శంకరుని మిథ్యా వాదాన్ని ఖండించిన మధ్వాచార్య ద్వైత సిద్ధాంతం.

ఆత్మ వేరు.పరమాత్మ వేరు.ఈ
ప్రపంచం మిథ్య‌‌‌ కాదు. ఆత్మ కూడా మిథ్య కాదు.కొన్ని ఆత్మలు మంచివి.కొన్ని పనికిరానివి.మంచివాటికి మాత్రమే మోక్షం లభిస్తుంది.అంటే అవి పెద్ద పరమాత్మ లో కలిసిపోతాయి.
ఈ ఆత్మ లన్నింటికీ పెద్దగా ఉన్న పరమాత్మను వాసుదేవుని
పేర్కొన్నారు. 
ఆయనే ఈ సృష్టికి మూల కారకుడు అంటూ రామానుజుల సిద్దాంతానికి కొనసాగింపు నిచ్చిన సిద్దాంతం
మధ్వాచార్యులది.
      ఆయన తన సిద్ధాంతాన్ని ద్వైత సిద్ధాంతం అన్నారు.
దీన్ని నిరూపించడానికి మధ్వాచార్యుడు ఉపనిషత్తులకు, బ్రహ్మసూత్రాలకు, భగవద్గీతకు భాష్యాలు వ్రాసాడు. ఇంకా రుగ్వేదంలోని మొదటి 40 సూక్తాలకు, భారత భాగవతాలకు వ్యాఖ్యానం రాశాడు. తర్కంతోపాటు మొత్తం 37 గ్రంథాలను రచించాడు.

మద్వాచార్యులు కర్నాటక లోని ఉడిపి వద్ద నున్న పాజక గ్రామంలో క్రీ.శ. 1238 సంవత్సరంలో మధ్యగేహ భట్ట, వేదవతి దంపతులకు 
విజయదశమి రోజున జన్మించారు. ఇతని జీవిత కథను  నారాయణ పండితాచార్య రచించారు. అతనికి మొదట్లో వాసుదేవ అని పేరు పెట్టినారు. తరువాత కాలంలో పూర్ణప్రజ్ఞ, ఆనందతీర్థ, మధ్వాచార్యులుగా  ప్రసిద్ధులయ్యారు. 

 పదకొండేళ్ళ  వయసులోనే సన్యాసం వైపు ఆకర్షితుడయ్యాడు వాసుదేవ.ఉడిపి సమీపంలో నివసిస్తున్న,   అచ్యుతప్రజ్ఞ అనే గురువు ద్వారా సన్యాసం  స్వీకరించాడు. అప్పుడతని పేరు పూర్ణప్రజ్ఞుడుగా మారింది.
ఈయన కూడా దేశమంతా తిరిగి ఎనిమిది మఠాలను స్థాపించారు.
ఈయన సుమారు 79ఏళ్లు జీవించి క్రీ.శ.1317 లో దివంగతులయ్యారు.

Comments

Popular posts from this blog

మహాత్మా గాంధీ ఆచరణాత్మక తాత్విక చింతన

బాబాసాహెబ్ అంబేద్కర్‌ ఆధునిక తాత్విక చింతన

బౌద్ధం పునాదులపై లేచిన వైదిక ధర్మం