కురు,యదు,నాగుల మధ్య ఘర్షణే మహాభారతం
మహాభారత కాలం నాటికి గంగా నది ప్రాంతంలో కురు,యదు,నాగులు అనే మూడు తెగలుండేవి.కురు ప్రాంతానికి దక్షిణంగా మధురలో యాదవులుండేవారు.వీరుపశు పోషకులు.వీరే గాక వీరి చుట్టూ చాలా ఇతర తెగలు అడవుల్లో ఉండేవారు.వీరందరిని నాగ జాతి వారుగా పేరొందారు.కారణం వీరిలో చాలామంది నాగుల్ని పూజించేవారు. కొంతమంది పామును తెగకు చిహ్నంగా పెట్టుకునేవారు.ఆ రోజుల్లో ప్రతి గిరిజన తెగకుఒక గుర్తు ఉండేది.అది ఏదో ఒక జంతువో, చెట్టో ఉండేది.కురు,యదు,నాగుల మధ్య జరిగిన సంఘర్షణే భారతంకథలోకి వచ్చింది.
నాగ జాతి ప్రజలే ఇక్కడి మూలవాసులని చాలామంది భావిస్తున్నారు.
మహాభారత కథ నాగజాతిని అంతం చేస్తానని ప్రతిజ్ఞ చేసిన జనమేజయుడు సర్పయాగం అనే యజ్ఞం చేయడంతో ప్రారంభమవు తుంది.ఆ యజ్ఞ సమయంలో వైశంపాయనుడు జనమేజయునికి చెప్పిన కథే భారతం.
నాగులు అనే ఆటవిక తెగ దేశమంతటా విస్తరించిన చాలా బలవంతులైన తెగని అర్థమవుతుంది.లేకుంటే ప్రతిన బూని మరీ యజ్ఞం చేయాల్సిన అవసరం లేదు. నాగజాతి వారే ఈ దేశ మూలవాసులు. చివరికి నాగజాతి నాశనం కాకుండా యజ్ఞం ఆపివేయబడిందంటే ఆటవికులైన నాగులు ఆర్యులకు లొంగి పోయారని అర్థమవుతుంది. ఆటవికులైన నాగులు ఆర్యుల వర్ణవ్యవస్థ కు అంగీకరించి శూద్రులుగా మారిపోయారు.
Comments
Post a Comment