది
Comments
Post a Comment