ఆత్మభావాన్ని వ్యతిరేకించిన ప్రాచీన భౌతికవాదులు
*ఆత్మభావాన్ని వ్యతిరేకించిన ప్రాచీన భౌతికవాదులు*
బుద్ధుడు(2570ఏళ్లప్పుడు) ”ఆత్మ” భావనను అంగీకరించలేదు. ఆయన ప్రకృతి లో నిరంతరం మారుతూ ఉంటుందన్నారు. దాన్ని ఆయన అనిత్య అన్నాడు. ప్రతిది పాత దాన్నుంచి వస్తుందన్నాడు.
ఈ సిద్ధాంతం ప్రకారం ఆత్మ మారుతూ ఉండాలి. పైగా ఆత్మ నుంచి మరొకటి రావాలి. కానీ ఉపనిషత్కారులు ఆత్మ నిత్యం అన్నారు. దానికి నాశనం లేదన్నారు. ఆత్మ పరమాత్మ లో కలుస్తుందన్నారు. అందువల్ల ఉపనిషత్కారులు చెప్పిన దాన్ని ఆయన ఆమోదించలేదు.
ఇదే కాలంలో చాలామంది ‘ఆత్మ’ ‘దేవుడు’ ‘పునర్జన్మ’ మీద తమ తమ అభిప్రాయాలు చెప్పారు. వీరి రచనలను వీరి వ్యతిరేకులైన వైదికులు ధ్వంసం చేశారు.వీరి గురించి ప్రస్తావిస్తూ రాసిన రచనల్లో మనకు కొంత తెలుస్తుంది.
‘భగవంతుడు లేడు. ఆత్మలేదు. పునర్జన్మలేదు. పరలోకం లేదు.’ అని చార్వాకులు బలంగా చెప్పారు.
కణాదుడు ఒకడుగు ముందుకు వేసి ఈ ప్రపంచాన్ని దేవుడు సృష్టించలేదు. ప్రతి వస్తువు అనేక కణాల సముదాయమని అన్నాడు.
అసితకేశకంబళి ప్రకారం పరలోకం లేదు. మూర్ఖుడైనా, పండితుడైనా అందరూ చనిపోగానే శ్మశానం చేరతారు. అంతకు మించి ఇంకేం జరగదన్నాడు.ఇతని ప్రకారం జీవి పంచభూతాలతో ఏర్పడింది. నిప్పు,నీరు,నింగి, గాలి,మట్టి లతో జీవం ఏర్పడిందని చెప్పాడు.
”జీవుల పాపపుణ్య కర్మలు ముందే నిర్ణయించబడతాయి. ప్రత్యేక పూజల వల్ల, శీలం వల్ల, దానం వల్ల అవి మారవు. ఆరు జన్మల వరకూ జీవులు సుఖదుఃఖాలు అనుభవించాల్సిందే నని చెప్పాడు మక్కలిగోశాలి. ఇతని శిష్యుడే వర్థమాన మహావీరుడు.
ప్రతి వస్తువూ అచలమైంది. నిత్యమైంది. ఏ కర్మా దాని మూలాన్ని మార్చలేదు. (అంటే కర్మ ప్రభావం వస్తువు మీద పడదు) కాబట్టి పాపపుణ్యాలు అంటవంటాడు ప్రకృథ కాత్యాయన్.
పూరణ కశ్యపుని ప్రకారం ‘ఎంత మంచిపని చేసినా పుణ్యం రాదు. ఎంతచెడ్డ పనిచేసినా పాపం అంటదు’- అంటాడు.
ఇలా ఆత్మ భావన ఉపనిషత్తులకాలంలోనే వ్యతిరేకించారు.కానీ వీరి భావాలను వెలుగులోకి రాకుండా వీరి రచనలను నాశనం చేశారు.
___కుమారస్వామి,9490122229
Comments
Post a Comment